Iqoo 11 | వచ్చే వారంలో 5 కొత్త స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. అదిరే ఫీచర్లతో ఇవి మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. కొత్త ఫోన్ (Phone) కొనాలని భావించే వారు ఈ ఫోన్ల గురించి, వీటిల్లో ఉండబోయే ఫీచర్ల గురించి తెలుసుకోవచ్చు. ఐకూ కంపెనీ రెండు కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. అంతేకాకుండా ఇన్ఫినిక్స్ కంపెనీ కూడా కొత్త మొబైళ్లను (Smartphones) మార్కెట్లో ఆవిష్కరించనుంది. ఈ ఫోన్లలో 64 ఎంపీ కెమెరా, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఏ ఏ ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐకూ నియో 7 ఎస్ఈ ఫోన్ డిసెంబర్ 2న మార్కెట్లోకి రానుంది. ఇది మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ . నివేదికల ప్రకారం చూస్తే.. ఈ ఫోన్లో 6.78 అంగుళాల స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 64 ఎంపీ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్ల ఉండనున్నాయి. అంతేకాకుండా 500 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉండొచ్చు. ఇంకా ఈ ఫోన్లో 8200 మీడియాటెక్ డెమెన్సిటీ 8200 ప్రాసెసర్ ఉండనుంది.
రూ.75,000 ఫోన్ రూ.19 వేలకే అందుబాటులో.. ఇలా కొనేయండి!
ఐకూ 11 సీరిస్ కూడా మార్కెట్లోకి రానుంది. కంపెనీ చైనా, మలేసియాలో ఈ కొత్త ఫోన్లను డిసెంబర్ 2న లాంచ్ చేయనుంది. ఐకూ 11, ఐకూ 11 ప్రో ఫోన్లు మార్కెట్లోకి రావొచ్చు. వీటిల్లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉండనుంది. ఇంకా 6.78 అంగుళాల కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లు ఉండొచ్చు.
5జీ ఫోన్‌పై ఏకంగా రూ.24 వేల డిస్కౌంట్.. అమెజాన్ లిమిటెడ్ టైమ్ ఆఫర్
అలాగే ఇన్ఫినిక్స్ కంపెనీ కూడా కొత్త ఫోన్ లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. దీని పేరు ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ. డిసెంబర్ 1న ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ 5జీ ఫోన్లో 6.6 అంగుళాల స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 50 ఎంపీ కెమెరా, మీడియాటెక్ డిమెన్సిటీ 810 ప్రాసెసర్, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇకపోతే ఇన్ఫినిక్స్ హాట్ 20 ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.82 అంగుళాల స్క్రీన్, మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 13 ఎంపీ కెమెరా, 6.82 అంగుళాల స్క్రీన్ వంటి ఫీచర్లు ఉండొచ్చు. అందువల్ల కొత్త ఫోన్ కొనాలని భావించే వారు ఇవి ఫోన్లు మార్కెట్లోకి వచ్చేంత వరకు వేచి ఉండొచ్చు. వీటిల్లో మిడ్ రేంజ్, ప్రీమియం ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Infinix, IQoo, New smartphone