IPHONE SE TO IPHONE 12 GET HUGE DISCOUNT ON THESE APPLE IPHONES ON FLIPKART BIG SAVING DAYS SALE SS GH
Flipkart Big Saving Days: ఐఫోన్ కొనాలా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్
Flipkart Big Saving Days: ఐఫోన్ కొనాలా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్
Flipkart Big Saving Days | యాపిల్ ఐఫోన్ కొనాలనుకునేవారికి అలర్ట్. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఐఫోన్లపై (iPhone) భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్ల వివరాలు తెలుసుకోండి.
ఈ సంవత్సరం ముగుస్తున్న తరుణంలో ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌ను ప్రకటించింది. డిసెంబర్ 21 వరకు మొత్తం ఐదు రోజుల పాటు ఈ సేల్ నిర్వహించనుంది. సేల్‌లో భాగంగా యాపిల్ఐఫోన్ మోడల్స్‌పై (iPhone) కళ్లు చెదిరే డిస్కౌంట్లు ప్రకటించింది. మరోవైపు, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ (SBI Card), ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై 10 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. ఇందు కోసం ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌లో ఏ ఐఫోన్ మోడల్‌పై ఎంత వరకు డిస్కౌంట్ లభిస్తుందో చూద్దాం.
ఐఫోన్ ఎస్ఈ
యాపిల్ ఐఫోన్ ఎస్ఈ సెకండ్ జనరేషన్ 2020 ఏప్రిల్‌లో ప్రారంభమైంది. ఐఫోన్ ఎస్ఈ మోడల్ 64 జీబీ, 128 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఇది A13 బయోనిక్ చిప్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ మోడల్ టచ్ ఐడీతో కూడిన 4.7 అంగుళాల రెటినా హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. ఐఫోన్ ఎస్ఈ 64 జీబీ వేరియంట్ అసలు ధర రూ. 32,099 వద్ద ఉండగా.. ఆఫర్ కింద దీన్ని కేవలం రూ.27,000 నుంచి 28,000 మధ్య కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 11 డిస్ప్లే 6.1 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇది 12 ఎంపీ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇది లిక్విడ్ రెటినా హెచ్డీ డిస్ప్లేను కలిగి ఉంటుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా దీనిపై రూ. 4,000 ధర తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐఫోన్ 11 ఫ్లిప్‌కార్ట్‌లో రూ.49,900 వద్ద అందుబాటులో ఉంది.
ఐఫోన్ 12 మినీ
ఐఫోన్ 12 మినీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 49,999 వద్ద అందుబాటులో ఉంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో ఆఫర్ కింద దీన్ని కేవలం రూ. 43,000 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 12 మినీ A14 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. ఇది 13.72 సెం.మీ డిస్ప్లేతో వస్తుంది.
Jio Rs 1 Plan: జియో మరో సంచలనం... ఒక్క రూపాయికే ప్రీపెయిడ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే
ఐఫోన్ 12
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్12 ప్రస్తుతం రూ. 59,999 ధర వద్ద లభిస్తుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఆఫర్ కింద దీన్ని కేవలం రూ.53,000 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. యాపిల్ ఐఫోన్ 12 డిస్ ప్లే మినహా మిగతా అన్ని ఫీచర్లు ఐఫోన్ 12 మినీతో సమానంగా ఉంటాయి. ఐఫోన్ 12 6.1 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. బిగ్ సేవింగ్స్ డే సందర్భంగా, ఫ్లిప్‌కార్ట్ క్రేజీ డీల్స్‌ను ప్రతి రోజూ రాత్రి 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.