Home /News /technology /

IPHONE 14 LAUNCH IN 2022 SPECS FEATURE EXPECTED INDIA PRICE AND EVERYTHING WE KNOW SO FAR GH VB

iPhone: ఐ ఫోన్ లవర్స్ కు శుభవార్త.. త్వరలో బడ్జెట్ ధరలో.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దిగ్గజ స్మార్ట్ ప్రొడక్ట్స్ తయారీ సంస్థ యాపిల్ నుంచి గత ఏడాది విడుదలైన ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లకు మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలో కొత్త iPhone 14 ఫోన్లపై దృష్టి పెట్టింది యాపిల్ కంపెనీ. దీని లాంచింగ్‌కు కొన్ని నెలల సమయం పట్టవచ్చు. అయితే కొత్త యాపిల్ iPhone డివైజ్‌ ఫీచర్లు, స్పెక్స్, ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అవుతున్నాయి.

ఇంకా చదవండి ...
దిగ్గజ స్మార్ట్ ప్రొడక్ట్స్(Smart Products) తయారీ సంస్థ యాపిల్(Apple) నుంచి గత ఏడాది విడుదలైన ఐఫోన్ 13 సిరీస్(iphone 13 Series) ఫోన్లకు మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలో కొత్త iPhone 14 ఫోన్లపై దృష్టి పెట్టింది యాపిల్ కంపెనీ. దీని లాంచింగ్‌కు కొన్ని నెలల సమయం పట్టవచ్చు. అయితే కొత్త యాపిల్ iPhone డివైజ్‌ ఫీచర్లు, స్పెక్స్, ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అవుతున్నాయి. ఒక దశలో ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ అవ్వకముందే నెక్స్ట్ జెనరేషన్ ఐఫోన్ 14 లీక్‌లు బయటకు వచ్చాయి. ఈ సిరీస్‌లో రానున్న ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌లో యాపిల్ "హోల్ ప్లస్ పిల్ డిజైన్"‌తో విడుదలయ్యే అవకాశం ఉందని కొత్త రిపోర్ట్ తెలిపింది. ఐఫోన్ 14లో కెమెరా బంప్ ఉండకపోవడం మరో విశేషం. ఐఫోన్ 14(iPhone 14) సిరీస్ నుంచి రానున్న నాలుగు డివైజ్‌లు.. ఐఫోన్ 14, 14 ప్రో, 14 మాక్స్, 14 ప్రో మాక్స్ మోడళ్ల ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో పాటు ఇప్పటి వరకు లీకైన పూర్తి వివరాలు చూద్దాం.

Smartphone Hack: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. హ్యాకింగ్ గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

iPhone 14 స్పెక్స్, ఫీచర్లు..
- ప్రస్తుత ఐఫోన్‌ల లైనప్‌లో కొన్ని మార్పులతో కొత్త ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. యాపిల్ ఐఫోన్ మినీ సిరీస్‌ను స్క్రాప్ చేసి, దాన్ని సాధారణ సైజ్ స్మార్ట్‌ఫోన్లుగా ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తుంది. పుకార్లు నిజమైతే.. ఈ స్క్రాప్ ఫోన్లతోనే ఐఫోన్ 14 డివైజ్‌లు రావచ్చు.

- ఐఫోన్ 13 లాంచ్‌కు ఒక వారం ముందే ఐఫోన్ 14 ఫోటోలను విడుదల చేశారు ప్రముఖ టిప్‌స్టర్ జాన్ ప్రొస్సేర్. ఇవి పాత లైనప్‌ మోడళ్లుగానే కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రోలో యాపిల్ "హోల్ ప్లస్ పిల్ డిజైన్"ను ఉపయోగిస్తుందని ఎనలిస్ట్ రాస్ యంగ్ పేర్కొన్నారు. వీటిలో ఫ్రంట్ కెమెరా హోల్‌లో ఉండగా, ఫేస్-ఐడి సిస్టమ్ పిల్‌లో ఉంటుంది.

