హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

ఐఫోన్ కంటే వేగంగా పనిచేస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్.. వైరల్ వీడియోపై భగ్గుమంటున్న యాపిల్ నెటిజన్లు

ఐఫోన్ కంటే వేగంగా పనిచేస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్.. వైరల్ వీడియోపై భగ్గుమంటున్న యాపిల్ నెటిజన్లు

ఐఫోన్ కంటే వేగంగా పనిచేస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్ వైరల్‌వీడియోపై భగ్గుమంటున్న యాపిల్ నెటిజన్లు (credit - twitter)

ఐఫోన్ కంటే వేగంగా పనిచేస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్ వైరల్‌వీడియోపై భగ్గుమంటున్న యాపిల్ నెటిజన్లు (credit - twitter)

iPhone vs Android Phone: ఐఫోన్ బెటరా, ఆండ్రాయిడ్ ఫోన్ బెటరా అన్న అంశంపై మరోసారి దుమారం రేగింది. ఐఫోన్ యూజర్లు పెద్ద ఎత్తున ఆ వీడియోపై మండిపడుతున్నారు.

  iPhone vs Android Phone: ఈ రోజుల్లో టెక్నికల్ గాడ్జెట్స్ పై విశ్లేషణలు, రివ్యూలు కామన్. యూట్యూబ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాల్లో చాలా మంది తమ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఐతే... ఆండ్రాయిడ్ ఫోన్లతో పోల్చిత... ధర ఎక్కువగా ఉండే... ఐఫోన్లే బాగా పనిచేస్తాయని ఇన్నాళ్లూ ఆ ఫోన్ల వాడకం దార్లు చెబుతున్నారు. ఐతే, ఈ అభిప్రాయం కరెక్టు కాదనీ... ఐఫోన్ సాఫ్ట్ వేర్ వేగంగా స్పందించలేకపోతోందంటూ.... ఓ నెటిజన్... ట్విట్టర్ లో ఓ వీడియోని పోస్ట్ చేశాడు. అందులో ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్... రెండింటినీ పక్కపక్కనే పెట్టాడు. రెండింటిలోనూ సేమ్ యాప్ లను ఓపెన్ చేస్తుంటే... ఆండ్రాయిడ్ ఫోన్ లో యాప్ లు త్వరగా ఓపెన్ అవుతున్నాయి. యాప్ లే కాదు... వెబ్ సైట్లు, వైడ్ కెమెరా, నైట్ మోడ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటివి కూడా ఆండ్రాయిడ్ ఫోన్ లోనే వేగంగా వస్తుండటం ఇప్పుడు కొత్త దుమారానికి తెరతీసినట్లైంది.

  ఈ వీడియో పెట్టిన ట్విట్టర్ యూజర్ పేరు ఎలీ (Aly). అతను అప్ లోడ్ చేసిన ఈ వీడియో వల్ల ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లు, యాపిల్ iOS యూజర్ల మధ్య వర్చువల్ వార్ జరుగుతోంది. ఎవరికి వారు... తమ తమ బ్రాండ్ ఫోన్లే వేగంగా పనిచేస్తాయని చెబుతున్నారు.

  ఎలీ ప్రకారం... యాపిల్ ఫోన్లలో సాఫ్ట్ వేర్ అప్ డేట్ కావట్లేదు. కొత్త మోడల్స్ వచ్చినా సాఫ్ట్ వేర్ మాత్రం పాతదే అన్నది ఎలీ అభిప్రాయం. దీన్ని అడ్డంగా ఖండిస్తున్నా యాపిల్ ఐఫోన్ల యూజర్లు. యాపిల్ సాఫ్ట్ వేర్ లో వైరస్ లు ప్రవేశించే ఛాన్స్ ఉండదనీ, అదే ఆండ్రాయిడ్ అయితే... ప్రతి 3 నెలలకోసారి క్యాచ్ (టెంపరరీ ఫైల్స్) మొత్తం తీయాల్సి ఉంటుందనీ, అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుందనీ... వాదిస్తున్నారు.

  ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లను తప్పుపడుతూ... ఐఫోన్ యూజర్లు కౌంటర్ ట్వీట్లు చేస్తున్నారు. వాటిని ఖండిస్తూ... ఆండ్రాయిడ్ యూజర్లు... ఐఫోన్లు వేస్ట్ అంటున్నారు. ఇలా... రెండువైపులా వార్ నడుస్తోంది. ఎది బెటర్, ఏది సెకండ్ అన్నది ఎవరి అభిప్రాయం వారికే ఉంటోంది.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Android 11, Iphone

  ఉత్తమ కథలు