Home /News /technology /

IPHONE USERS WILL GET THESE FEATURES WITH THE NEXT SOFTWARE UPDATE HERE IS DETAILS MKS

iPhone Features: ఐఫోన్లలో కొత్త iOS.. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ తర్వాత రానున్న సరికొత్త ఫీచర్లు ఇవే..

ఐఫోన్ లో కొత్త ఫీచర్లు

ఐఫోన్ లో కొత్త ఫీచర్లు

iOS 15.2 వెర్షన్ కోసం కస్టమర్లు కొంతకాలంగా వేచిచూస్తున్నారు. తాజాగా RC 2 ఓఎస్ బీటా టెస్టింగ్‌కు అందుబాటులోకి రావడంతో, ఐఫోన్లలో రానున్న కొత్త ఫీచర్లపై యాపిల్ యూజర్లు దృష్టి సారిస్తున్నారు.

ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లకు రారాజుగా చెప్పుకునే యాపిల్ సంస్థ.. త్వరలో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేయనుంది. గత వారం iOS 15.2 RC వెర్షన్‌ను సంస్థ డెవలపర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఐఓఎస్ 15.2 రిలీజ్ క్యాండిడేట్ 2 లేదా RC 2 వెర్షన్ బీటా యూజర్లకు విడుదలైంది. యాపిల్ ఐఓఎస్ 15.2 (Apple iOS 15.2) స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ విడుదలను తాజా అప్‌డేట్ సూచిస్తోంది. డెవలపర్లు, పబ్లిక్ టెస్టర్ల కోసం విడుదలైన ఈ కొత్త బీటా అప్‌డేట్లో చాలా అప్‌గ్రేడ్‌లు ఉన్నట్లు MacRumors ప్లాట్‌ఫాం వెల్లడించింది. కానీ దీన్ని ప్రస్తుతం ఐఫోన్ 13 (iPhone 13) మోడళ్లకు మాత్రమే పరిమితం చేసినట్లు పేర్కొంది.

iOS 15.2 వెర్షన్ కోసం కస్టమర్లు కొంతకాలంగా వేచిచూస్తున్నారు. తాజాగా RC 2 ఓఎస్ బీటా టెస్టింగ్‌కు అందుబాటులోకి రావడంతో, ఐఫోన్లలో రానున్న కొత్త ఫీచర్లపై యాపిల్ యూజర్లు దృష్టి సారిస్తున్నారు. iOS 15.2 RC బీటా వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ప్రొఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యాపిల్ డెవలపర్ సెంటర్ ద్వారా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అర్హత కలిగిన పబ్లిక్ టెస్టర్లు యాపిల్ బీటా టెస్టింగ్ వెబ్‌సైట్ ద్వారా కూడా సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Harnaaz Sandhu : విశ్వసుందరి అందాలు చూస్తే వావ్ అనాల్సిందే -Miss Universe 2021 ఎలా అయిందంటే..


* కొత్త ఫీచర్లు ఇవే..
iOS 15.2 RC వెర్షన్‌లో యాపిల్ మ్యూజిక్ వాయిస్ ప్లాన్‌ ఫీచర్ ఉంది. దీన్ని కంపెనీ 2021 అక్టోబర్‌లో ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా యాపిల్ వాయిస్ అసిస్టెంట్ ‘సిరి’ని (Siri) ఉపయోగించి.. యాపిల్ మ్యూజిక్‌లోని అన్ని పాటలు, స్టేషన్‌లను వినియోగదారులు యాక్సెస్‌ చేసుకోవచ్చు. ప్రైవసీ పరంగా మరిన్ని మెరుగైన అప్‌డేట్లు కొత్త ఐఓఎస్‌లో ఉన్నాయి. గత ఏడు రోజుల్లో లొకేషన్, ఫోటోలు, మైక్రోఫోన్ వంటి వ్యక్తిగత డేటాను యాప్‌లు ఎంత తరచుగా యాక్సెస్ చేశాయనే వివరాలను వినియోగదారులు ‘యాప్ ప్రైవసీ రిపోర్ట్’ ఫీచర్ ద్వారా పొందవచ్చు. పిల్లలు అశ్లీల ఫోటోలను యాక్సెస్ చేసినప్పుడు, తల్లిదండ్రులను హెచ్చరించే కొత్త కమ్యూనిటీ సేఫ్టీ సెట్టింగ్ సైతం తాజా బీటా అప్‌డేట్‌లో ఉంది. ఆన్‌లైన్‌ సేఫ్టీని నిర్ధారించడానికి Siri, Spotlight, Safari సెర్చ్‌ ఆప్షన్లకు ‘గైడెన్స్’ ఫీచర్ సైతం ఉంది.

tragic accident : ఒకే ప్రయాణంలో రెండు ప్రమాదాలు.. తల్లీకూతుళ్ల దుర్మరణం.. తండ్రీకొడుకు పరిస్థితి విషమం



ఐఫోన్ 13 ప్రో (iPhone 13 Pro), ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ (iPhone 13 Pro Max) యూజర్లు మాక్రో ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయడానికి అల్ట్రా వైడ్ లెన్స్‌కి మారాలనుకుంటారు. అలాంటప్పుడు సాయం చేసే 'మాక్రో ఫోటో కంట్రోల్' ఫీచర్‌ను సైతం కొత్తగా కెమెరా సెట్టింగ్‌లో పొందుపర్చింది. టీవీ యాప్‌లో కొత్తగా వన్-స్టాప్ స్టోర్ ట్యాబ్‌ను యాపిల్ జోడిస్తోంది. వినియోగదారులు సినిమాలు, టీవీ షోలను బ్రౌజ్ చేయడానికి, కొనుగోలు చేయడానికి, రెంట్‌కు ఇవ్వడానికి కొత్తగా ఈ ట్యాబ్‌ను యాడ్ చేసింది. iOS 15.2 RC వెర్షన్ మెయిల్ యాప్‌లో 'హైడ్ మై ఈమెయిల్‌'.. పోయిన ఐఫోన్‌లను గుర్తించే ‘ఫైండ్ మై ఫోన్’ టూల్స్‌ను మరింత మెరుగుపరుస్తుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Apple, Ios, Iphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు