Home /News /technology /

IQOO 10 PRO THE FIRST PHONE WITH 200W FAST CHARGING SUPPORT LAUNCHED IN CHINA UMG GH

iQOO 10 Pro: చైనా మరో సూపర్ ఫోన్ లాంచ్.. ఫాస్ట్ ఛార్జింగ్‌లో దీన్ని మించింది లేదు.. అదిరిపోయే ఫీచర్స్..!

చైనా అదిరిపోయే ఫీచర్స్ మొబైల్

చైనా అదిరిపోయే ఫీచర్స్ మొబైల్

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఐక్యూ (iQOO) నుంచి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఈ ఫోన్‌ 200W ఫాస్ట్-వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే మొదటి మొబైల్ ఫోన్‌.

ఇంకా చదవండి ...
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఐక్యూ (iQOO) నుంచి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఈ ఫోన్‌ 200W ఫాస్ట్-వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే మొదటి మొబైల్ ఫోన్‌. ఐక్యూ 10 సిరీస్‌ నుంచి కొత్తగా ఐక్యూ 10 (iQOO 10), ఐక్యూ 10 ప్రో (iQOO 10 Pro) మోడళ్లు చైనాలో తాజాగా లాంచ్ అయ్యాయి. వీటిలో ఐక్యూ 10 ప్రో వేరియంట్ హై లెవల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని కంపెనీ వెల్లడించింది.

* కెమెరా కెపాసిటీ
ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఈ సెటప్ 8K వీడియోను రికార్డ్ చేయగలదు. దీంతోపాటు 14.6-మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా, 50-మెగాపిక్సెల్ 150-డిగ్రీ అల్ట్రా వైడ్ సెన్సార్‌ ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

 ఇదీ చదవండి: వారెవ్వా.. ఫేస్ బుక్ లో టిక్ టాక్.. ఇక పండగే పండుగ.. ఎప్పటి నుంచి అంటే!


* స్పెసిఫికేషన్లు
ఐక్యూ 10 ప్రో ఫోన్ 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 100% DCI-P3 రేటింగ్‌ దీని సొంతం. అంటే ఇది RGB కలర్ స్పేస్ మొత్తం స్పెక్ట్రమ్‌ను కవర్ చేస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC చిప్‌తో పనిచేస్తుంది. ఇది గేమింగ్ అవసరాల కోసం ఫ్రేమ్ రేట్లను పెంచడానికి ఇంటర్‌పోలేషన్‌ను ఉపయోగిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ చిప్‌సెట్ డివైజ్‌లో పవర్‌ను కూడా నియంత్రిస్తుంది, ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతుంది. ఈ ఫోన్‌లో 12GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 4700mAh బ్యాటరీ ఉంటుంది. ఇది రెండు సెల్స్‌గా డివైడ్ అయ్యి ఉంటుంది. ఇది ఏకంగా 200W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 10 నిమిషాల్లోనే ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తుందని ఐక్యూ తెలిపింది. ఇది 65W వరకు USB పవర్ డెలివరీ ఛార్జ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, అలాగే రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

ఫోన్ స్టాండర్డ్ వేరియంట్ ఐక్యూ 10 కూడా స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌లో రన్ అవుతుంది.. అదే మెమరీ, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో లభిస్తుంది. ఈ డివైజ్‌లో కూడా 4700mAh స్ప్లిట్ బ్యాటరీ ఉంటుంది. అయితే ఇది 120W ఛార్జింగ్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.



* ధర ఎంత?
ఐక్యూ 10 ప్రో బేస్ 8GB + 256GB వేరియంట్ CNY 5,000 (సుమారు రూ. 59,000), 12GB + 256 వేరియంట్ CNY 5,500 (సుమారు రూ. 65,000) ధర వద్ద లభిస్తుంది. 12GB + 512GB వేరియంట్ CNY 6,000 (సుమారు రూ. 71,000)కు లభిస్తుంది. ఐక్యూ 10 బేస్ 8GB + 128GB యూనిట్‌కు CNY 3,700 (సుమారు రూ. 44,000), 8GB + 256GB మోడల్‌కు CNY 4,000 (సుమారు రూ. 47,000), 12GB + 256GB వేరియంట్‌ CNY 4,300 (సుమారు రూ. 50,000)కు లభిస్తాయి. 12GB RAM, 512GB స్టోరేజ్ ఫోన్ ధన CNY 4,700 (సుమారు రూ. 55,000)గా ఉంది. ఈ రెండు ఫోన్‌లు జులై 26 నుంచి చైనాలో అందుబాటులో ఉంటాయి. అయితే గ్లోబల్ మార్కెట్లో వీటి లాంచింగ్‌పై స్పష్టత లేదు.
Published by:Mahesh
First published:

Tags: 5g smart phone, Budget smart phone, China, Smart phone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు