iPhone 6 : బాంబ్‌లా పేలిన ఐఫోన్.. భగ భగ మండుతూ..

iPhone 6 caught fire : అమెరికాకు చెందిన ఓ పదకొండేళ్ల బాలిక ఐఫోన్ 6 ఫోన్ వాడుతోంది. ఓ రోజు చేతిలో ఉండగానే ఫోన్‌లోంచి పొగలు వచ్చి, మంటలు పుట్టాయి. అంతే.. ఒక్కసారిగా భయపడ్డ ఆ బాలిక ఫోన్‌ను బెడ్‌పై విసిరేసింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 15, 2019, 6:43 PM IST
iPhone 6 : బాంబ్‌లా పేలిన ఐఫోన్.. భగ భగ మండుతూ..
iPhone (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
చైనా ఫోన్లు పేలడం చూశాం.. శాంసంగ్ ఫోన్లు కాలిపోవడం చూశాం.. కానీ, ఇప్పుడు ఐఫోన్లు కూడా పేలుతున్నాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసి, బూడిదలా మారుతున్నాయి. రిచ్ స్టేటస్ చూపించుకోవడానికి కొందరు.. వ్యక్తిగత భద్రత దృష్ట్యా కొందరు యాపిల్ కంపెనీ ఫోన్లనే కొంటుంటారు. అయితే, ఆ కంపెనీ ఫోన్లు కాలిపోతున్న ఘటనలు వినియోగదారులను, కంపెనీని ఆందోళనకు గురిచేస్తున్నాయి. వివరాల్లోకెళితే.. అమెరికాకు చెందిన ఓ పదకొండేళ్ల బాలిక ఐఫోన్ 6 ఫోన్ వాడుతోంది. ఓ రోజు చేతిలో ఉండగానే ఫోన్‌లోంచి పొగలు వచ్చి, మంటలు పుట్టాయి. అంతే.. ఒక్కసారిగా భయపడ్డ ఆ బాలిక ఫోన్‌ను బెడ్‌పై విసిరేసింది. ఇంకేముంది.. బెడ్, దానిపై ఉన్న బ్లాంకెట్ కాలిపోయాయి. ఐఫోన్ కాలిన ద‌‌‌ృశ్యాలను బాలిక తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

ఘటనపై స్పందించిన యాపిల్ సంస్థ.. ఫోన్ కాలిన దృశ్యాలను తమకు పంపించాలని బాలిక తల్లిని కోరింది. అలాగే, ఆ ఫోన్‌ను తమ కంపెనీకి పార్శిల్ చేయాలని విన్నవించింది. కాగా, ఐఫోన్ కాలిపోవడంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఐఫోన్ కూడా చైనా ఫోన్‌గా మారిపోయిందంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: July 15, 2019, 6:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading