దసరా సేల్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి అలర్ట్. చైనాకు చెందిన ఐకూ బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. ఐకూ జెడ్5 మోడల్‌ను ఇండియాలో పరిచయం చేసింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ కొద్ది రోజుల క్రితమే చైనాలో రిలీజ్ అయింది. ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌కు ఈ మొబైల్‌ను పరిచయం చేసింది ఐకూ ఇండియా. రూ.25,000 లోపు బడ్జెట్లో రిలీజ్ అయిన 5జీ స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ సెగ్మెంట్లో గట్టి పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్, వన్‌ప్లస్ నార్డ్ 2 లాంటి మోడల్స్ ఉన్నాయి. అంతేకాదు... సాంసంగ్ నుంచి సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ, సాంసంగ్ గెలాక్సీ ఎం42 5జీ, షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ లాంటి మోడల్స్ రిలీజ్ కానున్నాయి. ఈ మోడల్స్‌కు ఐకూ జెడ్5 స్మార్ట్‌ఫోన్ గట్టి పోటీ ఇవ్వనుంది.
ఐకూ జెడ్5 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.23,990. ఇది 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. దీంతో పాటు 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా రిలీజ్ అయింది. హైఎండ్ వేరియంట్ ధర రూ.26,990. అక్టోబర్ 3న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఐకూ జెడ్5 సేల్ ప్రారంభం కానుంది. తొలి సేల్‌లోనే రూ.3,000 తగ్గింపు పొందొచ్చు. అమెజాన్ కూపన్ ద్వారా రూ.1,500, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.1,500 తగ్గింపు లభిస్తుంది.
We’ve unleashed iQOO Z5, the #FullyLoaded phone made for the GenZ.
Starting from INR 23,990 with additional festive offers of extra INR 3,000 off.
ఐకూ జెడ్5 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో కొనొచ్చు. ర్యామ్ ఎక్స్‌ప్యాండ్ చేసే ఫీచర్ కూడా ఉంది. ఐకూ జెడ్5 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
ఐకూ జెడ్5 స్మార్ట్‌ఫోన్‌లో 64మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + ఫన్‌టచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఆర్కిటిక్స్ డాన్, మిస్టిక్ స్పేస్ కలర్స్‌లో కొనొచ్చు.
యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లూటూత్ 5.2 వర్షన్, యూఎస్బీ ఓటీజీ, ట్రైబ్యాండ్ వైఫై, 3.5ఎంఎం ఆడియో జాక్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వీడియో గేమ్స్ ఆడేవారి కోసం వీలీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, అల్ట్రా గేమ్ మోడ్ 2.0, డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్ లాంటి ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.