IPHONE SE 2022 ALTERNATIVES TOP 5 PHONES FROM ONEPLUS XIAOMI AND MORE YOU CAN BUY FOR RS 40000 GH VB
iPhone SE 2022: ఐఫోన్ ఎస్ఈ 2022కి ఆల్టర్నేటివ్ ఫోన్ కోసం చూస్తున్నారా..? ఈ టాప్ 5 ఫ్లాగ్షిప్ ఫోన్లపై ఓ లుక్కేయండి..
ప్రతీకాత్మక చిత్రం
యాపిల్ సంస్థ ఐఫోన్ SE 2022 భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీన్ని రూ. 43,900 ధర వద్ద అందుబాటులోకి తెచ్చింది. అయితే, యాపిల్ ఫోన్లలో ఐఓఎస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి, ఇదే ధరలో మీరు బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తున్నట్లైతే.. ఈ టాప్ 5 స్మార్ట్ఫోన్లను పరిశీలించండి.
భారత్‌లో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్(Market) వేగంగా విస్తరిస్తోంది. గతంలో బడ్జెట్ ఫోన్లకు(Budget Phones) మాత్రమే మొగ్గుచూపే కస్టమర్లు ఇప్పుడు ప్రీమియం(Premium) ఫోన్ల వైపు చూస్తున్నారు. దీంతో, ఐఫోన్ వంటి ప్రీమియం ఫోన్లకు డిమాండ్ (Demand) పెరిగింది. ఈ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని.. యాపిల్ సంస్థ ఐఫోన్ SE 2022 భారత మార్కెట్లోకి లాంచ్(Launch) చేసింది. దీన్ని రూ. 43,900 ధర వద్ద అందుబాటులోకి తెచ్చింది. అయితే, యాపిల్ ఫోన్లలో ఐఓఎస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి, ఇదే ధరలో మీరు బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్(Android Phone) కోసం చూస్తున్నట్లైతే.. ఈ టాప్ 5 స్మార్ట్ఫోన్లను పరిశీలించండి.
వన్‌ప్లస్ 9RT.. మీరు ఐఫోన్ SE 2022కి ప్రత్యామ్నాయ ఫోన్ వైపు చూస్తున్నట్లైతే.. రూ. 42,999 ధర వద్ద లభిస్తున్న వన్‌ప్లస్ 9RT ఫోన్‌ను ఎంచుకోవచ్చు. ఇది ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్తో పనిచేస్తుంది. ఈ ఫోన్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. వన్‌ప్లస్ ఫోన్ ప్రీమియం టచ్‌ను అందిస్తుంది. వన్‌ప్లస్ 9RT ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో OISతో కూడిన 50- మెగాపిక్సెల్ సెన్సార్, 16- మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉంటాయి. దీని ముందు భాగంలో 16 -మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4500mAh బ్యాటరీతో వస్తుంది.
ఐఫోన్ ఎస్ఈ 2022కి ప్రత్యామ్నయంగా షియోమి 11టీ ప్రో 5జీ ఫోన్‌ను సైతం పరిశీలించవచ్చు. ఈ ఫోన్ రూ. 41,999 ధర వద్ద లభిస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 888 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలోని 5200mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. ఈ ఫోన్ 6.67- అంగుళాల AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్,256 జీబీ స్టోరేజ్ గల సింగిల్ వేరియంట్లో లభిస్తుంది. కెమెరా విషయానికి వస్తే..108 -మెగాపిక్సెల్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 5 -మెగాపిక్సెల్ టెలిమాక్రో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది.
ఐక్యూ 9 5G
ఐక్యూ తన కొత్త 9 సిరీస్ ఫోన్‌ను రూ. 42,990 ధర వద్ద లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6.5 -అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED 120Hz డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 888+ చిప్సెట్తో పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. ఐక్యూ 9 5G గింబాల్ సిస్టమ్‌తో 48- మెగాపిక్సెల్ కెమెరా, వెనుకవైపు 13-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ కెమెరాలను అందించింది. దీని ముందు భాగంలో, 13 -మెగాపిక్సెల్ షూటర్‌ను కెమెరాను చేర్చింది. ఐక్యూ 9 5G SE 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 4350mAh బ్యాటరీతో వస్తుంది.
రియల్మీ జీటీ 5G
రియల్మీ జీటీ 5G రూ. 37,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 6.43 -అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 8 జీబీ ర్యామ్, 128GB స్టోరేజ్‌తో కూడిన స్నాప్‌డ్రాగన్ 888 ఆక్టా-కోర్ చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్ 64 -మెగాపిక్సెల్ సెన్సార్, 8 -మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 2 -మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. రియల్మీ జీటీ 5G 4500mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
ఐఫోన్ ఎస్ 2022కి ప్రత్యామ్నాయ ఫోన్ కోసం చూస్తున్నట్లైతే.. శామ్సంగ్ గెలాక్సీ ఎస్20 5జీ ఫోన్‌ను సైతం పరిశీలించవచ్చు. ఈ ఫోన్ రూ. 39,990 ధర వద్ద లభిస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 865 SoC చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్ 6.5 -అంగుళాల AMOLED 120Hz డిస్ప్లేను కలిగి ఉంటుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. గెలాక్సీ S20 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది 12- మెగాపిక్సెల్ వైడ్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ సెన్సార్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్‌ను కెమెరాలతో వస్తుంది. దీని ముందు భాగంలో 32 -మెగాపిక్సెల్ స్నాపర్ కెమెరాను కూడా చేర్చింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.