హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Security Vulnerabilities: యాపిల్ డివైజ్‌లు యూజ్ చేస్తున్నారా.. అయితే మీరు చాలా డేంజర్‌లో ఉన్నారు.. ఎందుకో ఇది చదవండీ..!

Security Vulnerabilities: యాపిల్ డివైజ్‌లు యూజ్ చేస్తున్నారా.. అయితే మీరు చాలా డేంజర్‌లో ఉన్నారు.. ఎందుకో ఇది చదవండీ..!

యాపిల్ డివైజ్‌లు యూజ్ చేస్తున్నారా.. అయితే మీరు చాలా డేంజర్‌లో ఉన్నారు.. ఎందుకో ఇది చదవండీ..!

యాపిల్ డివైజ్‌లు యూజ్ చేస్తున్నారా.. అయితే మీరు చాలా డేంజర్‌లో ఉన్నారు.. ఎందుకో ఇది చదవండీ..!

ఐఫోన్, ఐపాడ్‌ లేదా మాక్ బుక్(MacBook) వంటి యాపిల్ ప్రొడక్ట్స్ వాడుతున్న వారికి సెక్యూరిటీ అలర్ట్ జారీ అయింది. ఐఓఎస్(IOS), ఐపాడ్‌ ఓఎస్ (iPadOS) మాక్ ఓఎస్ (macOS) వంటి యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో అనేక భద్రతా లోపాలను గుర్తించినట్లు కేంద్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎ

ఇంకా చదవండి ...

టెక్ దిగ్గజం యాపిల్‌ నుంచి వచ్చే ప్రొడక్ట్స్‌ను జీవితంలో ఒక్కసారైనా వినియోగించాలనే కోరిక చాలామందికి ఉంటుంది. వీటిలో సెక్యూరిటీ ఫీచర్లు కూడా హై లెవల్‌లో ఉంటాయి. అయితే ప్రస్తుతం ఐఫోన్, ఐపాడ్‌ లేదా మాక్ బుక్(MacBook) వంటి యాపిల్ ప్రొడక్ట్స్ వాడుతున్న వారికి సెక్యూరిటీ అలర్ట్ జారీ అయింది. ఐఓఎస్(IOS), ఐపాడ్‌ ఓఎస్ (iPadOS) మాక్ ఓఎస్ (macOS) వంటి యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో అనేక భద్రతా లోపాలను గుర్తించినట్లు కేంద్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరించింది.

ఆన్‌లైన్ అటాకర్ ఆర్బిటరీ కోడ్‌ను ఎగ్జిక్యూట్ చేసి, ఈ లోపాలను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. సెక్యూరిటీ చెక్స్ కూడా బైపాస్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా టార్గెట్ సిస్టమ్‌లో సర్వీసులను తిరస్కరణకు గురిచేయవచ్చు. అలాగే ఈ లోపాల కారణంగా హ్యాక్ చేసిన సిస్టమ్‌లో హానికర వెబ్ కంటెంట్‌ను క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు సీఈఆర్‌టీ తెలిపింది.

 ఇదీ చదవండి: టూర్ ప్లాన్ చేస్తున్నారా ? నార్త్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే.. ఎప్పటికీ మీరు మరచిపోలేరు..!


మీరు ఐఓఎస్ (iOS) 15. 6 కంటే పాత వెర్షన్‌లో రన్ అవుతున్న ఐఫోన్ వాడుతుంటే, అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. 15.6 కంటే పాత వెర్షన్‌ డివైజ్‌ను ఉపయోగిస్తున్న iPad వినియోగదారుల విషయంలో కూడా ఇదే పరిస్థితి. ఐఫోన్, ఐపాడ్‌ ఆడియో, జీపీయూ డ్రైవర్స్, ICU, వెబ్‌కిట్‌, యాపిల్ ఏబీడీ(AppleAVD)లో బఫర్ ఓవర్‌ఫ్లో కారణంగా హై-రిస్క్ లోపాలు ఉన్నట్లు సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్ గుర్తించారు.

* మ్యాక్‌బుక్ యూజర్లపై ప్రభావం

20022-005కు ముందు యాపిల్ macOS క్యాటలినాలో లోపాలు ఉన్నట్లు సీఈఆర్‌టీ గుర్తించింది. అలాగే 11.6.8కు ముందు MacOS బిగ్ సుర్ వెర్షన్‌లలో, 12.5కు ముందు MacOS Monterey వెర్షన్‌లో లోపాలను గుర్తించిన సీఈఆర్‌టీ.. హై-రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. AppleScript, SMB, కెర్నల్‌లో అట్- ఆఫ్ బౌండ్స్ రీడ్ కారణంగా ఈ లోపాలు బయటపడ్డాయి. ఆడియో, ICU, PS నార్మలైజర్, GU డ్రైవర్లు, SMB , వెబ్‌కిట్‌లలో అట్- ఆఫ్ బౌండ్స్ రైట్ కారణంగా లోపాలు గుర్తించారు.

యాపిల్ మొబైల్ ఫైల్ ఇంటిగ్రిటీ(AppleMobileFileIntegrity)లో కూడా లోపాలను గుర్తించారు. దీంతో క్యాలెండర్, iCloud ఫోటో లైబ్రరీలో ఉన్న సమాచారం బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ఫైల్ సిస్టమ్ ఈవెంట్స్, ప్లగిన్‌కిట్, విండోస్ సర్వర్, ఆటోమేషన్, ఇంటెల్ గ్రాఫిక్స్ డ్రైవర్, GPU డ్రైవర్స్, SMBలో మెమరీ లాజిక్ సమస్యలు ఉన్నట్లు కూడా గుర్తించారు. యాపిల్ డివైజ్‌లలో అందుబాటులో ఉన్న సెక్యూరిటీ ప్యాచ్‌లను అప్లై చేస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. డివైజ్‌లను అప్‌డేట్‌ చేసుకోవడంతో పాటు మార్పులను గమనించడం ద్వారా స్కామర్ల బారిన పడకుండా సేప్‌గా ఉండొచ్చని యాపిల్ తెలిపింది.

First published:

Tags: Apple, Apple iphone, Iphone, Smart phone

ఉత్తమ కథలు