Letv S1 Pro Price | చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ లీటీవీ తాజాగా అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. లీటీవీ ఎస్1 ప్రో పేరుతో కొత్త మొబైల్ ఫోనును ఆవిష్కరించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ (Smartphone) చూడటానికి ఐఫోన్ (iPhone) 14 ప్రో మాదిరి ఉండటం గమనార్హం. ఆఫర్డబుల్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఇది. ఇందులో హుబెన్ టీ7510 ప్రాసెసర్ ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్లతో ఇది సమానమైన పనితీరును కనబరుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ రేటు రూ. 12 వేలలోపే ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఐఫోన్ 14 ప్రో రేటు రూ1.3 లక్షల నుంచి ఉంది.
ఐఫోన్ 14 ప్రోలో ఉండే ట్రిపుల్ కెమెరా లేఔట్ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఉంది. అలాగే చూడటానికి కూడా ఫోన్ ఐఫోన్ 14 ప్రో మాదిరి ఉంటుంది. వీబో పోస్ట్ ద్వారా లీటీవీ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ అంశాన్ని వెల్లడించింది. త్వరలోనే ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది. అయితే కంపెనీ ఈ ఫోన్‌ను సంబంధించిన ఫీచర్లు, ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు.
55 ఇంచుల స్మార్ట్‌టీవీపై రూ.29,000 డిస్కౌంట్.. నెలకు రూ.1,000 కడితే చాలు మీ సొంతం!
లీటీవీ ఇలా కాపీ క్యాట్ స్మార్ట్‌ఫోన్స్ తీసుకురావడం ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా ఐఫోన్ మోడళ్లను పోలి ఉండే విధంగా పలు మోడళ్లను తీసుకువచ్చింది. గతంలో లీటీవీ వై1 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ తెచ్చింది. ఇది ఐఫోన్ 13 మాదిరి ఉంటుంది. దీని ధర కేవలం రూ. 6 వేలు మాత్రమే. 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ మోడల్‌కు ఈ రేటు వర్తిస్తుంది. లీటీవీ ప్రో ప్లస్ ఫోన్‌లో 6.5 ఇంచుల స్క్రీన్, సెల్ఫీ కెమెరా నాచ్, 8 ఎంపీ రియర్ కెమెరా వంటి పలు ఫీచర్లు ఉన్నాయి. కాగా ఈ ఫోన్ కేవలం చైనా మార్కెట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని చెపుకోవచ్చు.
మెగా డిస్కౌంట్ ఆఫర్.. రూ.12,500 కూలర్ రూ.3 వేలకే, ఇప్పుడే కొనేసుకోండి!
ఇకపోతే మన దేశంలో రెడ్‌మి కంపెనీ తాజాగా కొత్త ఫోన్ తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు. రెడ్‌మి నోట్ 12 ప్రో ప్లస్ 5జీ దీని పేరు. ఈ ఫోన్ రేటు రూ. 29,999. ఇందులో ఏకంగా 200 ఎంపీ కెమెరా ఉంటుంది. అలాగే 4980 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. 120 హెర్ట్జ్ అమొలెడ్ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం. కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ ఫోన్‌ను ఒకసారి పరిశీలించొచ్చు. అలాగే ఈ ఫోన్ 5జీ సపోర్ట్ కూడా చేస్తుంది. ఫోటోగ్రఫీపై మక్కువ ఉన్న వారు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Apple iphone, Iphone, Iphone 14, New smartphone