అమెజాన్‌లో ఐకూ జెన్ జెడ్ సేల్ ప్రారంభమైంది. ఐకూ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇటీవల రిలీజైన ఐకూ జెడ్6 ప్రో (iQoo Z6 Pro) స్మార్ట్‌ఫోన్ నుంచి పాత మోడల్ అయిన ఐకూ జెడ్3 వరకు అన్ని మోడల్స్ పైనా డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది ఐకూ ఇండియా. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపైనా డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే రూ.3,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అమెజాన్ కూపన్ ద్వారా డిస్కౌంట్ పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఏ మొబైల్ కొంటే ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.
iQoo Z6 Pro: ఐకూ జెడ్6 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. ఇక హైఎండ్ వేరియంట్ ధర 8జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.28,999. హెచ్డీఎఫ్సీ కార్డుతో రూ.3,000 డిస్కౌంట్, అమెజాన్ కూపన్‌తో రూ.2,000 వరకు తగ్గింపు పొందొచ్చు. బేస్ వేరియంట్‌ను రూ.19,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.
iQoo Z6 44w: ఐకూ జెడ్6 44వాట్ స్మార్ట్‌ఫోన్ 4జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499 కాగా, 6జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఇక హైఎండ్ వేరియంట్ ధర 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999. హెచ్డీఎఫ్సీ కార్డుతో రూ.2,000 డిస్కౌంట్ పొందొచ్చు. బేస్ వేరియంట్‌ను రూ.12,499 ధరకు సొంతం చేసుకోవచ్చు.
Moto Days Sale: మోటోరోలా డిస్కౌంట్ సేల్... రూ.20,000 లోపు స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు
iQoo Z6: ఐకూ జెడ్6 స్మార్ట్‌ఫోన్ 4జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,399 కాగా, 6జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఇక హైఎండ్ వేరియంట్ ధర 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999. హెచ్డీఎఫ్సీ కార్డుతో రూ.2,000 డిస్కౌంట్ పొందొచ్చు. బేస్ వేరియంట్‌ను రూ.12,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.
iQoo 9 SE 5G: ఐకూ 9 ఎస్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,990 కాగా, 12జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,990. హెచ్డీఎఫ్సీ కార్డుతో రూ.3,000 డిస్కౌంట్, అమెజాన్ కూపన్‌తో రూ.1,000 తగ్గింపు పొందొచ్చు. బేస్ వేరియంట్‌ను రూ.29,990 ధరకు సొంతం చేసుకోవచ్చు.
iQoo 9 5G: ఐకూ 9 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,990 కాగా, 12జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.46,990. బ్యాంకు కార్డులతో రూ.4,000 డిస్కౌంట్, అమెజాన్ కూపన్‌తో రూ.3,000 తగ్గింపు పొందొచ్చు. బేస్ వేరియంట్‌ను రూ.35,990 ధరకు సొంతం చేసుకోవచ్చు.
Samsung Galaxy F23: సరికొత్త కలర్లో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23... అదిరిపోయిందిగా (Photos)
iQoo 9 Pro 5G: ఐకూ 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,990 కాగా, 12జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,990. బ్యాంకు కార్డులతో రూ.6,000 డిస్కౌంట్, అమెజాన్ కూపన్‌తో రూ.2,000 తగ్గింపు పొందొచ్చు. బేస్ వేరియంట్‌ను రూ.56,990 ధరకు సొంతం చేసుకోవచ్చు.
iQoo Z3: ఐకూ జెడ్3 స్మార్ట్‌ఫోన్ 6జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,990 కాగా, 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,990. ఆఫర్లో బేస్ వేరియంట్‌ను రూ.17,990 ధరకు సొంతం చేసుకోవచ్చు.
iQoo Z5: ఐకూ జెడ్5 స్మార్ట్‌ఫోన్ 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,990 కాగా, 8జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,990. హెచ్డీఎఫ్సీ కార్డుతో రూ.3,000 డిస్కౌంట్, అమెజాన్ కూపన్‌తో రూ.2,000 వరకు తగ్గింపు పొందొచ్చు. బేస్ వేరియంట్‌ను రూ.18,990 ధరకు సొంతం చేసుకోవచ్చు.
iQoo 7 5G: ఐకూ 7 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,990 కాగా, 12జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,990. బ్యాంకు కార్డుతో రూ.1,500 డిస్కౌంట్, అమెజాన్ కూపన్‌తో రూ.3,000 వరకు తగ్గింపు పొందొచ్చు. బేస్ వేరియంట్‌ను రూ.25,490 ధరకు సొంతం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, IQoo, Mobile News, Mobiles, Smartphone