IPHONE CHARGING PORT FOR SAMSUNG PHONE ENGINEER DID IT SUCCESSFULLY AK GH
Apple Lightning port: శామ్సంగ్ ఫోన్‌కు ఐఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌ను అమర్చిన ఇంజనీర్.. అదెలా చేశాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
యాపిల్ (Apple) సంస్థ తయారుచేసే ఐఫోన్లు ఇతర ఫోన్లకు చాలా భిన్నంగా ఉంటాయి. వీటిలో లైటెనింగ్ పోర్ట్ కూడా యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్‌లకు పూర్తి డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే దీని ద్వారా ఆండ్రాయిడ్ (Android) ఫోన్‌ను కూడా ఛార్జ్ చేయవచ్చని నిరూపించాడో ఇంజనీర్.
యాపిల్ (Apple) సంస్థ తయారుచేసే ఐఫోన్లు ఇతర ఫోన్లకు చాలా భిన్నంగా ఉంటాయి. వీటిలో అందించే లైటెనింగ్ పోర్ట్ (Lightning Port) కూడా యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్‌లకు పూర్తి డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ ఛార్జింగ్ (Charging) పోర్ట్ ఉపయోగించి ఓన్లీ యాపిల్ ప్రొడక్ట్స్ మాత్రమే ఛార్జ్ చేయగలం. అయితే దీని ద్వారా ఆండ్రాయిడ్ (Android) ఫోన్‌ను కూడా ఛార్జ్ చేయవచ్చని నిరూపించాడో ఇంజనీర్. ఇందుకు ఈ ఇంజనీర్ చాలా స్టడీ చేశాడు. యాపిల్ సర్క్యూట్లను రీడ్ చేసి ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఛార్జింగ్ అయ్యేలా ఒక మార్గం కనిపెట్టాడు. అలా లైటెనింగ్ ఛార్జింగ్ పోర్ట్‌తో ఒక శామ్సంగ్ (Samsung) ఫోన్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఛార్జ్ చేశాడు. అంతేకాదు, యాపిల్ లైటెనింగ్ పోర్ట్‌ను శామ్సంగ్ ఫోన్‌కు అమర్చే ప్రొసీజర్ మొత్తాన్ని ఒక వీడియో రూపంలో యూట్యూబ్ వేదికగా షేర్ చేశాడు. https://youtu.be/W9VDdpsXfw8 ఇప్పుడా వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
కెన్ పిల్లోనెల్ అనే ఇంజనీర్ యాపిల్ ఐఫోన్లో కనిపించే లైటెనింగ్ పోర్ట్‌ను శామ్సంగ్ గెలాక్సీ ఏ51 (Samsung Galaxy A51)కి యాడ్ చేశాడు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు లైటెనింగ్ పోర్ట్‌ను విజయవంతంగా యాడ్ చేసినట్లు ఓ లేటెస్ట్ యూట్యూబ్ వీడియోలో వివరంగా చూపించాడు. లైటెనింగ్ పోర్ట్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఛార్జ్ చేయడమే కాకుండా డేటా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చని అతను చూపించాడు. డివైజ్ లిమిటెడ్ ఇంటర్నల్ స్పేస్ పై వర్క్ చేసి... లైటెనింగ్ కనెక్టర్, మైక్రో-సోల్డరింగ్, 3డీ-ప్రింటెడ్ కస్టమ్ కనెక్టర్ విషయంలో యాపిల్ యాజమాన్య సాఫ్ట్వేర్ చెకింగ్ ని బైపాస్ చేసినట్టు చెప్పాడు. ఇలా సాఫ్ట్వేర్ చెకింగ్ నుంచి లైటెనింగ్ కనెక్టర్ ఎస్కేప్ అయ్యేలా చేసేందుకు చాలా కష్టపడినట్లు పేర్కొన్నాడు. కొంచెం తేడా వచ్చినా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని.. ఇది కాంప్లెక్స్ మాడిఫికేషన్ అని.. దీనికి అవుట్ ఆఫ్ ది థింకింగ్ అవసరమయ్యిందని పిల్లోనెల్ చెప్పాడు.
"యాపిల్ విక్రయించే లైటెనింగ్ కేబుల్స్ తెలివి తక్కువవి, పిచ్చివేం కావు. అవి యాపిల్ డివైజ్‌లను మాత్రమే ఛార్జ్ చేస్తాయి. అందుకే ఇది యాపిల్ డివైజ్‌కు ప్లగ్ అయ్యిందని భావించేలా కేబుల్‌ను మోసగించడానికి నేను ఒక మార్గాన్ని కనుగొనవలసి వచ్చింది. అలానే మొత్తం కంటెంట్ ఫోన్ లోపల సరిపోవాలి. ఇది మరొక సవాలు," అని పిల్లోనెల్ తెలిపాడు.
శామ్సంగ్ ఫోన్‌కు సక్సెస్‌ఫుల్‌గా పోర్ట్ అమర్చినప్పటికీ అది నాణ్యత విషయంలో ఐఫోన్‌కు దరిదాపుల్లో కూడా లేదని పిల్లోనెల్ స్పష్టం చేశాడు. దీనిని ఎవరూ ప్రయత్నించవద్దని సూచించాడు. "ఇది కేవలం ఫన్ కోసం మాత్రమే" అని అతను చెప్పాడు. పిల్లోనెల్ గత సంవత్సరం ఐఫోన్ ఎక్స్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌ను సెట్ చేశాడు. ఆ ప్రాజెక్ట్‌పై కూడా, ఈ ఇంజనీర్ తన ఖాళీ సమయంలో నెలలపాటు గడిపాడు. ఇలాంటి ప్రాజెక్ట్‌లు ఒరిజినల్ ఫోన్లను తయారు చేసిన కంపెనీల సహాయం లేకుండా వాటితో ఏం చేయొచ్చనే దానికి ఉదాహరణగా నిలుస్తాయని అతను చెప్పుకొచ్చాడు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.