హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్‌లో 4 స్మార్ట్‌ఫోన్స్... భారతదేశంలో ధర ఎంతో తెలుసా?

iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్‌లో 4 స్మార్ట్‌ఫోన్స్... భారతదేశంలో ధర ఎంతో తెలుసా?

iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్‌లో 4 స్మార్ట్‌ఫోన్స్... భారతదేశంలో ధర ఎంతో తెలుసా?
(image: Apple India)

iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్‌లో 4 స్మార్ట్‌ఫోన్స్... భారతదేశంలో ధర ఎంతో తెలుసా? (image: Apple India)

iPhone 14 Series | ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఐఫోన్ 14 (iPhone 14), ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్‌‌ని ఇండియాలో కొనొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

యాపిల్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. యాపిల్ హెడ్‌క్వార్టర్‌లో జరిగిన ఈవెంట్‌లో ఐఫోన్ 14 సిరీస్‌లో నాలుగు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది యాపిల్. ఐఫోన్ 14 (iPhone 14), ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ని లాంఛ్ చేసింది. భారతదేశంలో ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరల్ని కూడా ప్రకటించింది. ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ.79,900, ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900. ఇక ఐఫోన్ 14 ప్రో ప్రారంభ ధర రూ.1,29,900 కాగా, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,39,900. సెప్టెంబర్ 16న ఇండియాలో సేల్ ప్రారంభం అవుతుంది. ప్రీఆర్డర్స్ సెప్టెంబర్ 9న ప్రారంభం అవుతాయి. మిడ్‌నైట్, బ్లూ, స్టార్‌లైట్, పర్పుల్, ప్రొడక్ట్ రెడ్ కలర్స్‌లో కొనొచ్చు.

ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరలు ఇవే


128జీబీ256జీబీ512జీబీ1టీబీ
ఐఫోన్ 14రూ.79,900రూ.89,900రూ.1,09,900-
ఐఫోన్ 14 ప్లస్రూ.89,900రూ.99,900రూ.1,19,900-
ఐఫోన్ 14 ప్రోరూ.1,29,900రూ.1,39,900రూ.1,59,900రూ.1,79,900
ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్రూ.1,39,900రూ.1,49,900రూ.1,69,900రూ.1,89,900


Android Tips: స్మార్ట్‌ఫోన్‌లో అవసరంలేని ఫైల్స్ సింపుల్‌గా క్లీన్ చేయండిలా

ఐఫోన్ 14 సిరీస్ ఫీచర్స్


ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల డిస్‌ప్లేతో వస్తే, ఐఫోన్ 14 ప్లస్ మోడల్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ రెండు మోడల్స్‌లో ఏ15 బయోనిక్ చిప్‌సెట్ ఉంది. ఇదే చిప్‌సెట్ ఐఫోన్ 13 సిరీస్‌లో కూడా ఉన్న సంగతి తెలిసిందే. డిజైన్ కూడా అలాగే ఉంది. కెమెరా విషయంలో కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయి. 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఆటో ఫోకస్‌తో రావడం విశేషం. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో సిమ్ ట్రేతో వస్తాయి.

ఇక ఫ్లాగ్‌షిప్ మోడల్స్ అయిన ఐఫోన్ 14 ప్రో మోడల్లో 6.1 అంగుళాల డిస్‌ప్లే ఉంటే ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ రెండు మొబైల్స్‌లో ప్రో మోషన్ ఫీచర్‌తో సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉంది. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఉపయోగించుకోవచ్చు. వీటిలో ఏ16 బయోనిక్ చిప్‌సెట్, 48మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా లాంటి ఫీచర్స్ కామన్‌గా ఉన్నాయి.

Mobile Offer: ఈ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అదిరిపోయే ఆఫర్... 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, 8GB వరకు ర్యామ్

ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు ఐఓఎస్ 16 సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్ లభిస్తుంది. యాపిల్ ఫిట్‌నెస్+ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. ఐఫోన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు శాటిలైట్ కనెక్టివిటీ ఉండటం విశేషం. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లు నెట్వర్క్స్ కోసం సెల్ టవర్లకు కనెక్ట్ అవుతాయి. కానీ సెల్ టవర్స్ అందుబాటులో లేని దగ్గర ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్‌కు శాటిలైట్ల నుంచి సిగ్నల్ సపోర్ట్ లభిస్తుంది. ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. ఐఫోన్ 14 యూజర్లకు రెండేళ్ల పాటు ఈ సర్వీస్ ఉచితం.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Apple, Iphone 14, Smartphone

ఉత్తమ కథలు