IPHONE 14 PRO MAX WITH A 5000 MAH BATTERY WOULD BE THE END TO THE ANDROID VS APPLE BATTERY DEBATE UMG GH
iPhone Battery: ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లో 5000 mAh బ్యాటరీ.. ఈ దెబ్బతో ఆ చర్చకు ఫుల్స్టాపేనా..!
ఆండ్రాయిడ్, ఐఫోన్ బ్యాటరీ వివాదం ఇంక ముగిసినట్లేనా..?
ఐఫోన్ (iphone) 14 ప్రో మ్యాక్స్ బ్యాటరీని, స్క్రీన్ పరిమాణానికి తగ్గించినట్లు సమాచారం. iphone 14 pro సిరీస్ గురించి ఇతర లీక్‌లు ఈసారి పుకార్లు కన్విన్సింగ్‌గా ఉన్నాయి. వీటిలో ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌తో పోలిస్తే పెద్ద బ్యాటరీలు ఉన్నాయని సమాచారం.
బ్యాటరీ సామర్థ్యం విషయంలో యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్ల మధ్య చాలా కాలంగా చర్చ నడుస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం యాపిల్ కూడా బ్యాటరీ సామర్థ్యాలను పెంచుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను పరిశీలిస్తే ఐఫోన్ 13 ప్రో మాక్స్ బ్యాటరీ లైఫ్ ఛాంప్. ఇది శామ్సంగ్, గూగుల్, వన్‌ప్లస్, మోటొరోలా, షియోమి ఫోన్లు అన్నింటినీ అధిగమిస్తుంది. ఇప్పటి వరకు యాపిల్ పెద్ద బ్యాటరీలను అందించేందుకు ప్రయత్నించలేదు.. కానీ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ బ్యాటరీ లీగ్‌లో నిలిచింది. ఒకవేళ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ (సెప్టెంబర్‌లో విడుదల కానుంది) గెలాక్సీ ఎస్22 అల్ట్రా, పిక్సెల్ 6 ప్రో Pro మాదిరిగానే బ్యాటరీని కలిగి ఉంటే? ఒకే ఛార్జ్‌తో ఇది రెండు రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందా? సాధారణ వినియోగానికి మూడు రోజులు పనిచేయవచ్చా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు ఇప్పటివరకు చూసిన ఐఫోన్ 14 లీక్‌లను పరిశీలిద్దాం.
Apple బ్యాటరీ
iPhone 13 Pro Max, iPhone 13 మినీ బ్యాటరీ లైఫ్ అద్భుతంగా ఉంది. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లో 4352 mAh సెల్ ఉంది. సామర్థ్యానికి సంబంధించినంతవరకు, మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా పెద్ద బ్యాటరీలను కలిగి ఉన్నాయని పరిగణనలోకి తీసుకుంటే, ఇది స్పెక్ట్రం సగటు వైపు ఉంది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తే.. అది యాపిల్ ప్రస్తుత టాప్ ఫ్లాగ్షిప్తో పోలిస్తే 15% పెద్దదిగా ఉంటుంది. గెలాక్సీ ఎస్22 అల్ట్రా, పిక్సెల్ 6 ప్రోతో సమానంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, గెలాక్సీ ఎస్22 అల్ట్రాను సగటున 25% ఛార్జ్‌తో అధిగమించగలదని, ఐఫోన్‌ను పిక్సెల్ 6 ప్రోతో పోల్చినట్లయితే, గూగుల్ అత్యంత ప్రీమియం ఫ్లాగ్షిప్ యాపిల్ కంటే 40% తక్కువ బ్యాటరీ జీవితాన్ని అందిస్తుందని కొందరు నిపుణులు తెలిపారు.
iPhone 14 Pro Max ఫోన్ 5000 mAh బ్యాటరీని పొందే అవకాశం ఉందా?
ప్రస్తుతానికి ఐఫోన్ 14 సిరీస్ బ్యాటరీ పరిమాణాల గురించి పెద్దగా సమాచారం తెలియదు. అయితే, ఇటీవల ఓ నివేదికలో పేర్కొన్నట్లు.. కొత్త ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ గురించి బోల్డ్ క్లెయిమ్‌లు ఉన్నాయి. ఐఫోన్ 13 కంటే 35% మెరుగైన GPU, 42% మెరుగైన CPU పనితీరు ఇస్తాయని సమాచారం. యాపిల్ హార్డ్‌వేర్ అప్గ్రేడ్లను (A16 బయోనిక్ చిప్, ఐఫోన్ 14 ప్రోలో కొత్త డబుల్-పంచ్ హోల్ డిజైన్ సహా) అంచనా వేయడంలో గొప్ప ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్న ట్విట్టర్ ఇంటర్నల్ పర్సన్ ShrimpApplePro తన తోటి టిప్‌స్టర్ ట్వీట్‌ను పంచుకున్నారు.
iPhone 14 Pro సిరీస్‌లో మెరుగైన డిస్ప్లే, చిప్, బ్యాటరీ?
ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ బ్యాటరీని, స్క్రీన్ పరిమాణానికి తగ్గించినట్లు సమాచారం. ఐఫోన్ 14 ప్రో సిరీస్ గురించి ఇతర లీక్‌లు ఈసారి పుకార్లు కన్విన్సింగ్‌గా ఉన్నాయి. వీటిలో ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌తో పోలిస్తే పెద్ద బ్యాటరీలు ఉన్నాయని సమాచారం. సమర్థవంతమైన 1-120Hz డిస్ప్లే (ఐఫోన్ 13 ప్రో సిరీస్‌లో 10-120Hz నుంచి), కొత్త A16 బయోనిక్ చిప్‌ను A14 నుంచి A15కి అప్‌గ్రేడ్ చేసినట్లు పేర్కొంటున్నాయి. సమర్థవంతమైన A16 బయోనిక్ చిప్ కచ్చితంగా ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్‌లో మెరుగైన పనితీరుకు దోహదపడుతుంది. అలాగే కొత్త 1-120Hz ప్రమోషన్ స్క్రీన్ అవసరమైనప్పుడు 1Hz కంటే తక్కువ రిఫ్రెష్ చేయగలదు. బ్యాటరీ లైఫ్‌ను కాపాడుతుంది.
iOS 16 ఆల్వేస్ ఆన్-డిస్ప్లే ఫీచర్
ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్ చివరకు AOD (ఆల్వేస్ డిస్ప్లే) పొందుతాయని భావిస్తున్నారు. స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా సమయం, తేదీ, బ్యాటరీ శాతం, నోటిఫికేషన్ బ్యాడ్జ్‌ల సమాచారం డిస్ప్లే అవుతుంది. అయితే ఫోన్‌ను యూజ్ చేసే దాన్ని బట్టి బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం కనిపిస్తుంది. ఉదాహరణకు మెసేజ్‌లు, నోటిఫికేషన్ల కోసం ఫోన్‌ను తరచూ చెక్ చేసే వ్యక్తి అయితే.. అలాంటప్పుడు AOD డిస్ప్లే కొంత బ్యాటరీ లైఫ్న సంరక్షించడంలో సహాయపడవచ్చు. ఎందుకంటే ఈ సమాచారం ఎల్లప్పుడూ ఉంటుంది, ఫోన్‌ని అన్‌లాక్ చేసి, దాని కోసం సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే, తరచుగా సమయం లేదా నోటిఫికేషన్లను తనిఖీ చేసే వ్యక్తి కాకపోతే.. యాపిల్ వాచ్ వినియోగిస్తుంటే.. AOD వాస్తవానికి ఐఫోన్ 14 ప్రోలో ప్రతిఫలంగా కనిపించదు.
ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 5000 mAh బ్యాటరీతో వస్తుందా? ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ కంటే 15% ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని ఇస్తుందా? అనే విషయాలపై నిర్ధారణ కష్టం. అయితే ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ బ్యాటరీ 2020 నుంచి ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌తో పోలిస్తే కచ్చితంగా 15% ఎక్కువ సామర్థ్యాన్ని పొందింది. రాబోయే ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ దాని ముందు ఫోన్లతో పోలిస్తే 0.2mm మందంగా ఉంటుందని సమాచారం.
ఒక ఐఫోన్ బ్యాటరీ పరిమాణం పెరిగితే, సాధారణంగా లైనప్‌లోని మిగిలిన ఐఫోన్లు కూడా అనుసరిస్తాయి. యాపిల్ సామర్థ్యం లేదా స్క్రీన్-ఆన్-టైమ్‌కు బదులుగా అదనపు గంటల ఉపయోగం (వీడియో ప్లేబ్యాక్‌పై దృష్టి సారించే మెట్రిక్) ద్వారా బ్యాటరీ లైఫ్‌ను కొలుస్తుంది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.