హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iQOO Z6 Lite 5G: అదిరే ఫీచర్లతో ఐక్యూ Z6 సిరీస్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్.. భారత్ లో రిలీజ్ ఎప్పుడంటే..

iQOO Z6 Lite 5G: అదిరే ఫీచర్లతో ఐక్యూ Z6 సిరీస్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్.. భారత్ లో రిలీజ్ ఎప్పుడంటే..

iQOO Z6 Lite 5G

iQOO Z6 Lite 5G

iQOO Z6 Lite 5G: చైనీస్ బ్రాండ్ నుంచి రాబోయే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ డేటాబేస్‌లో గుర్తించారు. Z6 లైట్ 5G ఫోన్.. I2208 మోడల్ నంబర్‌తో వెబ్‌సైట్‌లో లిస్ట్ అయినట్లు తెలుస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ (iQOO) ఇండియాలో Z6 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేయడంపై దృష్టి సారించింది. ఈ కంపెనీ త్వరలో భారత్‌లో మరో Z6 స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఐక్యూ Z6 లైట్ 5G (iQOO Z6 Lite 5G) పేరుతో ఈ డివైజ్‌ రిలీజ్ కానుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్‌ కోసం కంపెనీ ఈ మోడల్‌ను సిఫార్సు చేసిందని టిప్‌స్టర్స్ గుర్తించారు.


చైనీస్ బ్రాండ్ నుంచి రాబోయే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ డేటాబేస్‌లో గుర్తించారు. Z6 లైట్ 5G ఫోన్.. I2208 మోడల్ నంబర్‌తో వెబ్‌సైట్‌లో లిస్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్టింగ్‌లో డివైజ్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు లేదా ఇతర ఫీచర్ల వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కానీ Z6 లైట్ మోడల్ Vivo T1X ఫోన్‌కు రీబ్రాండెడ్ మోడల్ కావచ్చని లీకుల ద్వారా తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు.* వివో T1x స్పెసిఫికేషన్లు
వివో T1x ఫోన్ ఫుల్ HD+ రిజల్యూషన్‌తో కూడిన 6.58-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 90.6 శాతం బాడీ-టు-స్క్రీన్ రేషియో, 96 శాతం NTSC కలర్ గామట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6GB వరకు RAM, 128GB స్టేరేజ్‌తో వస్తుంది. ఈ డివైజ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC చిప్‌సెట్‌ ద్వారా పనిచేస్తుంది.


వివో టీ1ఎక్స్ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఫన్‌టచ్ OS 12తో రన్ అవుతుంది. వివో T1x ఫోన్‌లో డ్యుయల్ రియర్ కెమెరా యూనిట్‌ ఉంటుంది. ఇందులో f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 లెన్స్‌తో కూడిన 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP సెల్ఫీ కెమెరాను అందించారు.


ఇది కూడా చదవండి : పొరపాటున డిలిట్ చేసిన వాట్సప్ మెసేజెస్ మళ్లీ పొందొచ్చు


* మరో ఫోన్ కూడా..

ఐక్యూ Z6 ప్రో SE మోడల్ కూడా మోడల్ నంబర్ I2205తో లిస్టింగ్‌లో ఉందని BIS డేటాబేస్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ డివైజ్‌ ఫీచర్ల వివరాలు అస్పష్టంగా ఉన్నాయి. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో కూడిన 4G-ఓన్లీ హ్యాండ్‌సెట్. అయితే ఐక్యూ Z6 లైట్ 5జీ ఫోన్ మాత్రం వేరే ప్రాసెసర్‌తో రావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

First published:

Tags: IQoo, Smart phones, Tech news

ఉత్తమ కథలు