టెక్ దిగ్గజం యాపిల్ ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేయనుంది. వీటిలో టాప్ ఎండ్ వెర్షన్ అయిన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) అడ్వాన్స్‌డ్ స్పెసిఫికేషన్స్‌తో రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫీచర్ల గురించి ఆసక్తికరమైన లీక్స్ బయటికి వస్తున్నాయి. తాజాగా టెక్ టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ (Ice Universe) చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆ ట్వీట్ ప్రకారం, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అత్యంత సన్నని స్క్రీన్ బెజెల్స్ (Bezels)తో రానుంది.
ఈ ఫోన్ కవర్ ప్లేట్ బ్లాక్ బెజెల్ వెడల్పు 1.55 మిమీ (0.06 అంగుళాలు) మాత్రమే ఉంటుందట. అంటే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బెజెల్స్ చాలా సన్నగా (Thinnest Bezels) ఉండి డిస్‌ప్లే పెద్దగా కనిపించనుంది. టెక్ టిప్‌స్టర్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ గురించి మరిన్ని విశేషాలు వెల్లడించారు.
* ఆ రికార్డు బ్రేక్
బెజెల్స్ వెడల్పు తక్కువగా ఉండటం వల్ల డిస్‌ప్లే అనేది ఫోన్ ముందు భాగంలో ఎక్కువ భాగాన్ని కవర్ చేస్తుంది. అప్పుడు మరింత అద్భుతమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ఇక గతంలో 1.81mm బెజెల్ బ్లాక్ ఎడ్జ్‌తో షియోమీ 13 (Xiaomi 13) అత్యంత సన్నని బెజెల్స్‌తో వచ్చిన ఫోన్‌గా రికార్డు సృష్టించింది. త్వరలో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఆ రికార్డును బద్దలు కొడుతుందని టిప్‌స్టర్ చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : ఈ బ్యాంకుల కస్టమర్లకు అలర్ట్.. అలా చేస్తే మీ ఖాతా ఖాళీ!
మరోవైపు ఐఫోన్ 14 ప్రో 2.17 మి.మీ మందమైన బెజెల్స్‌తో కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయింది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫ్రంట్ గ్లాస్ వీడియోలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఫోన్లు డిస్‌ప్లే చుట్టూ అల్ట్రా-థిన్ బెజెల్స్‌తో వస్తాయని వీడియోలు వెల్లడించాయి. అయితే, యాపిల్ ఆల్వేస్-ఆన్, ప్రమోషన్ డిస్‌ప్లే ఫీచర్లను iPhone 15 ప్రో, 15 Pro మ్యాక్స్‌కి మాత్రమే పరిమితం చేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రిపోర్ట్స్ చాలా మందిలో నిరాశను కలిగిస్తున్నాయి.
* కొత్త ఫ్రేమ్‌తో మెరవనున్న ఐఫోన్స్
ఐఫోన్ 15 ప్రో మోడళ్లకు మాత్రమే Wi-Fi 6E నెట్‌వర్క్‌కు సపోర్టు లభిస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి. ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్‌లు హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌తో కూడిన సాలిడ్-స్టేట్ బటన్లు, ఎక్కువ ర్యామ్, టైటానియం ఫ్రేమ్ వంటి కొత్త ఫీచర్లతో రిలీజ్ అవుతాయని కూడా రిపోర్ట్స్ తెలిపాయి. చైనీస్ వెబ్‌సైట్‌ల నుండి లీకైన వీడియో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ గత యాపిల్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే సన్నని బెజెల్స్‌తో వస్తాయని వెల్లడించాయి. ఐఫోన్ 11 సిరీస్ మాదిరిగానే బెజెల్స్ కూడా అంచుల చుట్టూ కొద్దిగా వంగి ఉంటుందని ఈ వీడియోలలో తేలింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apple iphone, IPhone 15, Latest Technology, Tech news