ఐకూ ఇండియా నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఐకూ నియో 7 5జీ (iQOO Neo 7 5G) మొబైల్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. భారీ ఫీచర్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది ఐకూ ఇండియా. ఇది గతేడాది రిలీజైన ఐకూ నియో 6 (iQOO Neo 6) అప్‌గ్రేడ్ వర్షన్. చూడ్డానికి ఐకూ నియో 6 మొబైల్ లాగానే ఉన్నా ఫీచర్స్‌లో కొన్ని మార్పులు ఉన్నాయి. ఇందులో 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్, 64MP ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.28,499. బ్యాంక్ ఆఫర్స్‌తో ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఐకూ నియో 7 5జీ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.
ఐకూ నియో 7 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999. అమెజాన్‌లో కొనొచ్చు. లాంఛ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఎస్‌బీఐ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొంటే రూ.1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొనేవారికి అదనంగా రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, ఫ్రాస్ట్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు.
OnePlus 11: కాసేపట్లో వన్‌ప్లస్ 11 సేల్... రూ.24,940 విలువైన బెనిఫిట్స్
The sale for India’s Most Powerful Smartphone*, the #iQOONeo7 5G with MediaTek Dimensity 8200 is live now on @amazonIN! You can unlock your #PowerToWin at just ₹28,499!* Buy Now: https://t.co/0dIXrocFc7#AmazonSpecials *Inclusive of Bank Offers pic.twitter.com/gGLYsxXwVC
— iQOO India (@IqooInd) February 16, 2023
ఐకూ నియో 7 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లేకు బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌తో రిలీజైన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 వరకు అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది.
ఐకూ నియో 7 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ స్టైల్ వీడియోలు రికార్డ్ చేయడానికి వ్లాగ్ మోడ్ ఉంది. డ్యూయెల్ వీడియో రికార్డ్ చేయొచ్చు.
Coca-Cola Smartphone: ఈరోజే కోకా-కోలా మొబైల్ సేల్... ఈఎంఐ రూ.739 మాత్రమే
ఐకూ నియో 7 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. కేవలం 25 నిమిషాల్లో పూర్తిగా ఛార్జింగ్ చేయొచ్చు. 10 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, IQoo, Smartphone