హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone 14 Series: మరో వారం రోజుల్లో ఐఫోన్ 14 సిరీస్ లాంచ్.. ఈ ఫీచర్లు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్..

iPhone 14 Series: మరో వారం రోజుల్లో ఐఫోన్ 14 సిరీస్ లాంచ్.. ఈ ఫీచర్లు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్..

iPhone 14 Series

iPhone 14 Series

iPhone 14 Series: ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో అదిరిపోయే ఫీచర్ రానుందని ప్రముఖ టెక్ అనలిస్ట్ మింగ్-చి కువో వెల్లడించారు. దీంతో ఐ ఫోన్ లవర్లు వీటి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీదారు యాపిల్ (Apple) మరో వారం రోజుల్లో ఐఫోన్ 14 సిరీస్‌ (iPhone 14 series)ను లాంచ్ చేయనుంది. ఇప్పటివరకు విడుదలైన అన్ని ఐఫోన్ సిరీస్‌ల కంటే ఈ ఫోన్లపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం, ఈ మొబైల్స్ నక్షత్రాలను సైతం ఫొటో తీయగల ఆస్ట్రోఫోటోగ్రఫీ మోడ్, శాటిలైట్ కనెక్టివిటీ వంటి అద్భుతమైన ఫీచర్లతో విడుదల అవుతున్నాయని టెక్ రిపోర్ట్స్‌ పేర్కొనడమే! ఇంకా పంచ్ హోల్ డిస్‌ప్లే వంటి ఉత్తమ ఫీచర్లు కూడా ఐఫోన్ 14 మోడల్స్‌లో ఉన్నాయని టిప్‌స్టర్స్ వెల్లడిస్తున్నారు. దీంతో వీటిపై ఇంకా హైప్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో అదిరిపోయే ఫీచర్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో రానుందని ప్రముఖ టెక్ అనలిస్ట్ మింగ్-చి కువో వెల్లడించారు. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ గతేడాది లాంచ్ చేసిన వాటి కంటే మెరుగైన అల్ట్రా-వైడ్ (Ultra-wide) యాంగిల్ కెమెరాలతో వస్తాయని తెలిపారు.మింగ్-చి కువో ట్వీట్ల ప్రకారం, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ అల్ట్రా-వైడ్ కెమెరాలను పొందే అవకాశం ఉంది. సీఎంఓస్ (CMOS) ఇమేజెస్ సెన్సార్ వాయిస్ కాయిల్ మోటార్, కాంపాక్ట్ కెమెరా మాడ్యూల్ (CCM) ధర కారణంగా ఐఫోన్ 14 ప్రో మోడల్స్ ధరలు పెరగొచ్చన్నారు.
45 శాతం నుంచి 70 శాతం ఎక్కువ ధర గల ఈ కెమెరాల అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ ధర 40 శాతం పెరగొచ్చని అన్నారు. ఇతర భాగాల ధరల పెరుగుదల పరిమితంగా ఉందని కూడా కువో తెలిపారు. సోనీ (CIS), మొదటి వర్చువల్ ఛానెల్ మెమరీ (VCM) సప్లయర్ Minebea, రెండో సప్లయర్ లార్గాన్, LG ఇన్నోటెక్ (CCM) అనే కంపెనీలు అల్ట్రా-వైడ్ కెమెరా అప్‌గ్రేడ్లు అందించాయని ట్వీట్ చేశారు.


అప్‌గ్రేడ్ చేసిన 48MP వైడ్ కెమెరా సెన్సార్ కారణంగా ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మునుపటి వాటితో పోలిస్తే పెద్ద కెమెరా బంప్‌తో వస్తాయని కువో పేర్కొన్నారు. అతని ప్రకారం, 48-మెగాపిక్సెల్ CIS డయాగ్నల్‌ లెంగ్త్‌ 25-35 శాతం పెరుగుతుంది. అలానే, 48-మెగాపిక్సెల్ సెన్సార్ 7P లెన్స్ ఎత్తు 5-10 శాతం పెరుగుతుంది.
ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లోని అల్ట్రా-వైడ్ లెన్స్ 1.4µm పిక్సెల్స్‌తో రావచ్చు. మరో లేటెస్ట్ లీక్ ప్రకారం, యాపిల్ కంపెనీ ఐఫోన్ 14 సిరీస్‌తో రెండు కొత్త కలర్ ఆప్షన్స్ తీసుకొస్తోంది. ఐఫోన్ 14 ప్రో డమ్మీ ఫొటోలు ఇప్పటికే నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫొటోలలో ఐఫోన్ 14 ప్రో మొబైల్‌ సరికొత్త డార్క్ పర్పుల్ (Dark Purple), బ్లూ (Blue) కలర్స్‌లో కనిపించింది.
ఇది కూడా చదవండి : వివో నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. అదిరే ఫీచర్లు దీని సొంతం..


ఈ ఫొటోలలో ఇతర కలర్ ఆప్షన్స్ గోల్డ్, వైట్, బ్లాక్ కూడా కనిపించాయి. గోల్డ్, పర్పుల్ మోడళ్ల యాంటెన్నా బ్యాండ్‌లు మునుపటి సంవత్సరాలలో ఐఫోన్ల వలె కాకుండా తెలుపు రంగులో ఉంటాయని ఫోటోల ప్రకారం తెలుస్తోంది. దాని వల్ల ఇవి ఫోన్ ఫ్రేమ్‌కు కాస్త భిన్నంగా కనిపిస్తాయి.
ఈ ఫొటోలు డమ్మీవే కాబట్టి ఈ విషయంపై అధికారిక సమాచారం లభించే వరకు వెయిట్ చేయక తప్పదు. టెక్ రిపోర్ట్స్ ప్రకారం, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌తో పోలిస్తే ఐఫోన్ 14 ప్రో వేరియంట్లు అధిక ఛార్జింగ్ స్పీడ్‌తో వస్తాయి. ఈ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 8 (Watch series 8) సెప్టెంబర్ 07, 2022న లాంచ్ కావచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Apple, Iphone 14, Tech news

ఉత్తమ కథలు