హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iQoo 10 Pro: త్వరలో ఐక్యూ 10 సిరీస్ కొత్త ఫోన్లు లాంచ్.. లీక్ అయిన ఫీచర్ల వివరాలివే..!

iQoo 10 Pro: త్వరలో ఐక్యూ 10 సిరీస్ కొత్త ఫోన్లు లాంచ్.. లీక్ అయిన ఫీచర్ల వివరాలివే..!

iqoo 10 pro

iqoo 10 pro

చైనీస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAAలో ఐక్యూ 10 ప్రో మోడల్ లిస్ట్ అయింది. దీంతో ఈ ఎడిషన్‌కు సంబంధించిన పూర్తి ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు బయటకు వచ్చాయి.

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ (iQOO) నుంచి కొత్త సిరీస్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. వచ్చే నెలలో ఐక్యూ 10 సిరీస్ (iQOO 10 series) నుంచి కొత్త మోడళ్లను చైనాలో విడుదల చేయనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ లైనప్‌లో ఐక్యూ 10, ఐక్యూ 10 ప్రో, ఐక్యూ 10 లెజెండ్ BMW ఎడిషన్‌లు ఉండవచ్చు. తాజాగా చైనీస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAAలో ఐక్యూ 10 ప్రో మోడల్ లిస్ట్ అయింది. దీంతో ఈ ఎడిషన్‌కు సంబంధించిన పూర్తి ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు బయటకు వచ్చాయి.

చైనీస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAA ప్రకారం.. ఐక్యూ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ 16 GB వరకు LPDDR5 RAM, 512 GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. TENAA డేటాబేస్‌లో ఐక్యూ 10 ప్రో మోడల్ నంబర్ V2218Aతో లిస్ట్ అయినట్లు MySmartPrice ప్లాట్‌ఫామ్ గుర్తించింది. దీంతోపాటు ఈ డివైజ్‌కు సంబంధించిన అన్ని ప్రధాన స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఐక్యూ 10 ప్రో 2K+ (3200 x 1400 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో 6.78- అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుందని లీకుల ద్వారా తెలుస్తోంది.

ఈ ఫోన్ 3.2GHz క్లాక్ స్పీడ్‌తో స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌తో వస్తుంది. TENAA లిస్టింగ్‌ ప్రకారం.. ఐక్యూ 10 ప్రో 6GB, 8GB, 12GB, 16GB LPDDR5 ర్యామ్‌తో రానున్నట్లు తెలుస్తోంది. స్టోరేజ్ ఆప్షన్‌లలో 128GB, 256GB, 512GB ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్ 4,550 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 200W ఫాస్ట్ ఛార్జింగ్, 65W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.


* కెమెరా స్పెసిఫికేషన్లు

ఐక్యూ 10 ప్రో ఫోన్ ట్రిపుల్-కెమెరా సెటప్‌తో రానుంది. ఇందులో 50 MP ప్రైమరీ సెన్సార్, 50 MP సెకండరీ యూనిట్ (అల్ట్రావైడ్ లెన్స్), మరో 14.6 MP టెరిషియరీ సెన్సార్ ఉంటాయి. ఇది టెలిఫోటో యూనిట్ కావచ్చు. ఐక్యూ 10 ప్రో ఫోన్‌ 16 MP సెల్ఫీ కెమెరాతో వస్తుందని లిస్టింగ్ పేర్కొంది.

అయితే ఈ ఫోన్ లాంచింగ్‌పై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి దీని ధర గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. రానున్న రోజుల్లో ఐక్యూ 10 సిరీస్ గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఐక్యూ 10, ఐక్యూ 10 ప్రో, ఐక్యూ 10 లెజెండ్ BMW ఎడిషన్ జులైలో చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వీటిలో ఉపయోగించిన స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌, ఈ సిరీస్ ఫోన్ల స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు.

First published:

Tags: Android, New mobiles, Smart phone, Tech news