హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ల ప్రీ-బుకింగ్స్ ప్రారంభం.. యాప్ స్టోర్‌లో భారీ ఆఫర్లు.. ఇలా ఆర్డర్ చేసుకోండి..

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ల ప్రీ-బుకింగ్స్ ప్రారంభం.. యాప్ స్టోర్‌లో భారీ ఆఫర్లు.. ఇలా ఆర్డర్ చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐఫోన్ 14 (iPhone 14), ఐఫోన్ ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్ల కోసం ప్రీ ఆర్డర్లు సెప్టెంబర్ 9న ప్రారంభమయ్యాయి. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, UAE, US, 30 ఇతర దేశాల్లో శుక్రవారం సాయంత్రం 5:30 PM IST నుంచి ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

యాపిల్ (Apple) కంపెనీ ఈ వారం నిర్వహించిన లాంచింగ్ ఈవెంట్‌లో సరికొత్త ప్రొడక్ట్స్‌ను రిలీజ్ చేసింది. ముఖ్యంగా టెక్ లవర్స్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఐఫోన్ 14 (iPhone 14) సిరీస్‌ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లలో వీటిని కంపెనీ రూపొందించింది. అయితే కొత్త సిరీస్ ఫోన్ల ప్రీ బుకింగ్స్ తాజాగా ప్రారంభమయ్యాయి. ఐఫోన్ 14, ఐఫోన్ ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్ల కోసం ప్రీ ఆర్డర్లు సెప్టెంబర్ 9న ప్రారంభమయ్యాయి. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, UAE, US, 30 ఇతర దేశాల్లో శుక్రవారం సాయంత్రం 5:30 PM IST నుంచి ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఫోన్‌ను ఎలా బుక్ చేసుకోవాలి, దీనిపై క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఎలా ఉన్నాయి? వంటి వివరాలు చూద్దాం.

ఎక్కడ బుకింగ్ చేసుకోవచ్చు?

ఐఫోన్ 14 సిరీస్ డివైజ్‌లను యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ , రిలయన్స్ డిజిటల్, క్రోమాలో రిజర్వ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 9న బుక్ చేసుకున్న ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ డెలివరీలు సెప్టెంబర్ 16 నుంచి కస్టమర్లకు అందుతాయి. అయితే ఐఫోన్ 14 ప్లస్ యూనిట్లు మాత్రం అక్టోబర్ 7 నుంచి అందుతాయి.

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్‌పై స్టీవ్ జాబ్స్ కూతురు సెటైర్... వైరల్‌గా మారిన మీమ్

ధరలు

మన దేశంలో ఐఫోన్ 14 ప్రో ధర రూ. 1,29,900 కాగా, ఐఫోన్ 14 ప్రో మాక్స్ రూ. 1,39,900; ఐఫోన్ 14 రూ. 79,900; ఐఫోన్ 14 ప్లస్‌ రూ. 89,900కి లభిస్తుంది. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 128GB, 256GB, 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటిని డీప్ పర్పుల్, సిల్వర్, గోల్డ్, స్పేస్ బ్లాక్‌ కలర్లలో కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మోడళ్లు మిడ్‌నైట్, స్టార్‌లైట్, బ్లూ, పర్పుల్, ప్రొడక్ట్ రెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.

Apple Event: యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్.. ఐఫోన్ 14 విడుదల.. ప్రత్యేకతలివే

స్పెసిఫికేషన్లు

ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మోడళ్లు గత ఏడాది వచ్చిన ఐఫోన్ 13కు అడ్వాన్డ్స్‌డ్, అప్‌గ్రేడెడ్ ఫోన్లుగా నిలుస్తున్నాయి. వీటిలో గత సంవత్సరం అందించిన అదే A15 బయోనిక్ చిప్‌ను అందించారు. 60Hz OLED డిస్‌ప్లే కూడా పాత మోడళ్ల స్పెసిఫికేషన్. ఫోన్ల డిజైన్ కూడా పెద్దగా మారలేదు. అయితే వెనుక కెమెరా మాత్రం అతి తక్కువ లైటింగ్‌లో కూడా బెస్ట్ క్వాలిటీ ఫోటోలను తీయగలదు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లు 12MP ప్రైమరీ కెమెరాలతో లాంచ్ అయ్యాయి.

ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లు కొత్త A16 బయోనిక్ చిప్‌సెట్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్‌ అందించగలవు. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేతో కూడిన కొత్త వేరియబుల్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, కొత్త డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ వీటి సొంతం. ప్రో వేరియంట్లు 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా సెన్సార్‌తో వస్తాయి.

ఆఫర్ల వివరాలు

యాపిల్ అధికారిక యాపిల్ స్టోర్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో మోడళ్లపై ఆఫర్లను ప్రకటించింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లు 5 శాతం (రూ. 6,000 వరకు) ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ పొందవచ్చు. అన్ని ఐఫోన్ 14 సిరీస్ డివైజ్‌లపై 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. ఎంపిక చేసిన పాత ఐఫోన్ మోడళ్లతో రూ. 58,730 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Apple, Iphone 14

ఉత్తమ కథలు