హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iQOO Neo 6: త్వరలో ఐక్యూ కంపెనీ నుంచి నియో 6 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. దీని ధర, ప్రత్యేకతలు తెలుసుకోండి..

iQOO Neo 6: త్వరలో ఐక్యూ కంపెనీ నుంచి నియో 6 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. దీని ధర, ప్రత్యేకతలు తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐక్యూ నియో 6 (iQOO Neo 6) పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఏప్రిల్ 13న చైనాలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Weibo పోస్ట్ ద్వారా ఐక్యూ కంపెనీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ (iQOO) మన దేశంలో ఇప్పటికే ఎన్నో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. బడ్జెట్, ప్రీమియం ఫోన్ల మార్కెట్‌లో మంచి వాటా సాధించాలని చూస్తున్న ఈ సంస్థ మరో కొత్త ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఐక్యూ నియో 6 (iQOO Neo 6) పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఏప్రిల్ 13న చైనాలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Weibo పోస్ట్ ద్వారా ఐక్యూ కంపెనీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 2021లో విడుదలైన iQOO Neo 5 వేరియంట్‌కు సక్సెసర్‌గా Neo 6ను రూపొందించినట్టు ఈ పోస్ట్‌లో పేర్కొంది. ఈ కొత్త ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌ ఉండే 4,700mAh బ్యాటరీతో కంపెనీ దీన్ని తయారు చేసింది.

Mobile Radiation: యూజర్లకు అలర్ట్.. ఆ మొబైళ్ల నుంచి వెలువడుతున్న రేడియేషన్.. ఇది ఎంత ప్రమాదకరం..?


ఐక్యూ నియో 6 స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో ప్రైమరీ కెమెరా సెన్సార్ కెపాసిటీ 64-మెగాపిక్సెల్. ఈ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఈ డివైజ్ 5G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో 12GB RAM ఉంటుంది. ఈ ఫోన్‌ను 6.62 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేతో రూపొందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. దీని ధర మన కరెన్సీలో రూ.30 వేల వరకు ఉండవచ్చు. ఈ ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేయడంపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇప్పటివరకు ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ కర్వ్ ఎడ్జ్ డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. వేగన్ లెదర్ ఫినిషింగ్ బ్యాక్ కవర్‌తో ఫోన్‌ను డెలివరీ చేయనుంది. ఐక్యూ నియో 6 మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో.. బ్లాక్, బ్లూ, ఆరెంజ్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే చైనాలో ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత.. దీనికి సంబంధించిన అన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు తెలియనున్నాయి.

Jobs In Capzemini: గుడ్ న్యూస్ చెప్పిన క్యాప్‌జెమిని.. ఈ ఏడాది 60 వేల ఉద్యోగాలు.. ఈ వివరాలిలా..


* ఆ మోడల్ కూడా..

ఐక్యూ ఇటీవల మిడ్ రేంజ్ ఫోన్ Z6ను ట్విట్టర్‌లో టీజ్ చేసింది. ఇండియాలో ఈ ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్టు హింట్ ఇచ్చింది. అయితే దీని స్పెసిఫికేషన్లపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. GSMArena రిపోర్ట్ ప్రకారం.. ఐక్యూ జెడ్ 6 మిడ్ రేంజ్ ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 778G SoC చిప్‌సెట్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఇంతకు ముందు విడుదల చేసిన Z5 వేరియంట్‌లో ఉపయోగించిన అదే చిప్‌సెట్‌తో కొత్త జెడ్ 6 మోడల్ లాంచ్ కానుంది.

Published by:Veera Babu
First published:

Tags: 5G Smartphone, China, Smartphones

ఉత్తమ కథలు