iQoo Z3 5G: మరో 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ఐకూ జెడ్3 ప్రత్యేకతలు ఇవే

iQoo Z3 5G: మరో 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ఐకూ జెడ్3 ప్రత్యేకతలు ఇవే

iQoo Z3 5G | రూ.20,000 లోపు బడ్జెట్‌లో ఇండియాలో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఐకూ జెడ్3 5జీ మొబైల్ ప్రత్యేకతలు తెలుసుకోండి.

  • Share this:
    కొంతకాలంగా ఐకూ జెడ్3 టీజర్లు, లీక్స్ ప్రచారంలో ఉన్నాయి. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు iQoo Z3 5G ఇండియాలో రిలీజ్ అయింది. వర్చువల్ ఈవెంట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది కంపెనీ. iQoo Z3 5G మార్చిలోనే చైనాలో రిలీజ్ అయింది. దీంతో స్పెసిఫికేషన్స్ కొంతవరకు తెలిసినవే. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 768జీ ప్రాసెసర్, 4,400ఎంఏహెచ్ బ్యాటరీ, 55వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఐకూ జెడ్3 ప్రారంభ ధర రూ.19,990. ఇది 6జీబీ+128జీబీ వేరియంట్ ధర. ఇక 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.20,990 కాగా, హైఎండ్ వేరియంట్ 8జీబీ+256జీబీ ధర రూ.22,990. ఇండియాలో రూ.20,000 లోపు బడ్జెట్‌లో ఇప్పటికే రియల్‌మీ నార్జో 30 ప్రో, రియల్‌మీ ఎక్స్7, రియల్‌మీ 8 5జీ, ఒప్పో ఏ74 5జీ, ఒప్పో ఏ53ఎస్ 5జీ లాంటి మోడల్స్ ఉన్నాయి.

    Poco M3 Pro 5G: పోకో ఇండియా సంచలనం... రూ.13,999 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

    Covid self-testing kit: ఇంట్లోనే కరోనా టెస్ట్... ఫ్లిప్‌కార్ట్‌లో కోవిడ్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్ సేల్

    ఐకూ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫామ్‌లో సేల్ మొదలైంది. లాంఛ్ ఆఫర్స్ కూడా ప్రకటించింది ఐకూ. ఏడు రోజులు స్మార్ట్‌ఫోన్ వాడిన తర్వాత నచ్చకపోతే 100 శాతం మనీ బ్యాక్ గ్యారెంటీ ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులతో కొంటే రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ కూపన్స్ ద్వారా మరో రూ.1,000 వరకు తగ్గింపు పొందొచ్చు. అంటే ఐకూ జెడ్3 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.17,490 ధరకు, 8జీబీ+128జీబీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.18,490 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.20,490 ధరకు సొంతం చేసుకోవచ్చు.

    Redmi Note 10 Pro: ఈ స్మార్ట్‌ఫోన్ ధర పెరిగింది... కొత్త రేట్స్ ఇవే

    Realme 5G Phone: రియల్‌మీ మరో సంచలనం... రూ.7,000 ధరకే 5జీ ఫోన్


    ఐకూ జెడ్3 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 768జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐకూ జెడ్3 స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ GW3 సెన్సార్‌ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్‌ రియర్ కెమెరా సెటప్ ఉంది. కెమెరాలో నైట్ మోడ్, పోర్ట్‌రైట్, ఫోటోగ్రఫీ, వీడియో, పనోరమా, లైవ్ ఫోటో, స్లో-మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో మోడ్, ఏఆర్ స్టిక్కర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఐకూ జెడ్3 4,400ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 55వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 19 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం ఛార్జింగ్ అవుతుంది. ఆండ్రాయిడ్ 11 + ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 5జీ, 4జీ ఎల్‌టీఈ సపోర్ట్ ఉంది.
    Published by:Santhosh Kumar S
    First published: