హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone 15 Pro Max: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో పెరిస్కోప్ ఫోల్డింగ్ లెన్స్ కెమెరా.. స్పెషాలిటీ ఇదే

iPhone 15 Pro Max: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో పెరిస్కోప్ ఫోల్డింగ్ లెన్స్ కెమెరా.. స్పెషాలిటీ ఇదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టెక్ బ్రాండ్ యాపిల్ (Apple) ఏటా ఐఫోన్లలో సరికొత్త టెక్నాలజీలను పరిచయం చేస్తూ వస్తోంది. ఈసారి అప్‌కమింగ్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ (iPhone 15 Pro Max) మరో అద్భుతమైన టెక్నాలజీని తీసుకురానుందని వార్తలు వస్తున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

టెక్ బ్రాండ్ యాపిల్ (Apple) ఏటా ఐఫోన్లలో సరికొత్త టెక్నాలజీలను పరిచయం చేస్తూ వస్తోంది. ఈసారి అప్‌కమింగ్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ (iPhone 15 Pro Max) మరో అద్భుతమైన టెక్నాలజీని తీసుకురానుందని వార్తలు వస్తున్నాయి. టెక్ రిపోర్ట్స్ ప్రకారం, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ ఫోన్‌లో పెరిస్కోప్ ఫోల్డింగ్ జూమ్ కెమెరా (Periscope Folding Zoom Camera)ను కంపెనీ అందించనుంది. ఈ కెమెరా టెక్నాలజీ ఓన్లీ టాప్-ఎండ్ ఐఫోన్ మోడల్‌లో మాత్రమే వస్తుందని తెలుస్తోంది. ఇంతకుముందు, ఈ టెక్నాలజీను ఐఫోన్ 14 సిరీస్‌లో కంపెనీ చేర్చుతుందని యాపిల్ ఇన్సైడర్ రిపోర్ట్ చేసింది. అది జరగలేదు.

పెరిస్కోప్ ఫోల్డింగ్ జూమ్ కెమెరా సిస్టమ్‌ను ఎల్‌జీ ఇన్నోటెక్, జాహ్వా ఎలక్ట్రానిక్స్ సంస్థలు యాపిల్ కంపెనీకి తయారు చేసి ఇస్తాయని సమాచారం. పెరిస్కోప్ ఫోల్డింగ్ జూమ్ కెమెరా అనేది ఒక రకమైన కెమెరా టెక్నాలజీ కాగా ఇది కెమెరాను మరింత కాంపాక్ట్ డిజైన్‌లో రూపొందించేందుకు వీలుగా అద్దం లేదా ప్రిజమ్‌ను ఉపయోగిస్తుంది. ఇది లెన్స్ నుంచి ఇమేజ్ సెన్సార్‌కి కాంతిని మళ్లించడానికి అద్దం లేదా ప్రిజమ్‌ను ఉపయోగించడం ద్వారా పని చేస్తుంది. ఈ రకమైన కెమెరాను పెరిస్కోప్ కెమెరా అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది పెరిస్కోప్ మాదిరిగానే పనిచేస్తుంది.

పెరిస్కోప్‌ కెమెరా అద్దం లేదా ప్రిజమ్‌ ఉపయోగించి కాంతిని లెన్స్ నుంచి ఇమేజ్ సెన్సార్‌కి మళ్లించడం ద్వారా పని చేస్తుంది. ఇది యూజర్లు ఎలాంటి అస్పష్టత లేకుండా మరింత జూమ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అలా పెరిస్కోప్ కెమెరా సిస్టమ్ మెరుగైన జూమ్ సామర్థ్యాలను అందిస్తుంది. ఈ కెమెరా సిస్టమ్ ఐఫోన్ వెలుపలి భాగంలో ఎలాంటి డిఫరెన్స్‌ను చూపదు. కెమెరా బంప్ అనేది ఎప్పటిలాగానే కనిపిస్తుంది. అయితే ఇది ఐఫోన్ పొడవు, వెడల్పును వాడుకొని బాగా పనిచేస్తుంది.

ఈ ఫీచర్ 2024లో iPhone 15 Pro Maxలో ప్రారంభమవుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్ 16 ప్రోకి కూడా రావచ్చు. ఇక కొత్త ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్‌లకు మునుపటి కంటే ఎక్కువ తేడాలు ఉంటాయని నివేదికలు పేర్కొంటున్నాయి. మార్క్ గుర్మాన్ అనే జర్నలిస్ట్ ఐఫోన్ 15 ప్రో మాక్స్‌కు యాపిల్ వాచ్ అల్ట్రా మాదిరిగానే ఐఫోన్ 15 అల్ట్రా అని పేరు పెట్టవచ్చని అన్నారు. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ అనే నాలుగు ఐఫోన్ 15 మోడల్స్‌ డైనమిక్ ఐలాండ్ అనే కొత్త ఫీచర్‌తో వస్తాయని సమాచారం. ఈ నాలుగు మోడల్‌లు ప్రస్తుత మోడల్‌ల మాదిరిగానే అదే స్క్రీన్ సైజు, షేప్‌తో రావచ్చు.

First published:

Tags: Apple, Apple iphone

ఉత్తమ కథలు