IPHONE PRICE DROP GOOD NEWS FOR IPHONE LOVERS DISCOUNT UP TO 28000 KNOW DETAILS GH EVK
iPhone Price drop: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 13, ఐఫోన్ 12 మోడళ్లపై ఏకంగా రూ. 28 వేల వరకు డిస్కౌంట్
(ప్రతీకాత్మక చిత్రం)
iPhone | యాపిల్ ఐస్టోర్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఐఫోన్ 13, ఐఫోన్ 12 మోడళ్లపై ఏకంగా రూ. 28 వేల వరకు తగ్గింపును ప్రకటించింది. అంతేకాదు, ఐఫోన్ ఎస్ఈ3 మోడల్‌పై కూడా భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది.
యాపిల్ (Apple) ఐఫోన్లకు మార్కెట్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విడుదలైన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. అయితే, ప్రీమియం సెగ్మెంట్లో లభించే ఐఫోన్ల (iPhone) ధరను చూసి చాలా మంది నిరాశ చెందుతుంటారు. అటువంటి వారికి యాపిల్ ఐస్టోర్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఐఫోన్ 13, ఐఫోన్ 12 మోడళ్లపై ఏకంగా రూ. 28 వేల వరకు తగ్గింపును ప్రకటించింది. అంతేకాదు, ఐఫోన్ ఎస్ఈ3 మోడల్‌పై కూడా భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.
యాపిల్ పునఃవిక్రేత ఐస్టోర్‌లో ఐఫోన్ 13 128 GB వేరియంట్‌పై రూ. 5000 ఇన్స్టంట్ డిస్కౌంట్‌తో పాటు రూ. 6000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇక, ఐఫోన్ ఎక్స్ఆర్ 64 GB వేరియంట్‌పై రూ. 18000 విలువ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ అందిస్తుంది. మరోవైపు, ఐస్టోర్‌లో ఐఫోన్ 12 128GB వేరియంట్‌పై రూ. 5000 డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి అదనంగా రూ. 5 వేల క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది. ఇక, ఐఫోన్ ఎక్స్ఆర్ 64GB వేరియంట్‌పై రూ.18000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ పొందవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ వాల్యూ మాత్రం మీరు ఎక్స్ఛేంజ్ చేయబోయే ఐఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది.
ఐఫోన్ 13 స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 13 ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్‌తో వస్తుంది. ఈ డిజైన్ పాత తరం ఐఫోన్ 12 మాదిరిగానే ఉంటుంది. ఇది 4K వీడియోలను రికార్డ్ చేయగల రెండు 12 -మెగాపిక్సెల్ స్నాపర్లతో వెనుక కెమెరా మాడ్యూల్తో వస్తుంది. దీని ముందు భాగంలో 12 -మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించింది.
ఐఫోన్ 13 మోడల్ A15 బయోనిక్ చిప్సెట్తో పనిచేస్తుంది. ఇది iOS15పై రన్ అవుతుంది. ఫేస్ ఐడీ, మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్, 5G కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. ఈ హ్యాండ్సెట్ 5 కలర్ వేరియంట్లలో లభిస్తుంది. మిడ్నైట్, బ్లూ, స్టార్‌లైట్, పింక్, ప్రొడక్ట్ రెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
ఐఫోన్ 12 మోడల్ 6.1 -అంగుళాల పొడవైన స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది OLED ప్యానెల్ గల 1,170 x 2,532 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది నీరు, ధూళి కణాలను నిరోధించేలా చేస్తుంది. ఈ ఫోన్ వెనుకవైపు 12MP f/1.6 + 12MP f/2.4 డ్యూయల్- ఎల్ఈడీ ఫ్లాష్, 12MP f/2.2 ఫ్రంట్ కెమెరాలను అందించింది. ఈ ఫోన్ A14 బయోనిక్ చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 2815mAh కెపాసిటీతో కూడిన లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. 20W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.