IPL 2019: క్రికెట్ ఫ్యాన్స్‌కు BSNL కొత్త ప్లాన్స్

BSNL Prepaid Plans | ఈ ప్లాన్స్ తీసుకున్నవారికి మ్యాచ్ సమయంలో క్రికెట్ స్కోర్స్, మ్యాచ్ తర్వాత పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ సర్వీస్ ఆఫర్ చేస్తోంది. గూగుల్ ప్లేస్టోర్‌లో మై బీఎస్ఎన్ఎల్ ట్యూన్ యాప్ ద్వారా మీకు నచ్చిన ట్యూన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: April 8, 2019, 6:11 PM IST
IPL 2019: క్రికెట్ ఫ్యాన్స్‌కు BSNL కొత్త ప్లాన్స్
IPL 2019: క్రికెట్ ఫ్యాన్స్‌కు BSNL కొత్త ప్లాన్స్
news18-telugu
Updated: April 8, 2019, 6:11 PM IST
స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ చూస్తుంటారా? మీ దగ్గర బీఎస్ఎన్ఎల్ సిమ్ ఉందా? అయితే మీ కోసమే సరికొత్త ప్లాన్స్ ప్రకటించింది BSNL. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 సందర్భంగా రెండు కొత్త ప్లాన్స్‌ని ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కావడంతో కస్టమర్లను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే STV 199/201, STV 499 ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది.

Read this: IPL 2019: బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడితే స్విగ్గీలో మీకు 60% డిస్కౌంట్



ఉత్తరభారతదేశంలో రూ.201 రీఛార్జ్ ప్లాన్ వర్తిస్తుంది. మిగతా ప్రాంతాల్లో రూ.199 రీఛార్జ్ చేసుకుంటే చాలు. 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందొచ్చు. రోజుకు 1జీబీ డేటా కూడా లభిస్తుంది. రూ.499 రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందొచ్చు. రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు 90 రోజుల పాటు లభిస్తాయి. ఈ ప్లాన్స్ తీసుకున్నవారికి మ్యాచ్ సమయంలో క్రికెట్ స్కోర్స్, మ్యాచ్ తర్వాత పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ సర్వీస్ ఆఫర్ చేస్తోంది. గూగుల్ ప్లేస్టోర్‌లో మై బీఎస్ఎన్ఎల్ ట్యూన్ యాప్ ద్వారా మీకు నచ్చిన ట్యూన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతీ 15-20 నిమిషాలకోసారి స్కోర్ అప్‌డేట్స్ వస్తుంటాయి. మరి ఏ ప్లాన్‌లో ఎలాంటి సేవలు అందుతాయో తెలుసుకోండి.

Party Symbols: మిర్చీ, ఐస్‌క్రీమ్, బిస్కిట్... ఇవి కూడా ఎన్నికల గుర్తులే

ఇవి కూడా చదవండి:

Realme Backpack: రూ.2,399 విలువైన బ్యాక్‌ప్యాక్ ఒక్క రూపాయికే... ఇలా కొనాలి

Honor Gala Festival: హానర్ గాలా ఫెస్టివల్‌లో ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు

IRCTC Insurance: 49 పైసలకే రూ.10 లక్షల ట్రావెల్ ఇన్స్యూరెన్స్... ఎలా పొందాలో తెలుసుకోండి
First published: April 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...