Home /News /technology /

IPHONE OFFER GOOD NEWS FOR IPHONE LOVERS HUGE EXCHANGE OFFER ON OLDER SMARTPHONES DETAILS HERE GH VB

iPhone Offer: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. పాత స్మార్ట్‌ఫోన్లపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐఫోన్ లవర్స్‌కు యాపిల్ గుడ్‌న్యూస్ చెప్పింది. పాత ఐఫోన్ (Old iPhone) లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ (Android Smartphones)లపై భారీ ఎక్స్ఛేంజ్ వ్యాల్యూని ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. మే 31 వరకు కొత్త ఐఫోన్ కొనుగోలుదారులకు ఈ అదనపు ట్రేడ్-ఇన్ క్రెడిట్‌ను ఈ సంస్థ ఆఫర్ చేస్తోంది.

ఇంకా చదవండి ...
టెక్ దిగ్గజం యాపిల్ (Apple) కంపెనీకి చెందిన ఐఫోన్ల (iPhones) ధరలు చాలా అధికంగా ఉంటాయి. వీటిపై కాస్త ధర తగ్గినా కొనుగోలుదారులపై చాలా భారం తగ్గుతుంది. అయితే ఇప్పుడు ఐఫోన్ లవర్స్‌కు యాపిల్ గుడ్‌న్యూస్ చెప్పింది. పాత ఐఫోన్ (Old iPhone) లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ (Android Smartphones)లపై భారీ ఎక్స్ఛేంజ్ వ్యాల్యూని ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. మే 31 వరకు కొత్త ఐఫోన్ కొనుగోలుదారులకు ఈ అదనపు ట్రేడ్-ఇన్ క్రెడిట్‌ను ఈ సంస్థ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ కింద మీరు మీ పాత మొబైల్(Mobile) ఇచ్చేసి ఆకర్షణీయమైన ఎక్స్చేంజ్ వాల్యూతో(Exchange కొత్త ఐఫోన్‌ను చాలా తక్కువగా ధరకే సొంతం చేసుకోవచ్చు.

ప్రస్తుత ఆఫర్‌తో వినియోగదారులు ఏదైనా ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. అది ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ అయినా కావచ్చు. మీరు మీ ఓల్డ్ మొబైల్స్‌పై రూ.5,200 నుంచి రూ.49,700 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూని పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రస్తుతం యాపిల్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌ (Apple’s Official Online Store)లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే యూజర్లు తమ ప్రాంతంలో ఆఫర్ అవైలబిలిటీ కోసం చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రేడ్-ఇన్ ఆఫర్‌లో యాపిల్ సంస్థ ఆండ్రాయిడ్ ఫోన్‌లను కూడా తీసుకుంటోంది. అయితే ఎప్పటిలాగే, ఐఫోన్‌లు ఎక్కువ ఎక్స్ఛేంజ్ వాల్యూని పొందుతాయి.

Dental Insurance: PNB మెట్‌లైఫ్ నుంచి కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్.. మొదటిసారి ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంచ్..


యాపిల్ సంస్థ అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో, అనేక ఇతర పిన్ కోడ్‌ ప్రాంతాల్లో పికప్, డెలివరీ సౌకర్యాలను ఉచితంగా ఆఫర్ చేయడం విశేషం. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందేందుకు, కొనుగోలుదారులు తమ ఫోన్ బ్రాండ్, మోడల్ పేరును సెలెక్ట్ చేసుకొని, ఆపై ఐఎంఈఐ (IMEI) నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఈ వివరాలను యాడ్ చేసిన తర్వాత, ఎక్స్ఛేంజ్ వాల్యూ ఆటోమేటిక్‌గా స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత, కస్టమర్ ఎగ్జిక్యూటివ్ మీ ఇంటికి ఫోన్‌ను తీసుకుంటారు. పాత స్మార్ట్‌ఫోన్‌ను పికప్ చేయడం, కొత్త స్మార్ట్‌ఫోన్ డెలివరీ ఒకే సమయంలో జరుగుతుంది.

మీ లొకేషన్‌కు వచ్చే యాపిల్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ మీ ఓల్డ్ స్మార్ట్‌ఫోన్ ఫిజికల్ కండిషన్‌ని చెక్ చేసి, మీరు చెప్పినట్లుగా స్మార్ట్‌ఫోన్ కండిషన్ ఉందో లేదో వెరిఫై చేస్తారు. లేకపోతే, ఎగ్జిక్యూటివ్ ఎక్స్ఛేంజ్ వాల్యూని తగ్గించవచ్చు. యాపిల్ పాత లేదా కొత్త అన్ని ఐఫోన్లను ఆఫర్ కింద తీసుకుంటుంది. మీరు ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌ను మార్చుకుంటే గరిష్టంగా రూ.49,700ని అందిస్తుంది. షియోమీ, శాంసంగ్ , వన్‌ప్లస్, వంటి అన్ని పాపులర్ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లకు కూడా చక్కటి వ్యాల్యూని యాపిల్ అందిస్తోంది.
Published by:Veera Babu
First published:

Tags: Apple, Exchange, Iphone, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు