ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. మరో రెండు రోజుల్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. టీవీల్లో కన్నా స్మార్ట్ఫోన్లలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు చూసేవారే ఎక్కువ. మరి మీరు కూడా స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు చూడాలనుకుంటున్నారా? అయితే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడొచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ప్లాన్ తీసుకుంటే ఏడాదికి రూ.399 చెల్లించాలి. కానీ టెలికాం కంపెనీలు కొన్ని ప్లాన్స్‌పై ఉచితంగానే డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తున్నాయి. ఎయిర్టెల్ కూడా కొన్ని ప్లాన్స్‌పై ఈ ఆఫర్ అందిస్తోంది. మరి ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.
Airtel Rs 401 Plan: ఎయిర్టెల్ రూ.401 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 30 జీబీ డేటా లభిస్తుంది. 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రూ.399 విలువగల డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది ప్లాన్ ఉచితంగా లభిస్తుంది.
Airtel Rs 2,698 Plan: ఎయిర్టెల్ రూ.2,698 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రూ.399 విలువగల డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది ప్లాన్ ఉచితంగా లభిస్తుంది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఉచితంగా హెలోట్యూన్స్, మూడు నెలలు వింక్ మ్యూజిక్ యాక్సెస్, ఉచితంగా ఆన్లైన్ కోర్సులు కూడా లభిస్తాయి.
Airtel Rs 599 Plan: ఎయిర్టెల్ రూ.599 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రూ.399 విలువగల డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది ప్లాన్ ఉచితంగా లభిస్తుంది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఉచితంగా హెలోట్యూన్స్, మూడు నెలలు వింక్ మ్యూజిక్ యాక్సెస్, ఉచితంగా ఆన్లైన్ కోర్సులు కూడా లభిస్తాయి.
Airtel Rs 448 Plan: ఎయిర్టెల్ రూ.448 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రూ.399 విలువగల డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది ప్లాన్ ఉచితంగా లభిస్తుంది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఉచితంగా హెలోట్యూన్స్, మూడు నెలలు వింక్ మ్యూజిక్ యాక్సెస్, ఉచితంగా ఆన్లైన్ కోర్సులు కూడా లభిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.