iPhones 5G : ఇండియాలో గత నెలలో 5G నెట్వర్క్(5G network) అధికారికంగా లాంచ్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ లేటెస్ట్ టెక్నాలజీకి సపోర్ట్ చేసేలా తమ 5G డివైజ్‌లలో మార్పులు చేస్తున్నాయి స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు. టాప్ మొబైల్ కంపెనీలు ఈ ప్రక్రియను ఇప్పటికే చేపట్టగా, తాజాగా దీనిగురించి ఇండియన్ యూజర్లకు ఒక గుడ్‌న్యూస్ చెప్పింది యాపిల్(Apple company). కస్టమర్లకు 5G సపోర్ట్ అందించే iOS అప్డేట్ను వచ్చే వారం లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. యాపిల్ అందించే iOS 16 బీటా సాఫ్ట్‌వేర్‌తో 5G సర్వీస్ సపోర్ట్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇది బీటా వెర్షన్లో రోల్అవుట్ అవుతుంది, కాబట్టి ప్రతి యూజర్‌కి అప్డేట్ ఇప్పుడే అందదు. యాపిల్ బీటా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ చేసుకున్న వారు మాత్రమే iOS 16 బీటా సాఫ్ట్వేర్ అప్డేట్ పొందడానికి అర్హులు.
నెట్వర్క్ వ్యాలిడేషన్, క్వాలిటీ, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ పూర్తయిన వెంటనే, ఐఫోన్ యూజర్లకు 5G సేవలను అందిస్తామని యాపిల్ గత నెలలో ప్రకటించింది. ఇందుకు ఇండియాలోని క్యారియర్ పార్ట్‌నర్స్‌తో కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఐఫోన్లలో 5G ఎనేబుల్ అవుతుందని, డిసెంబర్లో వినియోగదారులకు ఇది అందుబాటులోకి వస్తుందని యాపిల్ వెల్లడించింది.
బీటా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌కి యాక్సెస్ ఎలా పొందాలి?
వ్యాలీడ్ యాపిల్ ID ఉన్న ఎవరికైనా యాపిల్ బీటా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు సైన్-అప్ చేసే సమయంలో, యాపిల్ బీటా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అగ్రిమెంట్‌ను అంగీకరించాలి. ఈ ప్రీ-రిలీజ్ సాఫ్ట్‌వేర్‌తో లేటెస్ట్ ఫీచర్లను యూజర్లు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. యాపిల్ బీటా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లో మెంబర్‌గా మీ ఐఫోన్, ఐపాడ్, మ్యాక్, యాపిల్ TV, హోమ్‌పాడ్ మినీ, యాపిల్ వాచ్‌లను తాజా పబ్లిక్ బీటా కోసం రిజిస్టర్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే పబ్లిక్ బీటాను ఇన్స్టాల్ చేసే ముందు యూజర్లు తమ డివైజ్ డేటాను బ్యాకప్ చేయడం మంచిది. కంపెనీ అన్ఎన్రోల్ పేజీలో పేర్కొన్న ప్రాసెస్ ప్రకారం, యాపిల్ బీటా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ నుంచి మీ యాపిల్ IDని రిమూవ్ చేసి, బీటా ప్రోగ్రామ్ నుంచి బయటకు రావచ్చు.
Twitter Blue: నవంబర్ చివరి నాటికి ఇండియాలో ట్విట్టర్ బ్లూ లాంచ్.. ఇండియన్ యూజర్ల కామన్ డౌట్స్ ఇవే..
ప్రస్తుతానికి కొన్ని మోడళ్లకే..
యాపిల్ అందిస్తున్న లేటెస్ట్ iOS 16 బీటా అప్డేట్ ప్రస్తుతం కొన్ని ఐఫోన్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ లిస్ట్‌ను కంపెనీ తాజాగా వెల్లడించింది. ఇందులో ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12, ఐఫోన్ SE (3వ తరం) మోడల్స్ మాత్రమే ఉన్నాయి.
భారతదేశంలో 5G సేవలు అక్టోబర్ 1న ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఎయిర్టెల్ , రిలయన్స్ జియో టెలికాం కంపెనీలు దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చాయి. మెజారిటీ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు 5G కంపాటబుల్ సాఫ్ట్వేర్ సపోర్టును కలిగి ఉండగా.. యాపిల్, శామ్సంగ్ కంపెనీలు మాత్రం డిసెంబర్ నాటికి ఇండియాలో 5G సపోర్ట్ కోసం ఫోన్ల సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g mobile, 5g network, Iphone