ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఐక్యూ వరుస స్మార్ట్ఫోన్ల లాంచింగ్‌తో(Smart Phone Launching) భారత్‌లో విస్తరిస్తోంది. బడ్జెట్(Budget) ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఐక్యూ అతి త్వరలోనే సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్(Smart Phone) లాంచింగ్‌కు సిద్దమవుతోంది. ఐక్యూ Z6 5G పేరుతో దీన్ని ఆవిష్కరించనుంది. గతేడాది విడుదలైన ఐక్యూ Z5కి సక్సెసర్‌గా రానుంది. అయితే, ఐక్యూ Z6 5G లాంచింగ్‌కు ముందే ధర, స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో(Online) లీకయ్యాయి. ఐక్యూ జెడ్6 5జీ ఫోన్లో 120Hz డిస్ప్లే, ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ ఉంటుందని లీకేజీలను బట్టి తెలుస్తోంది.
ఐక్యూ Z6 5G లాంచింగ్ డేట్ ఎప్పుడు?
ఐక్యూ ఇండియా వెబ్సైట్ ఐక్యూ Z6 5G లాంచ్‌ను టీజ్ చేసేందుకు ప్రత్యేక వెబ్‌పేజీని క్రియేట్ చేసింది. అయితే, ఈ ఫోన్ లాంచింగ్ తేదీని వెల్లడించనప్పటికీ.. ‘కమింగ్ సూన్’ అనే ట్యాగ్‌తో టీజ్ చేసింది.
భారతదేశంలో ఐక్యూ Z6 5G ధర (అంచనా)
భారతదేశంలో ఐక్యూ Z6 5G ధర దాదాపు రూ. 15,000 ఉంటుందని టిప్‌స్టర్ ముకుల్ శర్మ గురువారం ట్వీట్ చేశారు. అయితే, ప్రారంభపు ఆఫర్లో భాగంగా ఈ ఫోన్‌పై క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు అందించే అవకాశం ఉందని తెలిపాడు. గతేడాది ఐక్యూ Z5 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 23,900 ధర వద్ద ప్రారంభమైంది. ఇక, టాప్-ఎండ్ 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 26,990 వద్ద రిలీజైంది.
ఐక్యూ Z6 5G స్పెసిఫికేషన్లు (అంచనా)
ఐక్యూ బ్రాండ్ అధికారిక వెబ్సైట్లో కొన్ని స్పెసిఫికేషన్లను టీజ్ చేసింది. ఐక్యూ Z6 5G స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని తెలిపింది. దీనికి అదనంగా, టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఫోన్‌కు సంబంధించిన కొన్ని హార్డ్‌వేర్ వివరాలను ట్వీట్ చేశారు. ఈ ఫోన్ 120Hz ఫుల్ హెచ్ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఐక్యూ Z6 5G 8GB ర్యామ్‌తో పాటు 4GB వర్చువల్ ఎక్స్‌టెన్డ్ ర్యామ్‌ను కూడా అందించనుంది.
గత నెలలో, టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ఐక్యూ Z6 5G బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) డేటాబేస్‌లో మోడల్ నంబర్ వివో I2127తో కనిపించిందని పేర్కొన్నారు. ఈ ఫోన్ 6.58 -అంగుళాల AMOLED డిస్ప్లేతో వస్తుందని తెలిపారు. ఇది 6 GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ అనే రెండు విభిన్న వేరియంట్లలో లభించనుంది. బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.