IGNOU: సామాజిక సేవను ఉద్యోగంగా మార్చే కోర్సు... మీరూ ఆన్‌లైన్‌లో చేయొచ్చు

- ప్రొస్సేర్ లీకుల ప్రకారం ఐఫోన్ 14 సింగిల్ సెంటర్డ్ పంచ్-హోల్ కెమెరాతో వస్తున్నట్లు తెలిసింది. 2017 నుంచి లైనప్‌లో వస్తున్న నాచ్ వీటిలో ఉండదు. కెమెరా మాడ్యూల్ లేకుండా రియర్ ప్యానెల్ ఫ్లాట్‌గా కనిపిస్తుంది. కెమెరా సెన్సార్‌లు సర్ఫేస్‌లో కలిపిసోయాయి.

- టిప్‌స్టర్ రాస్ యంగ్ ప్రకారం ఐఫోన్ 14.. 1170 x 2532 పిక్సెల్స్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.06 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఐఫోన్ 14 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఇదే సైజు డిస్‌ప్లేతో రానుంది. మరోవైపు టాప్-ఎండ్ iPhone 14 Pro Max మాత్రం 120Hz రిఫ్రెష్ రేట్‌తో, 6.68-అంగుళాల ప్యానెల్ OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్ మినీ మోడల్‌ను రీప్లేస్ చేస్తున్నట్లు భావిస్తున్న ఐఫోన్ 14 మాక్స్.. ఇదే డిస్‌ప్లేతో 60Hz రిఫ్రెష్ రేట్‌తో రానుంది.

- iPhone 14 సిరీస్‌కు యాపిల్ కొత్త చిప్‌సెట్‌ను తీసుకువస్తుంది. ఈ చిప్‌సెట్‌ పేరు A16 బయోనిక్.

- iPhone 13 సిరీస్‌లో స్టోరేజీని యాపిల్ 1TBకి పెంచింది. ఐఫోన్ 14 ప్రోలో స్టోరేజ్ 2TB వరకు పెంచే అవకాశం ఉంది. ప్రో మోడల్స్‌లో ర్యామ్‌ను 8GBకి, సాధారణ మోడళ్లలో 6GB వరకు పెంచవచ్చు.

- ఐఫోన్ 14 ప్రోలో హై రిజల్యూషన్ ఉన్న ప్రైమరీ కెమెరాను యాపిల్ చేర్చనుంది. కొన్ని సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న 12-మెగాపిక్సెల్ కెమెరా స్థానంలో 48-మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చు. ఈ కెమెరా 8కే వీడియో రికార్డింగ్ ఫీచర్‌కు సపోర్ట్ చేయగలదు.

iPhone 14 లాంచ్ డేట్
సరికొత్త ఐఫోన్ లాంచింగ్ ఈవెంట్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనుంది.

Study Vastu Tips: మీ పిల్లలు చదువులో సక్సెస్ కావాలంటే.. వారి స్టడీ రూంలో ఈ మార్పులు చేయండి..

iPhone 14 ధర (అంచనా)
ఇటీవలి లీక్‌లో ఐఫోన్ 14 సిరీస్ ధర వివరాలను టిప్‌స్టర్ లీక్స్ యాపిల్‌ప్రో వెల్లడించింది. దీని ప్రకారం iPhone 14 ధర 799 డాలర్లతో (సుమారు రూ.59,500) ప్రారంభమవుతుంది. ఇది గత సంవత్సరం వచ్చిన iPhone 13 ధరలతో సమానంగా ఉంటుంది. ఐఫోన్ 14 మ్యాక్స్ ధర $899 (దాదాపు రూ. 66,990) వరకు ఉండవచ్చు. అయితే ఈ సిరీస్‌లోని ప్రో మోడల్స్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఐఫోన్ 14 ప్రో ధర $1,099 (సుమారు రూ. 81,700), ఐఫోన్ ప్రో మ్యాక్స్ $1,199 (సుమారు రూ. 89,200) ధరకు లభించవచ్చని టిప్‌స్టర్స్ వెల్లడించారు.
Published by:Veera Babu
First published:

Tags: 5G Smartphone, Iphone, Mobiles, Smart phone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు