హోమ్ /వార్తలు /technology /

Jio Cricket Plans: ఐపీఎల్ మ్యాచ్ ఫ్రీగా చూడాలా? జియో క్రికెట్ ప్లాన్స్ ఇవే

Jio Cricket Plans: ఐపీఎల్ మ్యాచ్ ఫ్రీగా చూడాలా? జియో క్రికెట్ ప్లాన్స్ ఇవే

Jio Cricket Plans | క్రికెట్ ప్రేమికుల కోసం రిలయన్స్ జియో (Reliance Jio) ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది.

Jio Cricket Plans | క్రికెట్ ప్రేమికుల కోసం రిలయన్స్ జియో (Reliance Jio) ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది.

Jio Cricket Plans | క్రికెట్ ప్రేమికుల కోసం రిలయన్స్ జియో (Reliance Jio) ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది.

  ఐపీఎల్ 2022 సీజన్ కొనసాగుతోంది. సమ్మర్ మొత్తం క్రికెట్ సందడి నెలకొననుంది. మరి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను మీరు ఫ్రీగా చూడాలనుకుంటున్నారా? జియో ప్లాన్స్ (Jio Plans) రీఛార్జ్ చేసి ఐపీఎల్ ఉచితంగా చూడొచ్చు. కొన్ని ప్లాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hostar) సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్ కోసం ఏ ప్లాన్ రీఛార్జ్ చేయాలి? డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు వచ్చే బెనిఫిట్స్ ఏంటీ? తెలుసుకోండి.

  Jio Rs 499 Plan: జియో రూ.499 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 56జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. జియో యాప్స్‌తో పాటు రూ.499 విలువైన ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

  Jio Rs 799 Plan: జియో రూ.799 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 112జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. జియో యాప్స్‌తో పాటు రూ.499 విలువైన ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

  Jio Rs 1066 Plan: జియో రూ.1,066 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 168జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 5జీబీ డేటా లభిస్తుంది. రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. జియో యాప్స్‌తో పాటు రూ.499 విలువైన ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

  OnePlus: గుడ్ న్యూస్... ఈ రెండు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గాయి

  Jio Rs 3119 Plan: జియో రూ.3,119 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 730 జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 10జీబీ డేటా లభిస్తుంది. రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. జియో యాప్స్‌తో పాటు రూ.499 విలువైన ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

  Jio Rs 2999 Plan: జియో రూ.2999 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2.5జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. జియో యాప్స్‌తో పాటు రూ.499 విలువైన ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

  Jio Rs 601 Plan: జియో రూ.601 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున 84జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా 6జీబీ డేటా లభిస్తుంది. రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. జియో యాప్స్‌తో పాటు రూ.499 విలువైన ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

  Samsung Galaxy A53: సాంసంగ్ గెలాక్సీ ఏ53 సేల్ ప్రారంభం... రూ.3,000 డిస్కౌంట్

  Jio Rs 1499 Plan: జియో రూ.1499 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 168జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రూ.1,499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

  Jio Rs 4199 Plan: జియో రూ.4199 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున మొత్తం 1095జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రూ.1,499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

  Jio Rs 555 Data Add on Plan: జియో రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 55రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 55జీబీ డేటా లభిస్తుంది. ఇది డేటా యాడ్ ఆన్ ప్లాన్ మాత్రమే. ఇందులో కాలింగ్ బెనిఫిట్స్ ఉండవు. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

  Jio Rs 659 Data Add on Plan: జియో రూ.659 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. ఇది డేటా యాడ్ ఆన్ ప్లాన్ మాత్రమే. ఇందులో కాలింగ్ బెనిఫిట్స్ ఉండవు. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

  First published:

  ఉత్తమ కథలు