హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone Offers: రూ.12 వేల కన్నా తక్కువ ధరకే ఐఫోన్.. ఫ్లిప్‌కార్ట్ కళ్లుచెదిరే ఆఫర్!

iPhone Offers: రూ.12 వేల కన్నా తక్కువ ధరకే ఐఫోన్.. ఫ్లిప్‌కార్ట్ కళ్లుచెదిరే ఆఫర్!

 రూ.12 వేల కన్నా తక్కువ ధరకే ఐఫోన్.. ఫ్లిప్‌కార్ట్ కళ్లుచెదిరే ఆఫర్లు!

రూ.12 వేల కన్నా తక్కువ ధరకే ఐఫోన్.. ఫ్లిప్‌కార్ట్ కళ్లుచెదిరే ఆఫర్లు!

Flipkart Sale | ఐఫోన్ లవర్లకు అదిరిపోయే శుభవార్త. ఎందుకంటారా? రూ. 12 వేల ధరలోనే ఐఫోన్ కొనుగోలు చేసే అవకాశం అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ఈ ఆఫర్ పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    Flipkart Big Billion Days | కొత్తగా ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అది కూడా యాపిల్ ఐఫోన్ (iPhone) కొనేందుకు సిద్ధం అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) ఐఫోన్లపై అదిరిపోయే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపు లభిస్తోంది. ఐఫోన్ లవర్లకు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. యాపిల్ (Apple) ఐఫోన్లపై ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

    ఐఫోన్‌ను కేవలం రూ. 12 వేల కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. సెకండ్ జనరేషన్ ఐఫోన్ ఎస్ఈ 2022 మార్చి నెలలో మార్కెట్‌లోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఐఫోన్‌పై పలు రకాల ఆఫర్లు లభిస్తున్నాయి. అలాగే ఐఫోన్ ఎస్ఈ 3 మోడల్‌పై కూడా డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు మారాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్.

    వావ్.. రూ.4,500కే టీవీ కొనేయండి.. ఈ 3 టీవీలపై ధూమ్ ధామ్ ఆఫర్లు!

    ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ ఎస్ఈ 64 జీబీ మోడల్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. దీని ధర సాధారణంగా రూ. 39,990గా ఉంది. ఆఫర్ సేల్‌లో భాగంగా ఈ ఐఫోన్‌పై రూ. 9401 తగ్గింపు లభిస్తోంది. దీంతో ఫోన్ ధర రూ. 30,499కు తగ్గుతుంది. కొనుగోలుదారులు ఇంకా ఇతర ఆఫర్లను పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోడల్‌పై ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. రూ. 19వేల వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు పొందొచ్చు. దీంతో ఫోన్ ధర రూ. 11,499కు దిగి వస్తుంది.

    మిక్సి, ఐరన్ బాక్స్ కాంబో డీల్.. రూ.1తో బుక్ చేసుకోండిలా

    అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ విలువ అనేది మీ ఫోన్ ప్రాతిపదికన ఆధారపడి ఉంటుంది. అంటే ఫోన్ మోడల్, కండీషన్ ఆధారంగా ఎక్స్చేంజ్ విలువ మారుతుంది. అలాగే ఐఫోన్ ఎస్ఈ 3 మోడల్‌పై చూస్తే.. ఈ ఫోన్ ధర రూ. 49,900గా ఉంది. దీనిపై కస్టమర్లకు రూ. 6 వేల డిస్కౌంట్ పొందొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ రూపంలో రూ. 19,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే యూజర్లు ఈ ఫోన్‌ను రూ. 24,900 ధరకు కొనుగోలు చేయొచ్చు. అందువల్ల ఐఫోన్ కొనుగోలు చేసే వారు ఈ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. కాగా మరో దిగ్గజ ఈకామర్స్ సంస్థ అయితన అమెజాన్‌లో కూడా యాపిల్ ఐఫోన్లపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు రెండు వెబ్‌సైట్లలో ఆఫర్లు చెక్ చేసుకొని నచ్చిన ఐఫోన్ మోడల్ కొనుగోలు చేయొచ్చు. ఒక్కో సైట్‌లో ఆఫర్లు ఒక్కోలా ఉంటాయి. అందువల్ల కొనే ముందు డీల్స్ అన్నింటినీ పూర్తిగా చెక్ చేసుకోవడం ఉత్తమం.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Flipkart, Flipkart Big Billion Days, Iphone