IPHONE USERS BATTERY ISSUES IN APPLE DEVICES WITH IOS 15 4 VERSION UPDATE USER COMPLAINTS ON SOCIAL MEDIA GH VB
iPhone Users: యాపిల్ డివైజ్‌లలో బ్యాటరీ సమస్యలు.. సోషల్ మీడియాలో యూజర్ల ఫిర్యాదులు..!
ప్రతీకాత్మక చిత్రం
యాపిల్ ఐఫోన్ వినియోగదారుల(Apple iPhone Users) నుంచి ఫోన్ బ్యాటరీకి(Phone Battery) సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ వారం కొత్త iOS 15.4 వెర్షన్‌కు అప్డేట్(Update) చేసిన తర్వాత ఫోన్ బ్యాటరీ ఎక్కువ సమయం రావడం లేదని, చాలా తొందరగా ఛార్జింగ్ అయిపోతోందని ఐఫోన్ వినియోగదారులు చెబుతున్నారు.
యాపిల్ ఐఫోన్ వినియోగదారుల(Apple iPhone Users) నుంచి ఫోన్ బ్యాటరీకి(Phone Battery) సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ వారం కొత్త iOS 15.4 వెర్షన్‌కు అప్డేట్(Update) చేసిన తర్వాత ఫోన్ బ్యాటరీ ఎక్కువ సమయం రావడం లేదని, చాలా తొందరగా ఛార్జింగ్ అయిపోతోందని ఐఫోన్ వినియోగదారులు చెబుతున్నారు. చాలా మంది యాపిల్ ఐఫోన్ యూజర్లు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపాలని యాపిల్ సంస్థను కోరారు. వాస్తవానికి పెద్ద ఐఫోన్ 13 ప్రో మాక్స్‌ని ఉపయోగిస్తున్న వారు అన్ని ఐఫోన్ మోడళ్ల కంటే దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారు కేవలం 5 నిమిషాల్లో 10 శాతం బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోవడాన్ని చూశారు.
ట్విట్టర్ ద్వారా చాలా మంది యాపిల్ ఫోన్ వినియోగదారులు యాపిల్ సంస్థకు సమస్యను వివరించే ప్రయత్నం చేశారు. అయితే యాపిల్ కంపెనీ సపోర్టింగ్ టీమ్ నుంచి ‘ఇది సాధారణం’ అనే స్పందన ఎదురైంది. యాపిల్ ఐఫోన్లో అప్పటికే ఉన్న ఫీచర్లు(Features), యాప్‌లతో కొత్త ఐవోఎస్ వెర్షన్ సర్దుబాటు కావడానికి కనీసం 48 గంటలు ఐఫోన్ వినియోగదారులు వేచి ఉండాలని యాపిల్ సంస్థ సూచిస్తోంది.
కొత్త ఐవోఎస్ వెర్షన్ అప్డేట్ ఫోన్‌కు అనుగుణంగా మారేందుకు సమయం పడుతుందని, ఈ క్రమంలో ఐఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా తగ్గిపోవడం సాధారణమేనని యాపిల్ సంస్థ చెబుతోంది. యాపిల్ ఐఫోన్‌లోని ఫీచర్లు, యాప్‌లతో కొత్త iOS 15.4 వెర్షన్ సర్దుబాటు అయిన తర్వాత క్రమంగా మెరుగవుతూ ముందులాగే యాపిల్ ఐఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. iOS 15.4 అప్డేట్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. అయితే యాపిల్ ఐఫోన్లో కొత్త ఐవోఎస్ వెర్షన్ అప్డేట్ చేసిన 48 గంటల తర్వాత కూడా వినియోగదారులకు బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోవడమనే సమస్య ఉంటే.. మరింత సహాయం కోసం కంపెనీని సంప్రదించాలని యాపిల్ పేర్కొంది.
కొత్త iOS 15.4 అప్డేట్ చాలా కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందిస్తోంది. అందులో.. వినియోగదారుడు మాస్క్ ధరించి ఉన్న సమయంలో కూడా ఫేస్ ఐడీని గుర్తించేలా జోడించిన సాంకేతికత కీలకం. ఈ ఎంపిక కొంతకాలంగా iOS 15.4 బీటా వెర్షన్లో పరీక్షించారు. మాస్కు ధరించిన సమయంలో కూడా వినియోగదారుడి ఫేస్ ఐడీ గుర్తించేలా తీసుకొచ్చిన సాంకేతికతను అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాత, యాపిల్ సంస్థ కొత్త ఫీచర్‌పై సంతృప్తి చెందిన తర్వాత.. ఈ నెలలో అన్ని అర్హత కలిగిన ఐఫోన్ మోడల్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
కొత్త ఫేస్ ఐడీ ఫీచర్ 2020లో ఐఫోన్ 12 సిరీస్‌తో పరిచయం చేసిన ట్రూడెప్త్ కెమెరా సిస్టమ్‌ని కలిగి ఉన్న ఐఫోన్లకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి యాపిల్ ఐఫోన్ కొత్త ఐవోఎస్ 15.4 అప్డేట్ చేసుకొన్నా.. అది ఫేస్ ఐడీ టెక్నాలజీని సపోర్ట్ చేసినప్పటికీ, ఐఫోన్లో కెమెరా టెక్ లేకపోతే కొత్త సెక్యూరిటీ ఫీచర్ పని చేయదు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.