iQoo U1x: రూ.10,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన ఐకూ

iQoo U1x | ఇండియాలో ఇప్పుడిప్పుడే కొత్త స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేస్తున్న చైనాకు చెందిన ఐకూ కంపెనీ తక్కువ బడ్జెట్‌లో కొత్త మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది.

news18-telugu
Updated: October 23, 2020, 3:18 PM IST
iQoo U1x: రూ.10,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన ఐకూ
iQoo U1x: రూ.10,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన ఐకూ
  • Share this:
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQoo లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇండియాలో ఇప్పటికే ఐకూ బ్రాండ్ హైఎండ్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చైనాలో ఐకూ యూ1ఎక్స్ మోడల్‌ను రిలీజ్ చేసింది. మూడు నెలల క్రితం వెనీలా ఐకూ యూ1 మోడల్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. ఇప్పుడు ఐకూ యూ1ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. చైనాలో నవంబర్ 1న సేల్ మొదలవుతుంది. ఐకూ యూ1ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర 899 యువాన్లు (సుమారు రూ.10,000) కాగా 6జీబీ+64జీబీ వేరియంట్ ధర 999 యువాన్లు (సుమారు రూ.11,100). ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ+128జీబీ ధర 1,199 యువాన్లు (సుమారు రూ.13,300). భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అవుతుందా లేదా అన్న స్పష్టత లేదు. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో రిలీజ్ చేయడంపై తర్వాత ప్రకటిస్తామని ఐకూ కంపెనీ తెలిపింది.

WhatsApp: వాట్సప్ యూజర్లకు అద్భుతమైన ఫీచర్... ఇక ఆ టెన్షన్ ఉండదు

Samsung Galaxy M31 Prime: సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్ సేల్ మొదలైంది... అమెజాన్‌లో భారీ డిస్కౌంట్

ఐకూ యూ1ఎక్స్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.51 అంగుళాల హెచ్‌డీ+, 720x1,600 పిక్సెల్స్
ర్యామ్: 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + ఐకూ కస్టమ్ యూఐ
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: మార్నింగ్ ఫారెస్ట్, లైట్ బ్లాక్
ధర:
4జీబీ+64జీబీ- సుమారు రూ.10,000
6జీబీ+64జీబీ- సుమారు రూ.11,100
6జీబీ+128జీబీ- సుమారు రూ.13,300
Published by: Santhosh Kumar S
First published: October 23, 2020, 3:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading