iQoo Z5: ఐకూ జెడ్​5 స్మార్ట్​ఫోన్​ వచ్చేసింది... 64 మెగాపిక్సెల్​ కెమెరాతో పాటు అదిరిపోయే ఫీచర్లు

iQoo Z5: ఐకూ జెడ్​5 స్మార్ట్​ఫోన్​ వచ్చేసింది... 64 మెగాపిక్సెల్​ కెమెరాతో పాటు అదిరిపోయే ఫీచర్లు

iQoo Z5 | ఐకూ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఐకూ జెడ్5 (iQoo Z5) స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ, వివో సబ్​బ్రాండ్​ ఐకూ తన మార్కెట్​ను విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే వరుసగా స్మార్ట్​ఫోన్లను (Smartphone) విడుదల చేస్తుంది. ఐకూ తాజాగా చైనాలో నిర్వహించిన లాంచింగ్​ ఈవెంట్​లో ఐకూ Z5ని (iQoo Z5) విడుదల చేసింది. ఈ స్మార్ట్​ఫోన్​ ఐకూ Z3కి నెక్స్ట్ జనరేషన్​ ఫోన్​గా విడుదలైంది. చైనాలో 4 సంఖ్యను దురదృష్టకరమైనదిగా పరిగణిస్తారు. అందుకే, ఐకూ జెడ్​3 తర్వాత నేరుగా ఐకూ జెడ్​ 5ని (iQoo Z5) రిలీజ్​ చేశారు. ప్రస్తుతానికి చైనా మార్కెట్​లోకి లాంచ్​ అయిన ఐకూ జెడ్ 5​.. ఈనెల 27న భారత మార్కెట్​లోకి రానుంది.

Upcoming Smartphones: కొత్త మొబైల్ కొనాలా? దసరా ముందు రిలీజ్ అయ్యే 14 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

ధర, లభ్యత


ఐకూ Z5 వైట్​, డార్క్​ బ్లూ, గ్రేడియంట్​ బ్లూ అనే మొత్తం మూడు కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది. 8GB+128GB ట్రిమ్ వేరియంట్​ CNY 1,899 (రూ. 21,684) వద్ద అందుబాటులో ఉంటుంది. 12GB+256GB వేరియంట్ CNY 2,299 (రూ. 26,255) వద్ద లభిస్తుంది. దీంట్లో 8GB ర్యామ్​, 256GB స్టోరేజ్‌ గల మిడ్​ వేరియంట్​ CNY 2,099 (రూ. 23,970) వద్ద అందుబాటులో ఉంటుంది. చైనాలో ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే వీటి అమ్మకాలు అధికారికంగా సెప్టెంబర్ 28న ప్రారంభమవుతాయి.

Oppo Smartphone Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ 10 ఒప్పో స్మార్ట్‌ఫోన్లపై రూ.4,000 వరకు డిస్కౌంట్

స్పెసిఫికేషన్లు


ఐకూ జెడ్​5 స్మార్ట్​ఫోన్​ 6.67-అంగుళాల FHD+ IPS LCD డిస్​ప్లేతో వస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G తో పనిచేస్తుంది. ఇందులో 8/12GB ర్యామ్​, 128/256GB స్టోరేజ్‌ను సంస్థ అందించింది. Z5 వెనుక భాగంలో Z3 వలె ట్రిపుల్ కెమెరా సెటప్​ను అందించింది. దీనిలో 64MP మెయిన్​ శామ్‌సంగ్ GW3 సెన్సార్‌ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ షూటర్ కెమెరా, 2MP మాక్రో మాడ్యూల్ కెమెరాలను చేర్చింది. ఐకూ Z3లో 4,400 mAh బ్యాటరీ అందించగా.. Z5లో మాత్రం 5,000 mAh బ్యాటరీని చేర్చింది. ఐకూ Z5 ఆండ్రాయిడ్ 11 ఆధారిత వివో ఆరిజిన్ ఓఎస్​తో రన్​ అవుతుంది. దీనిలో స్టీరియో స్పీకర్లు, హెడ్‌ఫోన్ జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి అదనపు ఫీచర్లను కూడా జోడించింది.
Published by:Santhosh Kumar S
First published: