Cricket Stickers: వాట్సప్‌లో క్రికెట్ స్టిక్కర్స్... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

WhatsApp Cricket Stickers | మీకు అప్‌డేట్ వర్షన్ 2.19.115 ఇన్‌స్టాల్ అయితే... క్రికెట్ స్టిక్కర్స్ వాడుకోవచ్చు. వాట్సప్‌లో క్రికెట్ స్టిక్కర్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: May 5, 2019, 9:31 PM IST
Cricket Stickers: వాట్సప్‌లో క్రికెట్ స్టిక్కర్స్... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా
WhatsApp IPL Stickers: వాట్సప్‌లో క్రికెట్ స్టిక్కర్స్... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా
  • Share this:
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. వాట్సప్‌లో ఐపీఎల్ స్టిక్కర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్-IPL 2019 టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో కాస్త ఆలస్యంగానైనా వాట్సప్... ఐపీఎల్ స్టిక్కర్స్‌ని యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు ఐపీఎల్ స్టిక్కర్లు లభిస్తున్నాయి. ఐఫోన్ యూజర్లకు త్వరలో ఐపీఎల్ స్టిక్కర్స్ రానున్నాయి. మీరు వాట్సప్‌లో క్రికెట్ స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీ వాట్సప్‌ని అప్‌డేట్ చేయాలి. గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి, వాట్సప్ మెసెంజర్ ఓపెన్ చేసి అప్‌డేట్ చేయాలి. మీకు అప్‌డేట్ వర్షన్ 2.19.115 ఇన్‌స్టాల్ అయితే... క్రికెట్ స్టిక్కర్స్ వాడుకోవచ్చు. వాట్సప్‌లో క్రికెట్ స్టిక్కర్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి.

Read this: WhatsApp: వాట్సప్‌ ఫోటోలు, వీడియోలతో స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ టిప్స్ ట్రై చేయండి

ముందుగా మీ వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి.
ఏదైనా ఛాట్ ఓపెన్ చేసి, ఛాట్ విండోలో క్లిక్ చేయండి.
స్మైల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే డౌన్‌లో స్టిక్కర్ ఎమొజి, గిఫ్, స్టిక్కర్ ఐకాన్స్ కనిపిస్తాయి.
స్టిక్కర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
అప్పటికే డౌన్‌లోడ్ చేసిన స్టిక్కర్స్ లిస్ట్ పక్కన కనిపించే + సింబల్ పైన క్లిక్ చేయండి.ALL STICKERS సెక్షన్‌లో మీకు క్రికెట్ స్టిక్కర్స్ కనిపిస్తాయి.
క్రికెట్ స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఆ స్టిక్కర్స్ ఎవరికైనా పంపొచ్చు.

Read this: Airlines Jobs: ఇంటర్ పాసైతే చాలు... విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు

వాట్సప్‌లో స్టిక్కర్ ఫీచర్ గతేడాది అక్టోబర్‌లో అందుబాటులోకి వచ్చింది. వాట్సప్‌లో స్టిక్కర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఎమోషన్స్‌ని టెక్స్ట్‌ రూపంలో కాకుండా స్టిక్కర్లలో పంపేందుకు యూజర్లు ఆసక్తి చూపిస్తున్నారు. పండుగలకు, ప్రత్యేక సందర్భాలకు కొత్త కొత్త స్టిక్కర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ప్లేస్టోర్‌లో థర్డ్ పార్టీ యాప్స్ స్టిక్కర్లు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. ఇప్పుటు వాట్సప్ స్వయంగా క్రికెట్ స్టిక్కర్స్ అందుబాటులోకి తీసుకురావడం విశేషం.

Photos: హీరో నుంచి 3 కొత్త ప్రీమియం బైక్స్... అదిరిపోయే ఫీచర్స్


ఇవి కూడా చదవండి:

Aadhaar Card: ఆధార్ కార్డును ఎక్కడంటే అక్కడ డౌన్‌లోడ్ చేస్తున్నారా? జాగ్రత్త...

SBI: మీ ఎస్‌బీఐ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లోనే మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా...

Smartphone: రూ.10,000 లోపు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే...

 
First published: May 5, 2019, 9:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading