ఐకూ జెడ్ సిరీస్‌లో ఇండియాలో వరుసగా స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. కొద్ది రోజుల క్రితం ఐకూ జెడ్6 5జీ (iQoo Z6 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే సిరీస్‌లో ఐకూ జెడ్6 4జీ (iQoo Z6 4G), ఐకూ జెడ్6 ప్రో 5జీ (iQoo Z6 Pro 5G) మోడల్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో ఐకూ జెడ్6 ప్రో 5జీ మొబైల్ రూ.25,000 లోపు బడ్జెట్‌లో రిలీజైతే, ఐకూ జెడ్6 4జీ మోడల్ రూ.15,000 బడ్జెట్‌లో రిలీజైంది. ఐకూ జెడ్6 4జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 (Snapdragon 680) ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 44వాట్ ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.
ఐకూ జెడ్6 4జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.13,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్, ఐకూ ఇండియా ఇస్టోర్‌లో కొనొచ్చు. అమెజాన్ సమ్మర్ సేల్‌లో ఆఫర్స్ పొందొచ్చు. లుమీనా బ్లూ, రావెన్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.
Poco M4 5G: రూ.15,000 లోపే మరో 5జీ స్మార్ట్‌ఫోన్... పోకో ఎం4 ప్రత్యేకతలివే
Performance that doesn’t burn your pocket. Get the #iQOOZ644W at just ₹13,999 along with 10% savings on credit/debit cards and EMI. Sales start on Great Summer Sale on Amazon#iQOO #FullyLoaded #AmazonSpecials #NewProductLaunch #FullyLoaded #iQOOZ6 #iQOOZ6Pro5G pic.twitter.com/yhJIjyFbsR
— iQOO India (@IqooInd) April 27, 2022
ఐకూ జెడ్6 4జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ ఇటీవల లాంఛ్ అయిన మోటో జీ52 స్మార్ట్‌ఫోన్‌తో పాటు రెడ్‌మీ 10 పవర్, రియల్‌మీ 9 4జీ, ఒప్పో కే10, రెడ్‌మీ 10, రెడ్‌మీ నోట్ 11, వివో వై33టీ, రియల్‌మీ 9ఐ మొబైల్స్‌లో ఉంది. ఇందులో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో 12జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
Moto G52: బడ్జెట్ ధరలో మోటో జీ52 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే
ఐకూ జెడ్6 4జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2మెగాపిక్సెల్ బొకే సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 44వాట్ ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్ లభిస్తుంది. ఐకూ జెడ్6 4జీ స్మార్ట్‌ఫోన్‌లో 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్ సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IQoo, Mobile News, Mobiles, Smartphone