హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone 14 Pro: రూ.6,499కే ఐఫోన్ 14 ప్రో.. నమ్మి డబ్బులు చెల్లిస్తే మీ పని గోవిందా గోవిందా!

iPhone 14 Pro: రూ.6,499కే ఐఫోన్ 14 ప్రో.. నమ్మి డబ్బులు చెల్లిస్తే మీ పని గోవిందా గోవిందా!

iPhone 14 Pro: రూ.6,499కే ఐఫోన్ 14 ప్రో.. నమ్మి డబ్బులు చెల్లిస్తే మీ పని గోవిందా గోవిందా!

iPhone 14 Pro: రూ.6,499కే ఐఫోన్ 14 ప్రో.. నమ్మి డబ్బులు చెల్లిస్తే మీ పని గోవిందా గోవిందా!

iPhone 14 Pro: యాపిల్ కంపెనీ నుంచి అద్భుతమైన ఫీచర్లతో ఇటీవల ఐఫోన్ 14 సిరీస్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ మొబైల్స్‌లో ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) చాలామందిని ఆకట్టుకుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

యాపిల్ కంపెనీ (Apple Company) నుంచి అద్భుతమైన ఫీచర్లతో ఇటీవల ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ మొబైల్స్‌లో ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) చాలామందిని ఆకట్టుకుంది. చాలామంది డిస్కౌంట్ ధరలతో ఈ హై ఎండ్ మోడల్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వినియోగదారులను మోసగించడానికి స్కామర్లు తాజాగా సరికొత్త స్కామ్‌లకు తెర లేపుతున్నారు.

ఈ క్రమంలో Moltox.in అనే కొత్త వెబ్‌సైట్ ఐఫోన్ 14 ప్రో 1 TB స్టోరేజ్ వేరియంట్‌ను కేవలం రూ.6,499కే అందిస్తున్నామని ప్రచారం చేస్తోంది. "Sale5" అనే ప్రోమో కోడ్ ఉపయోగిస్తే చాలు, ఈ ధరకే సొంతం చేసుకోవచ్చని చెబుతోంది. రూ.1,79,990 విలువైన ఐఫోన్ 14 ప్రోను ఈ పోర్టల్ అంత తక్కువ ధరకు ఎలా అమ్ముతోంది? అనే అనుమానం చాలామంది యూజర్లకు వస్తోంది.

* పెద్ద ఫ్రాడ్

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో ఐఫోన్ 14 ప్రో మోడల్‌కు తిరుగులేదు. అందుకే వీటికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఆ డిమాండ్‌ను ఉపయోగించుకుంటూ స్కామ్స్ చేయడం ఈజీ అని మోసగాళ్లు అమాయక ప్రజలను ఆశ పెడుతున్నారు. Moltox.in వెబ్‌సైట్ నిర్వాహకులు కూడా ఇదే పని చేస్తున్నారు. రూ.6,499కే నంబర్ వన్ ఫోన్ దొరుకుతుంది కదా అని టెంప్ట్ అయ్యే ముందు కొన్ని విషయాలను వినియోగదారులు తప్పక తెలుసుకోవాలి.

అదేంటంటే, ఈ వెబ్‌సైట్ క్యాష్ ఆన్ డెలివరీని పేమెంట్ ఆప్షన్‌గా అందించడం లేదు. కస్టమర్‌కు ప్రొడక్ట్‌ను డెలివరీ చేయకుండా ఉండటానికి స్కామర్‌లు ఉపయోగించే అత్యంత కామన్ ట్రిక్ ఇది. సో, ఆన్‌లైన్ పేమెంట్ మాత్రమే ఆప్షన్‌గా ఉండే వాటిని ఎప్పుడూ నమ్మకూడదు.

రెండవది, Moltox.in ఆఫర్ చేస్తున్న ఐఫోన్ 14 Pro 1TB మోడల్‌ ధర అని చెప్పవచ్చు. దీని రియల్ రిటైల్ ధర రూ.1,79,990 కాగా ఒరిజినల్ దానికంటే Moltox.in చెబుతున్న రేట్ చాలా తక్కువగా ఉంది. ఇంత తక్కువ ధరతో అమ్మడమే ఇక్కడ అనుమానించాల్సిన పెద్ద విషయం.

వారు పంపేది ప్రొడక్ట్‌ యాపిల్ ఐఫోన్ ప్రో కాదు కాబట్టే ఇంత తక్కువ ధర అని చెబుతున్నారు. డిస్కౌంట్‌ని సాధ్యం కాని రీతిలో పెంచుతున్నారు. ఐఫోన్ 14 ప్రో అనే కాదు నమ్మదగిన ఫ్లాట్‌ఫామ్స్‌లో కాకుండా అతి తక్కువ డిస్కౌంట్‌తో లభించే ఏ ప్రొడక్ట్ అయినా కొనుగోలు చేయకపోవడమే బెటర్.

ఇది కూడా చదవండి : గర్భిణి ప్రాణాలను కాపాడిన యాపిల్ స్మార్ట్‌వాచ్.. టెక్నాలజీ చేసిన మరో అద్భుతం

Moltox.in వెబ్‌సైట్‌లో ఇంగ్లీష్ వ్యాకరణం, గణిత తప్పులు ఉన్నాయని కూడా గమనించవచ్చు. ఈ మిస్టేక్స్ కనిపిస్తే అది కచ్చితంగా స్కామ్ అనే గుర్తించాలి. మొత్తంగా చూసుకుంటే, మీరు కొత్త ఐఫోన్ కోసం మార్కెట్‌లో మంచి డీల్స్ కోసం వెతుకుతుంటే.. పేరున్న రిటైలర్లను సంప్రదించడం ఉత్తమం. అలాగే నిజం కానంత మంచిగా అనిపించే డీల్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

128జీబీ స్టోరేజ్‌ గల కొత్త ఐఫోన్ 14 ప్రో ధర కూడా తక్కువేం లేదు. దీని ధర రూ.1,29,990 కాగా Moltox.in వెబ్‌సైట్ దీన్ని 90% తగ్గింపుతో తక్కువ ధరకు అందిస్తోంది. నిజానికి యాపిల్ తన కొత్త ప్రొడక్ట్స్ ధరలను ఎప్పుడూ తగ్గించదు. అందువల్ల, ఇలాంటి డిస్కౌంట్స్‌ను ఎప్పుడూ నమ్మకూడదు. అలానే, ముందుగానే అస్సలు డబ్బులు చెల్లించకూడదు.

First published:

Tags: Fact Check, Iphone 14, Tech news