iQOO 11: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌లో ఒకటైన ఐక్యూ(iQoo)..ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో ఇటీవల సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఐక్యూ11 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. జనవరి 10న లాంచ్ అయిన ఐక్యూ 11 స్మార్ట్‌ఫోన్ సేల్స్.. నేటి నుంచి (జనవరి 13న) ప్రారంభమయ్యాయి.
iQoo 11 స్మార్ట్‌ఫోన్‌ను... iQoo, అమెజాన్ వెబ్‌సైట్స్ ద్వారా జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ లెజెండ్, ఆల్ఫా అనే రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే చైనాలో కూడా లాంచ్ అయింది.
ధర, బ్యాంక్ ఆఫర్స్
ఐక్యూ 11 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. బేస్ వేరియంట్ 8GB + 256GB ధర రూ.59,999 కాగా, టాప్ వేరియంట్ 16GB + 256GB ధర రూ. 64,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై వివిధ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లను ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే రూ.1,000 అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
స్పెసిఫికేషన్స్
ఈ హ్యాండ్‌సెట్ 6.79-అంగుళాల 2K, 144Hz Samsung E6 డిస్‌ప్లేతో లభిస్తుంది. దీని ప్యానెల్ HDR 10+కు సపోర్ట్ చేస్తుంది. 1800 nits మ్యాగ్జిమమ్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఇంప్రూవ్డ్ విజువల్స్ కోసం డెడికేటెడ్ V2 చిప్ ఇందులో ఉంటుంది.
ఐక్యూ 11లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ జీఎన్5 లెన్స్, 13 మెగా పిక్సెల్ టిలిఫోటో లెన్స్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
Whatsapp: ఒకే సమయంలో రెండు ఫోన్లలో ఒకే నంబర్‌తో వాట్సాప్ వాడొచ్చు.. ఎలాగో తెలుసా?
8 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్
ఈ హ్యాండ్‌సెట్‌లో 120W FashCharge టెక్నాలజీకి సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 8 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌లో లార్జ్ 24,768mm² వాపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది 24,768mm² కూలింగ్‌ను అందజేస్తుంది. ఇన్-డిస్‌ప్లే డ్యూయల్ మాన్‌స్టర్ టచ్, డ్యూయల్ x-యాక్సిస్ లీనియర్ మోటార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వంటి అదనపు ఫీచర్స్ ఇందులో ఉంటాయి.
RAM అదనంగా 8GB వరకు..
iQoo 11 క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్ ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇది LPDDR5X, UFS 4.0 స్టోరేజ్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ గరిష్టంగా 16GB RAM + 256GB స్టేరేజ్ కెపాసిటీతో లభిస్తుంది. అయితే RAMను అదనంగా మరో 8GB వరకు విస్తరించుకునే ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, IQoo