IQ Z6 5G PHONE SALES TO START TOMORROW IN INDIA PRICE SPECIFICATIONS DETAILS HERE GH VB
New Smart Phone: గుడ్ న్యూస్.. రేపే ఆ సంస్థ నుంచి కొత్త మొబైల్ ఫోన్ లాంచ్.. ఆ వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ నుంచి మరో బడ్జెట్ ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. ఐక్యూ నుంచి ఇటీవల విడుదలైన ఐక్యూ Z6 5G అమ్మకాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. మార్చి 22 నుండి అమెజాన్, ఐక్యూ ఈ–స్టోర్ల ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ (Smart Phone) తయారీ సంస్థ ఐక్యూ నుంచి మరో బడ్జెట్(Budget) ఫోన్ భారత మార్కెట్లోకి(Market) రానుంది. ఐక్యూ నుంచి ఇటీవల విడుదలైన ఐక్యూ Z6 5G అమ్మకాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. మార్చి 22 నుండి అమెజాన్, ఐక్యూ ఈ–స్టోర్ల ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఐక్యూ Z6 5G లాంచింగ్ ద్వారా భారత్‌లో తన Z సిరీస్ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. జెన్ జెడ్, మిలీనియల్ కస్టమర్లను(Customers) దృష్టిలో పెట్టుకొని కేవలం రూ. 15 వేల ధరలోనే 5జీ టెక్నాలజీని(5G Technology) అందించడం విశేషం. దీనిలో అదిరిపోయే అల్ట్రా-గేమింగ్ ఫీచర్లను అందించింది. దీని ధర, ఫీచర్ల వివరాలను పరిశీలిద్దాం.
ఐక్యూ జెడ్6 5జీ ధర
ఐక్యూ Z6 5G మొత్తం మూడు వేరియంట్లు, రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 4GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 15,499 (ఎఫెక్టివ్ ప్రైజ్ రూ. 13,999), 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 16,999 (ఎఫెక్టివ్ ప్రైజ్ రూ. 14,999), 8GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 17,999 (ఎఫెక్టివ్ ప్రైజ్ రూ. 15,999) ధర వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, ఐక్యూ ఈ–-స్టోర్‌లో రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. డైనమో బ్లాక్, క్రోమాటిక్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది.
ఐక్యూ జెడ్6 5జీ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్సెట్తో పనిచేస్తుంది. ఇది 6.58 అంగుళాల FHD + డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీనిలో 8 జీబీ ర్యామ్ + 4 జీబీ ఎక్స్టెండెడ్ ర్యామ్ 2.0 పవర్ ప్యాక్‌ను అందించింది. అంటే, దీనిలో ప్రాథమికంగా 8 జీబీ ర్యామ్ అందించినా.. ర్యామ్ సామర్థ్యాన్ని 12 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోన్ హీట్ అవ్వకుండా కాపాడేందుకు 5 -లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందించింది.
ఇక, కెమెరా విషయానికి వస్తే.. ఐక్యూ జెడ్ 6 5జీ 2MP మాక్రో కెమెరా, 2MP బోకె కెమెరాతో పాటు 50MP ఐ ఆటోఫోకస్ మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ సరికొత్త ఐక్యూ Z6 5G రివర్స్, ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. దీనిలోని 5000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఛార్జ్ చేయవచ్చు. ఫోన్లో అల్ట్రా గేమ్ మోడ్‌ను కూడా అందించింది. ఇది యూజర్ ప్రాధాన్యత ప్రకారం అదిరిపోయే గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇది మొత్తం మూడు మోడ్ల మధ్య మారడానికి అనుమతిస్తుంది.- పవర్ సేవింగ్, బ్యాలెన్స్డ్, మాన్స్టర్ మోడ్లలో మారవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.