Home /News /technology /

IQOO 9T SMARTPHONE LAUNCHED IN INDIA WITH SNAPDRAGON 8 PLUS GEN 1 PROCESSOR KNOW PRICE AND SPECIFICATIONS SS

iQOO 9T 5G: ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్‌తో ఐకూ 9టీ వచ్చేసింది... ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి

iQOO 9T 5G: ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్‌తో ఐకూ 9టీ వచ్చేసింది... ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి
(image: iQoo India)

iQOO 9T 5G: ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్‌తో ఐకూ 9టీ వచ్చేసింది... ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి (image: iQoo India)

iQOO 9T 5G | ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్‌తో ఐకూ 9టీ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజైంది. స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

ఐకూ ఇండియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్‌తో ఐకూ 9టీ 5జీ (iQOO 9T 5G) మొబైల్ ఇండియాలో లాంఛ్ అయింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఉండటం విశేషం. అమొలెడ్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఐకూ 9టీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో ఐకూ 9టీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.45,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.50,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

ఐకూ 9టీ సేల్ ఐకూ వెబ్‍‌సైట్‌లో సేల్ ప్రారంభమైంది. ముందుగా కొనేవారికి రూ.3,999 విలువైన ఐకూ గేమ్‌ప్యాడ్ ఉచితంగా లభిస్తుంది. అమెజాన్‌లో ఆగస్ట్ 4న సేల్ ప్రారంభం కానుంది. బ్యాంక్ ఆఫర్స్ అమెజాన్‌లో కూడా పొందొచ్చు. లెజెండ్, ఆల్ఫా కలర్స్‌లో కొనొచ్చు. ఐకూ 9టీ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ జీటీ 2 ప్రో, వన్‌ప్లస్ 10ఆర్, త్వరలో రిలీజ్ కాబోయే వన్‌ప్లస్ 10టీ స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Exchange Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.13,250 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్... అమొలెడ్ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ


ఐకూ 9టీ 5జీ స్పెసిఫికేషన్స్


ఐకూ 9టీ 5జీ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ E5 అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో గేమర్స్ కోసం వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉండటం విశేషం.

ఐకూ 9టీ 5జీ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ GN5 సెన్సార్ + 13 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 12 మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరాలో నైట్, పోర్ట్రెయిట్, ఫోటో, వీడియో, 50MP, పనోరమా, స్లో మోషన్, టైమ్ లాప్స్, ప్రో, అల్ట్రా HD డాక్యుమెంట్, ప్రో స్పోర్ట్స్ మోడ్, డ్యూయల్-వ్యూ వీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

WhatsApp: వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు శుభవార్త... మీ కోసమే ఈ ఫీచర్



ఐకూ 9టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో పోర్ట్రెయిట్, ఫోటో, వీడియో, డ్యూయల్-వ్యూ వీడియో ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 4700ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, IQoo, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు