IQOO NEO 6 5G IQ NEO 6 SMARTPHONE TO LAUNCH IN INDIA SOON PRICE AND FEATURES DETAILS HERE GH VB
iQoo Neo 6 5G: త్వరలోనే ఇండియాలో ఐక్యూ నియో 6 స్మార్ట్‌ఫోన్ లాంచ్.. దీని ధర, ఫీచర్ల వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
ఇండియాలో రిలీజ్ కానున్న iQoo Neo 6 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits బ్రైట్‌నెస్‌తో 6.62-అంగుళాల E4 AMOLED డిస్ప్లేతో రావచ్చు. ఇండియన్ వెర్షన్ ఫోన్ స్క్రీన్ ఫుల్-HD+(2400 x 1800 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో ఉంటుంది.
ఇండియన్ స్మార్ట్‌ఫోన్(Smartphone) మార్కెట్లో కొత్త బ్రాండ్‌గా ఫేమస్(Famous) అవుతున్న ఐక్యూ (iQoo) కంపెనీ.. Neo 6 5G పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్(launch) చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్(Updates)ను కంపెనీ ఇప్పటివరకు వెల్లడించలేదు. అధికారిక వివరాల గురించి కస్టమర్లు ఎదురుచూస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే చైనాలో(China) అందుబాటులో ఉంది. ఇది క్వాల్కామ్ నుంచి వచ్చిన అత్యంత ప్రీమియం చిప్సెట్తో(Chipset) పనిచేస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఐక్యూ నియో 6 ఫోన్ గురించి మరిన్ని వివరాలను టిప్స్టర్లు ట్విట్టర్లో లీక్ చేశారు. ఆ వివరాల ప్రకారం.. కొత్త స్మార్ట్‌ఫోన్ ఈ నెలాఖరులో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని సేల్స్ 2022 జూన్ ప్రారంభంలో ప్రారంభమవుతాయి.
మరో టిప్‌స్టర్ ముకుల్ శర్మ ముందుగా సూచించినట్లుగా, ఇండియన్ మార్కెట్ కోసం రూపొందించిన iQoo Neo 6 5G స్పెసిఫికేషన్లు, చైనాలో ఉన్న ఇదే మోడల్ కంటే భిన్నంగా ఉండవచ్చు. చైనా స్పెసిఫిక్ మోడల్ కంటే ఇండియన్ మార్కెట్లోకి వచ్చే డివైజ్ మరింత చౌకగా లభించనుంది. BGMI ఓపెన్ ఛాలెంజ్ ప్రమోషనల్ వీడియోలో కూడా ఈ ఫోన్ కనిపించింది.
iQoo Gen Z Sale: ఐకూ జెన్ జెడ్ సేల్... ఐకూ స్మార్ట్ఫోన్లపై రూ.8,000 వరకు డిస్కౌంట్
తాజా లీకుల ప్రకారం.. ఇండియాలో రిలీజ్ కానున్న iQoo Neo 6 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits బ్రైట్‌నెస్‌తో 6.62-అంగుళాల E4 AMOLED డిస్ప్లేతో రావచ్చు. ఇండియన్ వెర్షన్ ఫోన్ స్క్రీన్ ఫుల్-HD+(2400 x 1800 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో ఉంటుంది. ఇది 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇది 8GB/12GB RAMతో పాటు 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,700mAh బ్యాటరీతో రానుంది. దీని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో OIS సపోర్ట్ ఉన్న 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ షూటర్ ఉండవచ్చు. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 12 బేస్డ్ కస్టమ్ స్కిన్ వంటివి ఉండవచ్చు.
చైనాలో విడుదలైన ఐక్యూ నియో 6 5G ఫోన్.. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్తో వస్తుంది. నియో 6 5G ఇండియన్ వేరియంట్ ధర సుమారు రూ. 29,000 నుంచి ప్రారంభమవుతుందని నివేదికలు చెబుతున్నాయి. 8GB RAMతో వచ్చే బేస్ వేరియంట్ ధర రూ. 29,000, 12GB మోడల్ ధర రూ. 31,000 వరకు ఉంటుందని లీకుల ద్వారా తెలుస్తోంది. ఈ డివైజ్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.