హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iQoo: ఐక్యూ Z6 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. వీటి ధర, స్పెసిఫికేషన్ల వివరాలు..

iQoo: ఐక్యూ Z6 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. వీటి ధర, స్పెసిఫికేషన్ల వివరాలు..

iQOO Z6 Lite 5G

iQOO Z6 Lite 5G

iQoo: న్యూ ఐక్యూ Z6 స్మార్ట్ ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ (Qualcomm Snapdragon) 778G+ SoC ఉంటుంది. అలాగే 80W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ సపోర్ట్, 4500mAh బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ (iQoo) రెండు కొత్త ఫోన్ల (New SmartPhones)ను లాంచ్ చేసింది. ఐక్యూ Z6 సిరీస్‌ నుంచి వచ్చిన iQoo Z6, iQoo Z6x ఫోన్లను ఆగస్టు 25న చైనాలో లాంచ్ చేసింది. అయితే భారత్‌ (India)లో ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన iQoo Z6 మోడల్‌తో వీటికి ఎలాంటి పోలికలు లేవు. న్యూ ఐక్యూ Z6 స్మార్ట్ ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ (Qualcomm Snapdragon) 778G+ SoC ఉంటుంది. అలాగే 80W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ సపోర్ట్, 4500mAh బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. iQoo Z6x 44W ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 6,000mAh బ్యాటరీతో లాంచ్ అయింది. ఇది MediaTek డైమెన్సిటీ 810 SoC ద్వారా పనిచేస్తుంది.


* ధరలు
ఐక్యూ Z6 స్మార్ట్‌ఫోన్ .. 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ వేరియంట్స్ ధరలు చైనా కరెన్సీలో వరుసగా CNY 1699(రూ.19,768), CNY 1899(రూ.22,129) CNY 2,099(రూ.24419). ఇక కలర్స్ విషయానికి వస్తే ఈ హ్యాండ్ సెట్.. గోల్డెన్ ఆరెంజ్, ఇంక్ జాడే(Ink Jade), స్టార్ సీ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది.



ఐక్యూ Z6x స్మార్ట్ ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 256GB స్టోరేజ్‌ వంటి వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్స్ ధరలు వరుసగా చైనా కరెన్సీలో CNY 1199(రూ.13,947), CNY 1399(రూ.16,275) CNY 1599(రూ.18,602). ఈ స్మార్ట్ ఫోన్ బ్లూ ఐస్, బ్లాక్ మిర్రర్, బ్లేజింగ్ ఆరెంజ్ వంటి కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.


* స్పెసిఫికేషన్లు


ఐక్యూ Z6 హ్యాండ్‌సెట్ HD+ రిజల్యూషన్‌తో 6.64-అంగుళాల LCD స్క్రీన్ తో, గరిష్టంగా 240Hz శాంప్లింగ్ రేటుతో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12-బేస్డ్ ఆరిజిన్ OS ఓషన్‌పై రన్ అవుతుంది. Adreno 642L GPUతో జత చేసిన Snapdragon 778G+ SoC ఇందులో ఉంటుంది. ఇక, స్టోరేజ్ విషయానికి వస్తే.. 12GB వరకు LPDDR5 ర్యామ్, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌ను ఆఫర్ చేస్తోంది. 64 MP ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఇందులో అమర్చారు. అలాగే 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్‌ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంటుంది.


ఇది కూడా చదవండి : రెడ్‌మీ నోట్ 11 SE స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఛార్జర్ లేకుండానే డెలివరీ.. ధర ఎంతంటే..


ఐక్యూ Z6x స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 inc ఫుల్ HD+ LCD స్క్రీన్‌తో లాంచ్ అయింది. Mali-G57 GPUతో జతచేసిన డైమెన్సిటీ 810 SoC ద్వారా ఇది పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8GB వరకు LPDDR4x RAM, అలాగే 256GB వరకు UFS 2.2 స్టోరేజీ‌ని ఆఫర్ చేస్తోంది.

First published:

Tags: IQoo, Smart phones, Tech news

ఉత్తమ కథలు