హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone 14 Max: త్వరలో ఇండియాలో ఐఫోన్ 14 మాక్స్ లాంచ్.. కొత్త ఐఫోన్ ధర, స్పెసిఫికేషన్‌ల వివరాలు ఇవే..!

iPhone 14 Max: త్వరలో ఇండియాలో ఐఫోన్ 14 మాక్స్ లాంచ్.. కొత్త ఐఫోన్ ధర, స్పెసిఫికేషన్‌ల వివరాలు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యాపిల్ కంపెనీ నుంచి ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు ఈ ఏడాది చివరిలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం తరహాలోనే రాబోయే ఐఫోన్ సిరీస్‌లో కంపెనీ నాలుగు కొత్త మోడళ్లను తీసుకురానుంది.

యాపిల్ కంపెనీ(Apple Company) నుంచి ఐఫోన్ 14 సిరీస్(iPhone Series) ఫోన్లు ఈ ఏడాది చివరిలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం తరహాలోనే రాబోయే ఐఫోన్ సిరీస్‌లో కంపెనీ నాలుగు కొత్త మోడళ్లను(New Models) తీసుకురానుంది. అయితే ఈసారి "మినీ" మోడల్(Model) ఏదీ ఉండదు. యాపిల్ ఈసారి ఐఫోన్ 14 మాక్స్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఐఫోన్ SE సిరీస్ విక్రయాలపై ప్రభావం చూపుతున్నందున, టెక్ దిగ్గజం ఐఫోన్ మినీ వెర్షన్‌ను ఈ సంవత్సరం విడుదల చేయదని నివేదికలు సూచిస్తున్నాయి. కంపెనీ ప్రస్తుతం ఈ సంవత్సరం ప్రారంభంలో iPhone SE(2022)ని లాంచ్‌ చేసింది. iPhone SE(2022) 64GB మోడల్‌ ప్రారంభ ధర రూ.43,900, 256GB స్టోరేజ్ మోడల్‌ ధర రూ.58,900గా ఉంది. అయితే ఐఫోన్ 14 మాక్స్‌తో సహా రాబోయే ఐఫోన్ మోడల్‌ల గురించి కొన్ని వివరాలు లీక్‌ అయ్యాయి. లీకేజీల ప్రకారం.. iPhone 14 Max గురించి వైరల్‌ అవుతున్న వివరాలు తెలుసుకుందాం.

Telangana Jobs: తెలంగాణ కొలువుల జాతర.. మరో 1271 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

* ఐఫోన్ 14 ప్రో మాక్స్ లాంచ్ తేదీ

యాపిల్ సాధారణంగా తన కొత్త ఐఫోన్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను సెప్టెంబర్ రెండవ వారంలో విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం కూడా అదే చేయాలని భావిస్తోంది. అయితే చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, విధించిన పరిమితుల కారణంగా లాంచ్‌లో కొంత ఆలస్యం జరగవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఇతర నివేదికలు టెక్ దిగ్గజం ఉత్పత్తిని పెంచడానికి, ఐఫోన్ 14 సిరీస్‌ను అనుకున్న సమయానికి విడుదల చేయడానికి సరఫరాదారులతో కలిసి పనిచేస్తున్నట్లు సూచిస్తున్నాయి.

* iPhone 14 Pro Max స్పెసిఫికేషన్లు

డిస్‌ప్లే: iPhone 14 Maxలో మునుపటి iPhone 12 లాగా వైడ్‌-నాచ్‌తో కూడిన 6.1-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ప్రో మోడల్‌లు విభిన్న డిజైన్‌ను కలిగి ఉంటాయి. పిల్‌-ఆకారపు నాచ్‌ను కలిగి ఉంటాయి.

ప్రాసెసర్: ఐఫోన్ 14 అన్ని నాలుగు మోడల్‌లు A16 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా వస్తాయి. ఇది iPhone 13 సిరీస్‌ను అమలు చేసే A15 బయోనిక్ చిప్‌ కంటే కొంచెం ఎక్కువగా ఆప్టిమైజ్ చేస్తుందని భావిస్తున్నారు.

స్టోరేజ్: iPhone 13 సిరీస్ మాదిరిగానే, iPhone 14 మోడల్‌లు కూడా కనీసం 128GB స్టోరేజ్‌ని, 512GB స్టోరేజ్ వరకు అందించే అవకాశం ఉంది.

కెమెరా: ఐఫోన్ 14 రెండు రియర్ కెమెరా సెన్సార్‌లను, ఐఫోన్ 13 సిరీస్‌కు సమానమైన వైడ్ నాచ్ లోపల ముందు భాగంలో ఒకే సెన్సార్‌ను ఉండే అవకాశం ఉంది. Apple iPhone 13తో పోల్చినప్పుడు మెరుగైన లో లైట్‌ కెమెరా పనితీరులో సహాయపడే విధంగా సెన్సార్‌లను ఆప్టిమైజ్ చేసే అవకాశం ఉంది.

బ్యాటరీ: గత సిరీస్‌లతో పోలిస్తే iPhone 14 సిరీస్‌ మెరుగైన బ్యాటరీ పనితీరును అందిస్తుందని భావిస్తున్నారు. ఐఫోన్ 13 మంచి బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఒకే ఛార్జ్‌పై రోజంతా ఫోన్‌ను వినియోగించుకొనే అవకాశం ఉంది.

* ఐఫోన్ 14 ప్రో మాక్స్ డిజైన్

iPhone 14 Pro మోడల్స్ డిజైన్‌ను యాపిల్ కంపెనీ మారుస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే iPhone 14, iPhone 14 Max దాదాపుగా iPhone 13 లాగానే కనిపిస్తాయి. iPhone 14 Max ముందు భాగంలో వైడ్‌ నాచ్, రెండు కెమెరాలు కలిగి ఉండే అవకాశం ఉంది. వెనుక ప్యానెల్‌లో సెన్సార్లు ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 13 సిరీస్ లాగా ఫంకీ కలర్స్‌లో కూడా వస్తుందని భావిస్తున్నారు. ఏ కలర్స్‌లో ఫోన్‌లు లభిస్తాయనేదానిపై స్పష్టత లేదు.

* భారతదేశంలో iPhone 14 Pro Max ధర

ఒక టిప్‌స్టర్ ఇప్పటికే నాలుగు మోడళ్ల ధరలను లీక్ చేశారు. ఈ వివరాల ప్రకారం.. iPhone 14 Pro Max ధర 899 డాలర్లు. ఈ మొత్తం ఇండియాలో దాదాపు రూ.70,000 వరకు ఉండవచ్చు. ఇంపోర్ట్ డ్యూటీ, GSTతో కలిపి ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ఐఫోన్ 13 ప్రస్తుతం భారతదేశంలో రూ.69,900 ధరతో ప్రారంభమవుతుంది.

First published:

Tags: 5g technology, Iphone, Smartphones, Technology

ఉత్తమ కథలు