హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iQoo Z6 Lite: త్వరలో ఐక్యూ Z6 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఆసక్తి రేపుతున్న ఫీచర్లు..!

iQoo Z6 Lite: త్వరలో ఐక్యూ Z6 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఆసక్తి రేపుతున్న ఫీచర్లు..!

iQOO Z6 Lite 5G

iQOO Z6 Lite 5G

iQoo Z6 Lite: ప్రపంచంలో స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 చిప్‌సెట్‌తో రానున్న ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదేనని ఐక్యూ తాజాగా కన్ఫర్మ్ చేసింది. తాజాగా లీక్ అయిన ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్లను చెక్ చేద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఐక్యూ (iQoo) ఇండియా (India)లో 5G ఫోన్లను లాంచ్ చేయడంపై దృష్టి పెట్టింది. ఈ సంస్థ Z6 సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ఐక్యూ జడ్‌ 6 లైట్ (iQoo Z6 Lite 5G) పేరుతో ఇది మార్కెట్లోకి రానుంది. సెప్టెంబర్ 14న ఈ ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేస్తామని ఐక్యూ ఇప్పటికే ధ్రువీకరించింది. ప్రపంచంలో స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 చిప్‌సెట్‌తో రానున్న ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదేనని ఐక్యూ తాజాగా కన్ఫర్మ్ చేసింది. తాజాగా లీక్ అయిన ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్లను చెక్ చేద్దాం.

ఐక్యూ Z6 లైట్ 5G ఫోన్ రిలీజ్ అయిన తర్వాత, అమెజాన్‌లో దీని సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఫోన్‌ గురించి ఈ-ట్రైలర్‌ను తమ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసింది అమెజాన్ . ఇందులో ఫోన్ స్పెసిఫికేషన్లను పేర్కొంది. Z6 లైట్ ఫోన్ కొత్త స్నాప్‌డ్రాగన్ 4 సిరీస్ చిప్‌తో వస్తుందని ఐక్యూ గతంలో ప్రకటించింది. అయితే ఈ ఫోన్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 SoC చిప్‌సెట్‌తో వస్తుందని తాజాగా నిర్ధారణ అయింది.

అంటే ప్రపంచంలో మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 చిప్‌సెట్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌గా ఐక్యూ Z6 లైట్ నిలవనుంది. AnTuTu బెంచ్‌మార్క్ టెస్ట్‌లో ఈ ప్రాసెసర్ ఏకంగా 388,486 పాయింట్ల స్కోర్‌ సాధించిందని ఐక్యూ తెలిపింది. దీని కారణంగా హ్యాండ్‌సెట్ పర్ఫార్మెన్స్ హై రేంజ్‌లో ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

* బ్యాటరీ కెపాసిటీ

అమెజాన్‌ వెబ్ పేజీలో ఇచ్చిన వివరాల ప్రకారం.. ఐక్యూ Z6 లైట్ 5G బెస్ట్ డిజైన్‌తో పాటు కెమెరా, గేమింగ్ కెపాసిటీ, బ్యాటరీ పరంగా సరికొత్త స్పెసిఫికేషన్లతో రానుంది. ఐక్యూ Z6 లైట్ ఫోన్ 5,000mAh బ్యాటరీతో రానుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది 127 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 21.6 గంటల ఫేస్‌బుక్‌ బ్రౌజింగ్, 18.5 గంటల యూట్యూబ్ ప్లేబ్యాక్, 8.3 గంటల గేమింగ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

* బెస్ట్ గేమింగ్ ఫోన్?

ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో రానుంది. స్క్రీన్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అంటే గేమింగ్ కోసం తక్కువ ధరలో లభించే బెస్ట్ ఆప్షన్‌గా ఐక్యూ ఫోన్‌ను డిజైన్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇందులో 6 జీబీ ర్యామ్, 2 జీబీ వర్చువల్ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఉన్నట్లు లీక్ అయిన వివరాల ద్వారా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : ఫ్లిప్‌కార్ట్‌లో హోటల్ రూమ్ కూడా బుక్ చేయొచ్చు... కొత్త సర్వీస్ ప్రారంభం

Z6 లైట్ 5G ఫోన్ 4-కాంపోనెంట్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది లాంగ్ గేమింగ్, మూవీ సెషన్‌లకు ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తుంది. గ్రాఫైట్ కూలింగ్ ఫిల్మ్, థర్మల్లీ కన్డ్యూసివ్ జెల్, కూలింగ్ కాపర్ ఫాయిల్, టెంపరేచర్ సెన్సార్లతో ఈ ఫోన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించనుంది.

* కెమెరా కెపాసిటీ

ఫోన్ రియర్ కెమెరా సెటప్ ఐ-ఆటో ఫోకస్ ఎనేబుల్డ్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. కంపెనీ ఇతర కెమెరా స్పెసిఫికేషన్లను ప్రకటించలేదు. అయితే ఐక్యూ Z6 లైట్ 5G ఫోన్ సైడ్-ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో రావచ్చు. 3.5mm ఆడియో జాక్, మైక్రోఫోన్, USB-C పోర్ట్, స్పీకర్ గ్రిల్ వంటి కామన్ స్పెసిఫికేషన్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసిన తర్వాతే దీని ధర, ఇతర స్పెసిఫికేషన్ల వివరాలు తెలిసే అవకాశం ఉంది.

First published:

Tags: IQoo, Smartphones, Tech news

ఉత్తమ కథలు