ఐ ఫోన్ ఎక్స్‌ఎస్, ఐ ఫోన్ ఎక్స్‌ఎస్ మ్యాక్స్ వినియోగదారులకు జియో సేవలు

ఇకపై ఐ ఫోన్ ఎక్స్‌ఎస్, ఐ ఫోన్ ఎక్స్‌ఎస్ మ్యాక్స్ కస్టమర్లు జియో సేవలను పొందవచ్చు. ఈ రెండు ఫోన్లలో జియో సేవలు పొందేందుకు అనువుగా ఈ సిమ్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. జియో డాట్‌కామ్, రిలయెన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, మై జియో యాప్‌లో ఐ ఫోన్ ఎక్స్‌ఎస్, ఐ ఫోన్ ఎక్స్‌ఎస్ మ్యాక్స్ ఫోన్లను ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: September 21, 2018, 10:31 PM IST
ఐ ఫోన్ ఎక్స్‌ఎస్, ఐ ఫోన్ ఎక్స్‌ఎస్ మ్యాక్స్ వినియోగదారులకు జియో సేవలు
ఐ ఫోన్ ఎక్స్‌ఎస్
  • Share this:
స్మార్ట్ ఫోన్ల వినియోగంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన జియో... తాజాగా ఐ ఫోన్ ఎక్స్‌ఎస్, ఐ ఫోన్ ఎక్స్‌ఎస్ మ్యాక్స్ కస్టమర్లకు కూడా గుడ్ న్యూస్ వినిపించింది. ఈ రెండు ఫోన్లలో జియో సేవలు పొందేందుకు అనువుగా ఈ-సిమ్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. జియో ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లు ఈ సేవలను పొందవచ్చు. జియో డాట్‌కామ్, రిలయెన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, మై జియో యాప్‌లో ఐ ఫోన్ ఎక్స్‌ఎస్, ఐ ఫోన్ ఎక్స్‌ఎస్ మ్యాక్స్ ఫోన్లను సెప్టెంబర్ 21 నుంచి ప్రీ బుకింగ్ చేసుకునే వీలుంది.

ఐ ఫోన్‌లో డ్యూయల్ సిమ్ అందుబాటులోకి రావడంతో మరింతమంది జియో సేవలను పొందే అవకాశం కలుగుతుంది. సెప్టెంబర్ 21 నుంచి ఐ ఫోన్ ఎక్స్‌ఎస్, ఐ ఫోన్ ఎక్స్‌ఎస్ మ్యాక్స్ ఫోన్లను జియో కస్టమర్లు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. సెప్టెంబర్ 28 నుంచి ఈ ఫోన్లు స్టోర్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు మోడల్స్ ఐ ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సౌలభ్యంతో లభించనున్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: September 21, 2018, 10:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading