స్మార్ట్‌ఫోన్ (Smartphone) తయారీ కంపెనీ వివో సబ్‌బ్రాండ్‌గా(Vivo Sub Brand) ఫేమస్(Famous) అయిన ఐక్యూ (iQOO).. ఇండియన్ మార్కెట్లో(Indian Market) వరుసగా కొత్త ఫోన్లను (New Smartphones) విడుదల చేస్తోంది. ప్రస్తుతం స్వతంత్ర సంస్థగా పనిచేస్తున్న ఐక్యూ(IQ) ఈ వారం కొత్త స్మార్ట్‌ఫోన్(Smartphone) లైనప్‌ను యాడ్ చేసింది. కొత్తగా ఐక్యూ నియో 6 ఎస్‌ఈ (iQOO Neo 6 SE) పేరుతో మిడ్ రేంజ్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న వనిల్లా iQOO నియో 6 స్మార్ట్‌ఫోన్‌కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రిలీజైంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 800 సిరీస్ చిప్‌సెట్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా బిల్ట్ చేసిన OriginOS వెర్షన్‌పై ఫోన్ రన్ అవుతుంది. OIS సపోర్ట్ ఉన్న 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా దీని స్పెషాలిటీ. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీతో వచ్చింది.
* ఐక్యూ నియో 6 SE ధర
iQOO Neo 6 SE స్మార్ట్‌ఫోన్ బేస్ మోడల్ అయిన 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ. 23,000) నుంచి ప్రారంభమవుతుంది. 8GB + 256GB మోడల్ ధర CNY 2,299 (సుమారు రూ. 26,500)గా ఉంది. 12GB RAMతో వచ్చిన టాప్ ఎండ్ వేరియంట్ మార్కెట్‌లో సుమారు రూ. 28,800 ధరకు లభిస్తుంది. ప్రస్తుతానికి ఐక్యూ నియో 6 SE చైనాలో లాంచ్ అయింది. ఇది వచ్చే వారం నుంచి చైనాలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ బ్రాండ్‌ను ఇండియాతో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.
* కొత్త ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఐక్యూ నియో 6 SE అనేది రెగ్యులర్ iQOO Neo 6 వాటర్ డౌన్డ్ వెర్షన్‌గా వచ్చింది. ఇది చాలా మంది వినియోగదారులకు మంచి మిడ్ రేంజ్ ఫోన్ ఆప్షన్‌గా మారనుంది. ఈ ఫోన్ ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 6.62 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1300 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 12GB RAM, 256GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. బేస్ మోడల్ మాత్రం 8 GB RAM, 128 GB స్టోరేజ్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ Snapdragon 870 SoC ద్వారా పనిచేస్తుంది. ఇది మంచి పర్ఫార్మెన్స్ అందించే చిప్‌సెట్‌గా ఫేమస్ అయింది. ఐక్యూ నియో 6 SE ఫోన్ ఆండ్రాయిడ్ 12 బేస్డ్ OriginOS ఓషన్ వెర్షన్ ఆధారంగా పనిచేస్తుంది. డివైజ్‌లో OIS సపోర్ట్ ఉన్న 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి బెస్ట్ క్వాలిటీ లెన్స్ ఉన్నాయి. ఈ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ షూటర్ యూజర్లను ఆకర్షించనుంది. ఐక్యూ నియో 6 SE ఫోన్ 4700mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g mobile, 5G Smartphone, Mobile phones