ఐకూ ఇండియా మరో స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో రిలీజ్ చేసింది. నియో సిరీస్‌లో ఐకూ నియో 6 (iQoo Neo 6) స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, ఈ4 అమొలెడ్ డిస్‌ప్లే, 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 4,700ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గేమింగ్ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన మొబైల్ కావడం విశేషం. ఐకూ నియో 6 స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఐకూ కూలింగ్ బ్యాక్ క్లిప్ రూ.2,499 ధరకు, ఐకూ గేమింగ్ ఫింగర్ స్లీవ్స్ రూ.249 ధరకు రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గేమింగ్ స్మార్ట్‌ఫోన్లకు ఐకూ నియో 6 గట్టి పోటీ ఇవ్వనుంది.
ఐకూ నియో 6 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999. అమెజాన్‌లో సేల్ ప్రారంభమైంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.3,000 డిస్కౌంట్, అమెజాన్ కూపన్ ఆఫర్‌తో రూ.1,000 తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్‌తో 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.25,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.29,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేసేవారికి అదనంగా రూ.3,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ జూన్ 5 వరకే. సైబర్ రేజ్, డార్క్ నోవా కలర్స్‌లో కొనొచ్చు.
Smart TV: మేడ్ ఇన్ హైదరాబాద్ స్మార్ట్ టీవీ... ధర రూ.10,000 లోపే
Seize the Neo #PowerToWin. The all-new #iQOONeo6 with industry-leading Snapdragon 870 5G & 80W FlashCharge can be yours now! Starting at Rs.25,990*. The sale is live now on @amazonIN
Buy Now: https://t.co/wHF2wk4tm1#iQOO #AmazonSpecials
*Incl. Bank Offer & Amazon Coupon Discount pic.twitter.com/Rp4aeBTqCV
— iQOO India (@IqooInd) May 31, 2022
ఐకూ నియో 6 ఫీచర్స్
ఐకూ నియో 6 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ఫ్రింట్ సెన్సార్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్‌మీ జీటీ నియో 2, ఎంఐ 11ఎక్స్, వన్‌ప్లస్ 9ఆర్ లాంటి మోడల్స్‌లో ఉంది. ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
Jio Offer: గుడ్ న్యూస్... ఈ స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి రూ.7,200 విలువైన బెనిఫిట్స్
ఐకూ నియో 6 స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా సెటప్ చూస్తే ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 64మెగాపిక్సెల్ Samsung ISOCELL GW1P ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
ఐకూ నియో 6 స్మార్ట్‌ఫోన్‌లో 4,700ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 80వాట్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 50 శాతం 12 నిమిషాల్లో, 100 శాతం 32 నిమిషాల్లో ఛార్జింగ్ అవుతుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్‌సీ సపోర్ట్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. గేమింగ్ లవర్స్ కోసం క్యాస్కేడ్ కూలింగ్ సిస్టమ్, 4డీ గేమ్ వైబ్రేషన్, ఎక్స్ యాక్సిస్ లీనియర్ మోటార్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో అదనంగా మరో 4జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, IQoo, Mobile News, Mobiles, Smartphone