Home /News /technology /

IQOO Z5X WITH 120HZ DISPLAY MEDIATEK DIMENSITY 900 SOC LAUNCHED PRICE SPECIFICATIONS GH SK

iQoo Z5x: ఐక్యూ జెడ్​ 5x 5జీ స్మార్ట్​ఫోన్ లాంచ్​.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే లుక్​, ఫీచర్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐక్యూ Z5x ఆండ్రాయిడ్ 11 ఆరిజినోస్ 1.0తో పనిచేస్తుంది. ఇది 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్​ప్లేతో వస్తుంది.

iQoo Z5x: ఐక్యూ జెడ్​ 5x 5జీ స్మార్ట్​ఫోన్ లాంచ్​.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే లుక్​, ఫీచర్లు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్​ తయారీ దిగ్గజం ఐక్యూ మరో బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ను లాంచ్​ చేసింది. గత నెలలో విడుదలైన ఐక్యూ Z5కి కొనసాగింపుగా ఐక్యూ Z5x 5జీ (iQoo Z5x 5G) స్మార్ట్​ఫోన్​ను బుధవారం ఆవిష్కరించింది. అయితే ఈ స్మార్ట్​ఫోన్​ ప్రస్తుతానికి చైనా మార్కెట్​లోనే విడుదలైంది. భారత మార్కెట్​లో లాంచింగ్​పై స్పష్టత లేదు.

Vivo Y3s: వివో నుంచి రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

ఐక్యూ Z5x ధర, లభ్యత

ఐక్యూ Z5x స్మార్ట్​ఫోన్ 6 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ CNY 1,599 (సుమారు రూ. 18,800) ధర వద్ద లభిస్తుంది. 8 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్​ CNY 1,699 (సుమారు రూ. 20,000)​, 8 జీబీ + 256 జీబీ వేరియంట్​ CNY 1,899 (సుమారు రూ. 22,300) ధర వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ వేరియంట్లు బ్లాక్, వైట్, శాండ్‌స్టోన్ ఆరెంజ్ కలర్స్​లో లభిస్తాయి. చైనాలో వీటి ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బుకింగ్​ చేసుకున్న కస్టమర్లకు అక్టోబర్ 30 నుంచి స్మార్ట్​ఫోన్​ డెలివరీ చేస్తారు.

SBI New Feature: మీరు ఎస్‌బీఐ కస్టమరా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే

ఐక్యూ Z5x స్పెసిఫికేషన్లు

ఐక్యూ Z5x ఆండ్రాయిడ్ 11 ఆరిజినోస్ 1.0తో పనిచేస్తుంది. ఇది 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్​ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం ఇందులో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇది 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌ కెమెరాలతో వస్తుంది. దీని ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించింది.

WhatsApp: వాట్సప్ ఛాట్స్ హైడ్ చేయాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. 5G, 4G LTE, వైఫై 6, బ్లూటూత్ v5.2, జీపీఎస్​, యూఎస్​బీ టైప్-సి పోర్ట్​, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి అందించింది. మరోవైపు, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్, సామీప్య సెన్సార్లను చేర్చింది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్​తో వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​లో 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ గల 5,000mAh బ్యాటరీని అందించింది. 44W అడాప్టర్‌ని ఉపయోగించి కేవలం 30 నిమిషాల్లో 58 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. దీనిలోని థర్మల్ మేనేజ్మెంట్ కోసం ఐదు లేయర్ల లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ని అందించింది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Information Technology, Smart phone, Smartphones, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు