భారత మార్కెట్లో యాపిల్(Apple) ఉత్పత్తులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే, యాపిల్ ఐఫోన్లు(iPhones) హాట్‌కేకుల్లా అమ్ముడవుతుంటాయి. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని యాపిల్ సంస్థ వరుసగా ఐఫోన్ మోడల్స్‌ను(Models) విడుదల చేస్తుంది. యాపిల్ తాజా ఈవెంట్లో ఐఫోన్ SE 3 లేదా ఐఫోన్ SE 2022ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ SE 2020కు సక్సెసర్‌గా వచ్చింది. అచ్చం అదే డిజైన్‌తో అప్‌గ్రేడ్ స్పెసిఫికేషన్లతో(Specifications) అందుబాటులోకి వచ్చింది. యాపిల్ నుంచి 5G సపోర్ట్‌తో వచ్చిన మొదటి “SE” ఫోన్ ఇదే కావడం విశేషం. ఐఫోన్ SE 3 ప్రీఆర్డర్లు భారత్‌లో మార్చి 11 నుండి ప్రారంభమవుతాయి. మార్చి 18 నుండి అమ్మకానికి వస్తుంది. మీరు మార్కెట్లోని బెస్ట్ ఐఫోన్ మోడల్‌ను కొనాలనుకుంటున్నారా?.. అయితే ధర, స్పెసిఫికేషన్ల విషయంలో ఇతర ఐఫోన్లతో ఐఫోన్ ఎస్ఈ 3ని పోల్చి చూడండి.
ఐఫోన్ SE VS ఐఫోన్ 11 VS ఐఫోన్ 12 VS ఐఫోన్ 13 ధర
భారతదేశంలో ఐఫోన్ SE 3 లేదా ఐఫోన్ SE 2022 బేస్ 64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 43,900 ధర వద్ద ప్రారంభమవుతుంది. 128GB వేరియంట్ రూ. 48,900 వద్ద, 256 జీబీ టాప్ వేరియంట్ రూ.58,900 వద్ద లభిస్తాయి. ఇక, ఐఫోన్ 11 బేస్ 64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 49,900 వద్ద, 128GB వేరియంట్ రూ. 54,900 వద్ద లభిస్తాయి. మరోవైపు, ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ అనే రెండు మోడళ్లలో వస్తుంది. యాపిల్ స్టోర్‌లో ఐఫోన్ 12 మినీ 64GB వేరియంట్ రూ. 59,900 వద్ద, 128GB వేరియంట్ రూ. 64,900 వద్ద, 256GB వేరియంట్ రూ.74,900 వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇక, ఐఫోన్ 12 64GB వేరియంట్ రూ. 65,900, 128GB వేరియంట్ రూ. 70,900, 256GB వేరియంట్ రూ. 80,900 వద్ద లభిస్తాయి.
మరోవైపు, ఐఫోన్ 13 కూడా రెండు మోడళ్లలో అందుబాటులో ఉంటుంది. ఐఫోన్13 మినీ, స్టాండర్డ్ ఐఫోన్ 13 మోడళ్లలో లభిస్తుంది. ఐఫోన్ 13 మినీ బేస్ 128GB వేరియంట్ రూ. 69,900 వద్ద, 256GB వేరియంట్ రూ.79,900, 512GB స్టోరేజ్ వేరియంట్ రూ.99,900 వద్ద లభిస్తాయి. మరోవైపు, బేస్ 128GB వేరియంట్ రూ. 79,900 ధర వద్ద ప్రారంభమవుతుంది. 256GB వేరియంట్ ధర రూ.89,900, 512GB వేరియంట్ ధర రూ.1,09,900 వద్ద లభిస్తాయి.
ఐఫోన్ SE VS ఐఫోన్ 11 VS ఐఫోన్ 12 VS ఐఫోన్ 13 స్పెసిఫికేషన్లు
ఐఫోన్ SE 3 లేదా ఐఫోన్ SE 2022 మోడల్ 4.7- అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇది ఐఫోన్13 సిరీస్‌కు శక్తినిచ్చే యాపిల్ A15 బయోనిక్ చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఐఫోన్ SE 3 12-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో 7-మెగాపిక్సెల్ షూటర్ కెమెరాను అందించింది. ఇక, ఐఫోన్ 11 విషయానికి వస్తే.. 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్ప్లేతో వస్తుంది. ఇది A13 బయోనిక్ చిప్సెట్తో పనిచేస్తుంది. ఐఫోన్ 11 డ్యూయల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 12 -మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 -మెగాపిక్సెల్ వైడ్ కెమెరాను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 4K రిజల్యూషన్‌తో 60fps వరకు వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఇస్తుంది. 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ షూటర్‌ను కలిగి ఉంటుంది.
ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ రెండూ ఒకే రకమైన స్పెసిఫికేషన్లతో వస్తాయి. ఐఫోన్ 12 6.1-అంగుళాల డిస్ప్లే పరిమాణంతో వస్తుంది. మరోవైపు, ఐఫోన్ 12 మినీ 5.4 -అంగుళాల డిస్ప్లేను అందించింది. ఈ రెండూ యాపిల్ A14 బయోనిక్ చిప్‌తో పనిచేస్తాయి. వీటిలో 12 -మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 -మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. దీని ముందు భాగంలో, 12-మెగాపిక్సెల్ ట్రూడెప్త్ ఫ్రంట్ షూటర్ కెమెరాను చేర్చింది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ కూడా ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ మాదిరిగానే డిస్ప్లే సైజులు, రిజల్యూషన్‌తో వస్తాయి. ఈ రెండూ యాపిల్ A15 బయోనిక్ చిప్‌తో పనిచేస్తాయి. ఐఫోన్ 13 సిరీస్‌లోని కెమెరాలు ఐఫోన్ 12 సిరీస్‌తో సమానంగా ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Smartphone